సీతక్కతో సెల్ఫీ

పుడమిటివి న్యూస్

రిషిత తో మంత్రి సీతక్క

 

ఎలకంటి నరేష్
తెలంగాణ బ్యూరో చీఫ్ పుడమిటి

వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 18 ఏళ్ల నిరుపేద యువతి కొల్లూరి రిషిత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. డిఎండి వ్యాధి కారణంగా రెండు కాళ్లు పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉన్న రిషితకు రాష్ట్ర మంత్రి దానసరి అనసూయ సీతక్కతో కలిసి సెల్ఫీ దిగాలనే కోరిక ఉంది.

రిషిత కోరిక గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి సీతక్క శుక్రవారం సాయంత్రం హనుమకొండలోని కొత్తూరు జెండా ప్రాంతంలో ఉన్న రిషిత నివాసానికి స్వయంగా చేరుకున్నారు. రిషితను పరామర్శించిన సీతక్క, ఆమెతో కలిసి సెల్ఫీ దిగి ఆమె కోరికను నెరవేర్చారు.

ఈ సందర్భంగా రిషిత కుటుంబ సభ్యులతో మంత్రి సీతక్క మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిషితకు అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి సీతక్క రిషిత ఇంటికి వస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆమెను చూసేందుకు తరలివచ్చారు. రిషిత కోరికను తెలుసుకుని స్వయంగా ఆమె ఇంటికి వచ్చి నెరవేర్చిన సీతక్కపై స్థానికులు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *