బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ రాజీనామా చేయాలి

 

 

 

 

వరంగల్ కోర్టు ముందు న్యాయవాదుల నిరసన

ఎలకంటి నరేష్
తెలంగాణ బ్యూరో చీఫ్

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ చేస్తున్న అనుచిత చర్యల వల్ల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గౌరవాన్ని, విశ్వసనీయతను, సంస్థాగత వైభవాన్ని కోల్పోయిందని వాటన్నింటి పునరుద్ధరించడానికి అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను చట్టబద్ధంగా నడపటానికి బిసిఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రాజీనామాను డిమాండ్ చేస్తూ వరంగల్, హనుమకొండ జిల్లా న్యాయవాదులు కోర్టు ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో బాగంగా శుక్రవారం హనుమకొండలో జరిగిన నిరసనలో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, కాంగ్రెస్ లీగల్ సెల్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎ ఐ ఎల్ యు రాష్ట్ర కోశాధికారి ఎన్నంశెట్టి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ న్యాయవాద వృత్తి నిలబెట్టాల్సిన రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేసే న్యాయవాదుల నిజమైన ప్రజాస్వామిక, స్వతంత్ర, ప్రాతినిధ్య సంస్థగా బిసిఐని చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా బ్రస్టు పట్టిస్తున్నాడని, ఏకపక్ష నిర్ణయాల వల్ల న్యాయవాదులకు రక్షణ కరువైందని అన్నారు. ఉన్నత విద్యా సంస్థ అయిన నల్సార్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించి కాబోయే న్యాయవాదుల భవిషత్ ను నాశనం చేయాలని చూసిన మనన్ కుమార్ మిశ్రా భారత బార్ కౌన్సిల్ చైర్మన్ పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనుచిత చర్యలకు పాల్పడి విద్యార్థులకు క్షమాపణ చెప్పిన మనన్ కుమార్ చైర్మన్ పదవికి అనర్హుడని అన్నారు. తన ఆదిపత్య ధోరణితో, పలుకబడితో, బిజెపి అండతో గత 14 ఏండ్లుగా చైర్మన్ గా కొనసాగుతూ తన వ్యక్తిగత నిర్ణయాలతో ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచి స్వీయ ప్రయోజనాలు పొందుతున్నారని విమర్శించారు. మనన్ కుమార్ బిజెపి పార్టీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన కూడా బి సి ఐ చైర్మన్ పదవిని విడిచిపెట్టకుండా న్యాయవాద వ్యవస్థకే విలువ లేకుండా చేస్తున్నారని అన్నారు. ఆయన పరిధిలోకి రాని ముఖ్యమైన విషయాలైన పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 రద్దు, రైతు వ్యతిరేక చట్టాలపై ఆందోళన గూర్చి, వ్యవసాయ కార్మికుల ఆందోళన గూర్చి జారీ చేసిన ప్రకటనలు బిసిఐ విలువను దిగజారుస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల జీవన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ దేశాన్ని పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా నడవాల్సిన వ్యవస్థలపై అజమాయిషీ చేస్తుందని అలాంటి దుర్మార్గ పాలన కొనసాగిస్తున్న బిజెపి కి వంత పాడుతూ బిసిఐ ని బ్రస్టు పట్టిస్తున్న చైర్మన్ మనన్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. మనన్ కుమార్ రాజీనామా చేసే వరకు దేశ వ్యాప్తంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. 1961 న్యాయవాదుల చట్టం కింద ఏర్పాటు చేసిన బి సి ఐ చట్టబద్ధమైన సంస్థ అని రాజ్యాంగ బద్ధంగా విధులను నిర్వహించి న్యాయవాదుల హక్కుల కోసం, రక్షణ కోసం పనిచేయాలని చైర్మన్ మనస్ కుమార్ అందుకు భిన్నంగా ప్రవర్తించడంతో దేశ వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. విభిన్న రాజకీయ భావాలున్న న్యాయవాదులకు నాయకత్వం వహించే బిసిఐ చైర్మన్ ఒక పార్టీకి, ఒక భావజాలానికి చెంది ఆ పదవిలో కొనసాగుతూ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలిపిన విద్యార్థులను దేశ వ్యతిరేక శక్తులని, దేశ ద్రోహులని మాట్లాడడం హేయమైన చర్య అని, ఆయన వెంటనే రాజీనామా చేసి బిజెపి కి ఊడిగం చేసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎల్ యు రాష్ట్ర కమిటీ సభ్యులు సారంపల్లి మధుసూదన్ రెడ్డి, ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల జీవన్ గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు జన్ను పద్మ, జిల్లా నాయకుడు పెండ్యాల అనిల్, జన్ను ప్రభాకర్, హనుమకొండ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రఘుపతి, ఐ ఎ ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీమనాథం శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొత్తపల్లి చిరంజీవి, చంద్రమౌళి, మేడారపు రంజిత్, పాము రమేష్, న్యాయవాదులు అబ్దుల్ నబి, ఆనంద్, గంజి రమేష్, గంధం శివ, పూర్ణచందర్, భవాని ప్రసాద్, ప్రభంజన్, పూసపల్లి శ్రీనివాస్, యాకస్వామి, బండి మొగిలి, ఇజ్జగిరి సురేష్, మల్లేష్, విష్ణు వర్ధన్, వేముల రమేష్, బండి హరీష్, గురిమిల్ల రాజు, మర్రి రాజు, బానోత్ విజయ్, మేకల రంజిత్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *