సాహితి వనంలో దండమూడి

                                                                                                             పుడమిటివి జన సాహిత్యం   

                                                                                                            సాహితి వనంలో దండమూడిశ్రీ చరణ్

                                                                                                                 నాగబెల్లి జితేందర్ సామ్రాట్
                                                                                      ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి ఎంవిఆర్ మానవవికాసరచనలు పబ్లికేషన్స్ 

శిల్పిచేతిలో ఉలిదెబ్బలు తిన్న రాయి శిల్పమై దైవ రూపమై దివ్య దర్శనంతో కనువిందు చేసినట్లు అక్షరాలకు పదును పెట్టి సాహిత్యపు వనంలో కవితలు పాటలు నాటికలు కథలునవలలు వ్యాసాలుగా మార్చి చైతన్య దివిటీలను వెలిగిస్తారు కవులు రచయితలు. తెలంగాణ సమాజంలో శ్రమజీవుల చెమట చుక్కల నుండి పుట్టిన అనేక సాహితి ప్రక్రియలు జనం గొంతుకలై నిల బడ్డాయి అందులో పాట ప్రత్యేకతను చాటుకుంది. జానపదం, సినిమారంగం, భక్తి పాటలు ఏవైనా కావచ్చు సచ్చు పోయిన నరాలల్లో రక్తప్రసరణ చేపించి నిద్రావస్థహాలో వున్న మనిషిని తట్టిలేపుతుంది.పాటను ప్రజల పక్షాన నిలిపిన వేలాది మంది కవులల్లో ఒకరైన దండమూడి శ్రీ చరణ్ బహుభాష కోవిధుడుగా, పాటల రచయితగా తన ప్రత్యేకతను చాటుకున్నారు.

నిజాం సర్కార్ ను రజాకార్లను తరిమిన తెలంగాణ సాయుద పోరాటానికి పురుడు పోసిన ఉమ్మడి నల్లగొండ మట్టిపై ఎన్నో ఎర్రని మందరాలువికశించి నేలపై రాలిపోయాయి.అక్కడే అక్షరాలను మొలిపించికదించిన వందలాదిమంది కవులు రచయితలను కన్నది ప్రకృతి అందాలకు సంకల్పానికి పేరొందిన భువనగిరి సాహితి వనంలో పుట్టినదండముడి శ్రీ చరణ్ తెలంగాణ, తెలుగు సమాజంలో రచయితగ కవి గా తన ప్రత్యేకతను చాటుచున్నారు.

పాటల పొద్దులో ఉదయించిన దండమూడి శ్రీ చరణ్ సీనిరంగంలో పాటలు అందించి ప్రత్యేక గుర్తింవుపొందారువివిధ చిత్రాలకు 40 పాటలను అందించడంతో పాటు అనేక పురస్కారాలను అందుకున్నారు అందులో కొన్ని రామదాసి రాజారాం మహరాజ్ స్మారక పురస్కారం,కళాసాధన సంస్థ ద్వారా రెండు పురస్కారాలు ..కళాసాధన విశిష్ట సాహితీ పురస్కారం, కళాసాధన సాహితీ సాఫల్య పురస్కారం, లాంతర్ సాహితీ పురస్కారం, తెలంగాణ సామాజిక రచయితల సంఘం సాహితీ పురస్కారం  లోగిలి సాహితీ వేదిక సాహిత్య పురస్కారం,  సృజన సాహితీ సంస్థ సాహితీ పురస్కారం.శ్రీమతి గొంగిడి సునీత గారి ద్వారా ఉగాది సాహితీ పురస్కారాలతో పాటు సామాజిక మాద్యమాలల్లోవివిధ యూట్యూబ్ చానల్స్ కు 40 పైగా పాటలురాశారు

 

సామాజిక సమస్యల పై వెంటనే స్పందించి కవితలు అందించడంలో అందెవేసిన చెయ్యి సమస్యలపై తన అక్షరాలతో సంధించడంలో దండ మూడిడిది ప్రత్యేక శైలి తన కవిత్వంతో ఏడు కవితాసంపుటులు ప్రచురించి ప్రత్యేకతను చాటారు.అంతే కాకుండా అనేక డాక్యుమెంటరీ రచనలు చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు.కేంద్ర ప్రభుత్వం ద్వారా “స్వచ్ఛ భారత్” డాక్యుమెంటరీ ఎక్సలెన్స్ అవార్డు అప్పటి కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు ద్వారా అందుకున్నారు

కవిగా రచయితగా గేయరచయితగా గుర్తింపు పొందిన దండమూడి, ఇంగ్లిష్ నుండి తెలుగుకు తెలుగునుండి ఇంగ్లిష్ లోకి మార్చడంలో తెలుగుసమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. అనేక మంది కవులు రచయితలకు తమ రచనలను తెలుగునుండి ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయడంలో తన సాహితి ప్రతిభను కనభరిచి ప్రత్యేక గుర్తింపు పొందారు. దండమూడి మరిన్ని రచనలు అందించి సాహితి వనంలో ముందుకు సాగాలని కోరుకుందాంమాజానికి సాహితి నేస్తం, అరవై వసంతాల జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న దండమూడి శ్రీచరణ్ గారికి పుడమి టివి తరపున జన్మదిన శుభాకాంక్షలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *