ఎంవిఆర్ భవనం నుండి పుడమిటివి న్యూస్
పుడమిటివి జనసాహిత్యం
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఐపిఎస్
నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి ఎంవిఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్
భూకబ్జాలు, సెటిల్మెంట్లు, హత్యలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న రౌడీల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మరో వైపు విచ్చలవిడిగా డ్రగ్స్ సేవించి యువత రౌడీలకు అనుచరులుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న పలు సంఘటనల పై నగరంలో జరుగుతున్న వరుస హత్యలను చేదించడంతో పాటు, నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు చేయడం కంటే నేరాలు జరగకుండా చూడాలని వరంగల్ పోలీసు కమిషనర్ ప్రత్యేక దృష్టిసారించారు.
విద్యావంతులకి, ప్రశ్నించే గొంతుకలుగ దేశ వ్యాప్తంగా ప్రత్యేకతను చాటుకున్న వరంగల్ లో రౌడీ మూకల ఆగడాలు పెట్రేగి పోవడంపై పోలీస్ శాఖ జీర్ణిచుకోలేక పోతుంది. వరంగల్ లాంటి మహానగరంలో శాంతిభద్రతల విషయంలో ప్రధానంగా రౌడీయిజంపై ప్రజలనుండి వస్తున్న అనేక ఫిర్యాదుల పై కమిషనర్ ప్రత్యేక దృష్టిపెట్టారు.
సాంకేతికరంగంలో అపారమైన జ్ఞానం వున్న “శ్వేత’నేరాలను అదుపు ,చేయడంలో నేరస్తులను కట్టడి చేయడంలో అందెవేసిన చేయిగా పేరుంది. వరంగల్ కమిషనర్ గా అడుగుపెట్టిన కొద్దీ రోజుల్లోనే టెక్నాలజీ ఉపయోగించి,క్లిష్టమైనఒక కేసును చేదించి ప్రత్యేక గుర్తింపు పొందింది.
2012 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన “శ్వేత’ పోలీసు యూనిఫామ్ ధరించి విధుల్లో చేరిన మొదటి రోజునుండే తనదయిన శైలిని ప్రదర్శిస్తూ వస్తున్నది.
కామారెడ్డి ఎస్పీగా, మొదలుకుంటే హైదరాబాద్ బాద్ రేంజ్ లో, వివిధ విభాగాలల్లో చేసిన కృషి, సిద్దిపేట సిపిగా సమర్ధత, విధులు నిర్వర్తించిన ప్రతి చోట పేరులో వున్న వెన్నెల వెలుగులు భాధితుల్లోనింపి, నేరస్తులగుండెల్లో సింహస్వప్నంగా వేటాడటం ఆమెలో కనిపించే నైజం
ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ఆందోళన, హల్చల్ కనపడనీయకుండా ముఖంలో కనిపించే ఒక చిరునవ్వు నేరస్తుల తాటతీసి కటకటాల పాలు చేయడమే లక్ష్యంగా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. అనేక విభాగాలను రంగంలోకి దింపి కేసును చేదించే వరకు ఓంగార్డ్ నుండి ఉన్నత స్థాయి అధికారులకు ముచ్చేముటలు పుట్టిస్తుంది.అందుకే ఆమె టీమ్ లో పని చేసే పోలీసులకు లకు తమ ప్రాంతంలో నేరాలు జరగకుండా వుండాలని కోరుకుంటారు.
నేరపరిశోదనల్లో శ్వేత”ది ప్రత్యేక శైలి రాష్ట్ర రాజదానిలో వివిధ విభాగాల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. లా అండ్ ఆర్డర్ లోనే కాకుండా, డీటేక్టీవ్ విభాగంలో డిసిపి గా కొనసాగి అనేక సంఘటనలను చేధించింది, ఆర్తిక నేరగాళ్ళ పై ఉక్కు పాదం మోపింది. 140మంది పోలీసు ఉద్యోగులు తమ పొదుపును, పదవి విరమణ ప్రయోజనాల కోసం నిల్వ చేసుకున్న 26 కోట్ల రూపాయలను ఒక సంస్థలో పెట్టి మోసపోయారు. ఆర్ధిక నేరగాళ్లు అందరికి దైర్యమై నిలిచే తమ డిపార్ట్మెంట్ కుంటుంబాలనే దోచుకోవడంపై మండి పడ్డది, తనకు పోలీసుకుటుంబాల నుండి ఫిర్యాదు అందినవెంటనే దర్యాప్తును వేగవంతంగా చేసి, ఆ కుటుంబాలకు అండగా నిలబడి వారికి నేనున్నానే భరోసానిచ్చింది. డబ్బులను ఆర్ధిక నేరగాళ్ళ మెడలువంచి వారికి డబ్బులు ఇప్పించి తమ కుటుంబసభ్యురాలిగా శబాష్ అనిపించుకుంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు మూడు” సిట్ ‘ ప్రత్యేక దర్యాప్తు బృందాలకు నాయకత్వం వహించి కేసులపై ప్రభుత్వం విధించిన గడువు కంటే ముందుగానే నివేదికలు సమర్పించి మంచి ఇన్వెస్టిగెషన్ ఆఫీసర్ గా పేరు సంపాదించుకొని ఉన్నత అధికారులతో పాటు ప్రభుత్వ మన్ననలు పొందింది.
వరంగల్ కమిషనర్ గా అడుగు పెట్టగానే ప్రధాన మైన నేరాలు సమస్యలపై దృష్టిపెట్టింది, పెట్రేగిపోతున్న రౌడీయిజం, భూకబ్జాలు, డ్రగ్స్ మాఫియా పై ఫోకస్ పెట్టింది. రౌడీయిజం నూలాలపై నిఘావిభాగాల నుండి sa తెప్పించుకుని, రౌడీయిజం, డ్రగ్స్ సరఫరా చేసేవారిపై ఉక్కుపాదం మోపుతుంది. ప్రతినెల జరిగే క్రైం మీటింగ్ లో రౌడీల ప్రవర్తన పై ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి నేరమయమైన వ్యక్తుల కదలికల పై దృష్టిసారించింది.
వరంగల్ పోలీసులంటేనే నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టేది, అలాంటి వరంగల్ లో పోలీసింగ్ విధానం మారిందనేది చర్చ కొనసాగుతుంది. ప్రాణాలకు ఎదురోడ్డి నిలబడిన వరంగల్ పోలీసులు ప్రాణ త్యాగలకు వెనకాడని చరిత దేశ వ్యాప్తంగా వుంది అలాంటి వరంగల్ పోలీస్ విభాగంలో పోలీసు వ్యవస్థపైన కొందరు అధికారులు, సిబ్బంది చేతి వాటం నేరస్తులకు సహకరించడమే కాకుండ ,కమిషనరేట్ కార్యాలయంలో పనిచేస్తున్నామని నేరుగా బెదిరింపులకు పాల్పడటమే కాకుండా స్టేషన్ హౌస్ ఆఫీసర్లను సైతం పై అధికారులతో చెప్పిస్తామని చెప్పినట్లు ఆరోపణలు వున్నాయి
ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేసే వారివల్ల ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. ఇటీవలననే కమిషనర్ గా బదిలిపై వెళ్ళిన ఒక అధికారి,మీడియా ప్రతినిధుల ముందు వెల్లడించిన విషయాలు వరంగల్ పోలీస్ వ్యవస్త పైన నమ్మకం లేకుండా పోతుంది. గంజాయి పట్టుకున్న పోలీసులే గంజాయిని కాజేశారని,భార్య భర్తల సమస్యలతో వస్తే అక్రమ సంబంధాలు నేరపి కుటుంబాలను చిన్నభిన్నం చేసి తమ యూనిఫామ్ బలాన్ని కొనసాగించారని భూకబ్జా దారులకు అండగా నిలిచారని, రౌడీలకు వత్తాసు పలకడం వల్లే సస్పెండ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించడం ఇక్కడి పోలిసింగ్ పై నమ్మకం కొల్పోయే విధంగా ఏర్పడింది.
పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొందరు హోమ్ గార్డ్ నుండి మొదలుకుంటే అధికారుల వరకు భూకబ్జాలకు వెన్నుదండుగ ఉన్నారనే ప్రచారం కొనసాగుతుంది. కమిషనర్ తన కార్యాలయం నుండె ప్రక్షాలన మొదలు పెడితే వరంగల్ పోలీస్ కు వున్న గొప్ప పేరుకు మచ్చ లేకుండా చేయవచ్చనేది సామాన్య ప్రజలు సైతం కోరుకుంటున్నారు.
పోలీస్ కమిషనర్ గా శ్వేత ప్రతి పోలీస్ స్టేషన్ ను సందర్శిండమే కాకుండ అధికారులకు పెండింగ్ లో వున్న కేసులను సత్వరమే పర్యవేక్షించడం, ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి నేరాలను అదుపుచేయడం, నేరం చేసిన నిందితులను కొద్దీగంటల్లోనే అదుపులోకి తీసుకొని కేసును చేదించడం పై ప్రజలకు కమిషనర్ అంటే ఎనలేని గౌరవం పెరిగిపోతుంది. ఇంజనీర్ విద్యను అభ్యసించిన కమిషనర్ శ్వేత నేరాలను అదుపు చేయడంలో సాంకేతికతను ఉయోగిస్తూ ముందుకు సాగుతుంది. డ్రగ్స్, రౌడీయిజం రహిత వరంగల్ కమిషనరేట్ వైపుకు అడుగులు వేస్తున్న సిపి శ్వేత తనదైన పోలిసింగ్ తో ప్రత్యేకతను చాటుకుంది.
దర్యాప్తును వేగవంతం చేయడం నేరాలను అదుపుచేయడంతో పాటు నేరం చేసిన నిందితులను కొద్దీగంటల్లోనే అదుపులోకి తీసుకొని కేసును చేదించడం పై ప్రజలకు కమిషనర్ అంటే ఎనలేని గౌరవం పెరిగిపోతుంది. ఇంజనీర్ విద్యను అభ్యసించిన కమిషనర్ శ్వేత నేరాలను అదుపు చేయడంలో సాంకేతికతను ఉయోగిస్తూ ముందుకు సాగుతుంది. డ్రగ్స్, రౌడీయిజం,సైబర్ నేరాల రహిత వరంగల్ కమిషనరేట్ వైపుకు అడుగులు వేస్తుంది.వచ్చిన కొద్దీ నెలల్లోనే పోలీస్ బాస్ పని విధానం చూసి,సిపి శ్వేత తనదైన పోలిసింగ్ తో పోలీసు వ్యవస్థలో మార్పుకు శ్రీకారం చుడుతుందనే నమ్మకం ప్రజల్లో బలంగా వుంది.

