పాలకుల నిరక్ష్యమే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల -తెలంగాణ టిడిపి రాష్ట్ర నేత దేవా నాయక్

పుడమిటివి తెలంగాణ న్యూస్

 

తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకుడు “దేవా నాయక్’ విచారణ వ్యక్తం చేశారు

 

గాడిపల్లి మధు పుడమి టివి తెలంగాణ ప్రతినిధి

అడ్డగోలుగా పెరుగుతున్న ధరల మంటల్లో సామాన్యుడి బతుకు, కుటుంబపోషణ భారంగా మారిందని తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకుడు “దేవా నాయక్’ విచారణ వ్యక్తం చేశారు.

నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న పాలకులు కనీసం స్పందించడం లేదని ని సామాన్య ప్రజలు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని దేవా అన్నారు.. బియ్యం, వంటనూనె, ఉల్లిగడ్డలు, పంచదార వంటి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయాలంటేనే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

పెరుగుతున్న ధరలు పేద, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రజపై అధిక ధరలను రుద్దడమే పాలకుల తీరు కన్పిస్తున్దని ని .ఏద్దేవా చేశారు.

దేశవ్యాప్తంగా ఏర్పడ్డ ఎల్ నీనో ప్రభావం కారణంగా ఏర్పడ్డ వర్షభావ పరిస్థితులు ఎలా ఉంటాయో ముందస్తుగా తెలిసీన ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా పాలన చేయడం వల్లనే అడ్డగోలుగా ధరలు పెరుగుతున్నాయని అన్నారు.

గత కొద్దీ రోజుల క్రితం రూ.1,750 (25 కిల్లోల) బియ్యం ధర ప్రస్తుతం రూ.2,350కు చేరింది. గతంలో రూ.105 ఉన్న వంటనూనె ధర ప్రస్తుతం రూ.190కు చేరిందని వివరించారు . రెండు నెలల క్రితం కిలో ఉల్లిగడ్డలు రూ.10 నుంచి రూ.20 వరకు ఉండగా, ప్రస్తుతం కిలో రూ.50కు చేరిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచదారతో పాటు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని దీంతో పేద మధ్యతరగతి జీవితాల మీద తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు.

రోజువారీ కూలి పనులు చేసుకునే కార్మికులు, చిరుద్యోగులు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్నారని. ఒకవైపు ఆదాయం పరిమితంగా ఉంటే, మరోవైపు ఇంటి అద్దె, పిల్లల చదువులు, వైద్యం, కిరాణా ఖర్చులు పెరుగుతుండటంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .

ధరల పెరుగుదలను నియంత్రించేందుకు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, మార్కెట్ ధరలను పర్యవేక్షించాలని, నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన కోరుతున్నారు.

కుటుంబాన్ని పోషించేది ఎలా? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని దేవా నాయక్ అన్నారు ఇప్పటి కైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దరలపై నియంత్రణ చర్యలు తీసుకోల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు

ఉమ్మడి రాష్ట్రంలో ఏకదాటిగా తొమ్మిది సంవత్సరాలు కరువు విలయతాండం చేసిన మా తెలుగు దేశం పార్టీ జాతీయ నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు విజన్ తో ప్రజలకు కష్టాలు రాకుండా కరువును ఎదుర్కొని గొప్ప నాయకుడిగా ప్రజల చేత మన్ననలు పొందారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకోసం పాలన జరగడం లేదని పాలకుల తీరుపై ఏద్దేవా చేశారు.

రానున్న రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని దేవానాయక్ అన్నారు. ధరలు దరలు పెరగకుండా ముఖ్యమంత్రి,మంత్రులు, ఎమ్ ఎల్ ఏ లు చూడాలని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *