పుడమిటివి మా ఊరి ముచ్చట

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీఫ్
7799071177

అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చి తన చనుబాలు ధారతో బిడ్డలో నరనరాన జీవశక్తిని ప్రసరింప చేసినట్టు కవులు,కళాకారులు .తమసాహిత్యం కళాప్రదర్శనలతో సామాజిక చైతన్యపు వెలుగుల దివిటీలను వెలిగిస్తూ ప్రజల హృదయాలలోజీవిస్తున్నారు.మనుషుల తత్వాన్ని శక్తి సామర్ధ్యాలను లోపాలను వ్యక్తిత్వాలను నేరుగా చెప్పలేక మనలోని మనుషులప్రవర్తనను కళాప్రదర్శనలతోసమాజంముందుఉంచి సమాజపరిణతికి సమిధలయ్యెది కళాకారులు మాత్రమే మానవనాగరికతకు జీవంపోసినకళాసంపద ఆధునికసమాజంలో అరచేతిలో వినోదం కొలువైన వేళ అంతరించి పోతున్న నాటక కళారంగానికి ఉపిరి పోస్తూ యాభై వసంతాలనుపూర్తి చేసుకుని స్వర్ణోత్సవ పండుగను జరువుకుంటుంది కళాభారతి సాంస్కృతిక సంస్థ.
తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్న వేళ స్వంత రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి నాటక పోటీలను సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించి ప్రత్యేకతను చాటుకున్న కళాభారతి సాంస్కృతిక సంస్థ తెలంగాణ దశాబ్దిఉత్సవాలలో స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం నాటకరంగం మరో వందేళ్లు ప్రజల హృదయాల్లో జీవించేందుకు పునాది వేస్తుంది .

1971 లో ఏర్పడ్డ కళాభారతి సాంస్కృతిక సంస్థ నాటక రంగాన్ని బతికిస్తూ సామాజిక సేవలో ఇప్పటి వరకు కొనసాగుతుంది .ప్రజాకవి కాళోజి ముఖ్య అతిధిగా దివంగత మంత్రి దాస్యం ప్రణయ భాస్కర్ అతిధులుగా మూడు రోజుల పాటు 1995 లో రజితోత్సవ వేడుకలను నిర్వహించిన కళాభారతి సాంస్కృతిక సంస్థ నిరంతరం కళా ప్రదర్శనలను ఇస్తూ నాటక రంగానికి జీవం పోస్తూ స్వర్ణోత్సవ వేడుకలుజరుపుకోవడంకళాకారులుకళాపోషకులు కృషికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది
పల్లెతనాన్ని నిండుగా నింపుకున్న ఈ మట్టిమహిమ ఏమోగానీ గత వందేళ్ల క్రితమే కళాకారులను కన్నదీనేలా ఆరెపల్లి మట్టిబిడ్డలు చిరుతల రామాయణం పౌరాణిక నాటకాలు కోలాటాలు భజనలలతో కళాప్రదర్శనలు ఇచ్చారు స్వాతంత్ర్య ఉద్యమవ్యాప్తికి కృషిచేశారు.

పొగాకు వీరాస్వామి కాంటి వాడి నర్సయ్య బొమ్మగాని కొమురయ్య రక్తాని రాజేశ్వర్ రావు పొగాకు వెంకటయ్య బరుపటి పాపయ్య బొమ్మగాని వీరయ్య
పొగాకు దశరథం, బుద్ధే ముత్తయ్య, ,బుద్ధేమొగిలయ్య( దొంగరిమొగిలయ్య ), వల్లాల మొగిలయ్య , బొమ్మగాని ఎల్లయ్య, బొమ్మగాని నారాయణ, బొమ్మగాని సాంబయ్య, అమీగే రామారావు, కోటగిరి నర్సయ్య, గౌని నర్సయ్య , కోటగిరి లక్ష్మయ్యలు పౌరాణిక నాటకాలు అనేక గ్రామాలల్లో ప్రదర్శించారు రాముని పాత్రలో పొగాకు వీరాస్వామి కాంటి వాడి నర్సయ్య లు సీత పాత్రలో సీత కొమురయ్య లు లక్ష్మణుడిగా రక్తాని రాజేశ్వర్ రావు హన్మంతునిగా బరుపటి పాపయ్యలు తమ ప్రత్యేకతను చాటి జిల్లాలో తమ ప్రదర్శనలతో ఆరెపల్లి పేరును నిలబెట్టారు.

మారుతున్న కాలానుగుణంగా సమాజ మార్పు కోసం సాంఘీక నాటకాలను ప్రదర్శించడం కోసం గ్రామంలో అక్షరాస్యతను పెంచడం కోసం తాటికొండ పెద్ద భద్రయ్య అధ్యక్షతన డాక్టర్ నాగబెల్లి సత్యదేవ్ డాక్టర్ నాగబెల్లి సాంబయ్య మహ్మద్ యాకుబ్ పొగాకు ధర్మయ్య గౌని రాజేశ్వర్ ,పొగాకు సుదర్శన్ పాగాకు పొగాకు సారయ్య ల నేతృత్వంలో సామాజిక చైతన్యం కోసం సాంఘీక నాటికలను ప్రదర్శించారు .
నాగబెల్లి దర్శన్,,జంగాసాంబయ్య,, నాగబెల్లి రవీందర్, దయ్యలా మల్లయ్య, పొగాకు ధనుంజయ్య, దుబ్బాకుల శంకరయ్య, మహ్మద్ బషీర్ ఫోరెన్సిక్ ,, పొగాకు రవీందర్ ,నాగబెల్లి వెంకటేశ్వర్లు, మహ్మద్ షబ్బీర్, బషీర్,,యువకులు నాటక ప్రదర్శనలు చేయడమే కాకుండా గ్రామంలో రోడ్ల నిర్మాణం, ఆదర్శ గ్రంథాలయాన్ని ఏర్పాటుకు కృషి చేశారు

కళాభారతి సంస్థ పురుడు పోసుకోవడానికి మూలస్తంబమైన పొగాకు సుదర్శన్ పొగాకు సారయ్య బుద్ధే సాంబయ్య పొగాకుచంద్రం జంగరాజయ్య కందుల చంద్రయ్య మేకల సారయ్య ,బుద్ధే గోపాల్, శిర్ల రాములు, శిర్ల మల్లయ్య, బుద్ధే సుధాకర్, బుద్ధే సూర్యం, బుద్ధే సూర్య ప్రకాష్, బరుపటి ఆగయ్య, బుద్ధే సాంబయ్య, ( బియ్యం ) లు కళాభారతి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక సభ్యులుగా కృషి చేశారు.
కళారంగమే ఊపిరిగా పొగాకు సుదర్శన్, సారయ్య, చంద్రం, బుద్ధే సాంబయ్య, మహ్మద్ యాకుబ్, పొగాకు రాజేశ్వర్, ఆదిరెడ్డి, బొమ్మగాని భాస్కర్, పొగాకు మోహన్, పొగాకు రమేష్, బరపటి రమేష్, సిందే నరేందర్, సిందే రవీందర్, జంగరఘువీర్, షేక్ హాజీ, పొగాకు మహేందర్, తాటికొండ శివ, కోటగిరి స్వామి లు అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శనలు ఉత్తమ నటులు అవార్డులను దక్కించుకొని ఆరెపల్లి మట్టిపరిమళాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టారు .

యువతలో చైతన్యం తీసుక రావడం కోసం ఏర్పాటు చేసిన చైతన్య యూత్ లో ఎలక్షన్ లు వచ్చాయి నాటికవేసి జిల్లా రాష్ట్ర స్థాయి అవార్ఫులు పొందారు. మేకల నర్సింహస్వామి బొమ్మగాని భాస్కర్ పొగాకుకుమారస్వామి పొగాకు రమేష్ జనగాం కుమారస్వామి జంగాలక్ష్మణ్ మంగ నర్సయ్యలు నటనలో తమ ప్రతిభను చూపారు .
సాహిత్యంలో సహితం ఆరెపల్లి ప్రత్యేకతను చాటుకుంది కాళోజి నేతృత్వంలో కవి సమ్మేళనాలు నిర్వహించింది షేక్ హాజీ రహిమ్ కవులుగా నిలబడ్డారు నాగబెల్లి అరుణ్ కుమార్ షార్ట్ ఫిలిమ్స్ రచయితగా కందగట్ల వికాస్ బొమ్మగాని భాస్కర్ పొగాకు రమేష్ బుద్ధే చంద్రశేఖర్ జంగరఘువీర్ యాదవ్ సిందే రవీందర్ రావు మహ్మద్ యాకుబ్ గౌని ప్రమోద్ లు నటులుగా కొనసాగుచున్నారు.

నాటక రంగంలో యువత ఎలాంటి సంస్థల ప్రమేయం లేకుండా నాటికలు ప్రదర్శించారు ఐదులాపురం శారద, పూజారి ఉమా,నాగబెల్లి స్వరూప, పొగాకు విజయ, కీ శే పొగాకు అనురాధలు అనేక నాటికలు వేశారు ఉప్పుల సతీష్ అడ్డగట్ల శ్రీధర్ గ్యాదర్ల రాజేష్ వి వెంకట్ సుంకరి రాజ్ కుమార్ దయ్యలనరేష్ రాజేందర్, కందగట్ల సతీష్, వల్లల చంద్రం బిజిలి సంపత్ పొగాకు సునీత లు నాటికలు ప్రదర్శించి జిల్లా స్థాయిలో అవార్డులు పొందారు.

ఆరెపల్లి కళా సంస్థలకు జ్యోతి జయకర్ ఆస్థాన దర్శకుడిగా ఎస్ ఎన్ చారి ,డాక్టర్ మధుబాబు, సంధి రాజారెడ్డి పొగాకు సుదర్శన్ లుదర్శకత్వం వహించారు .
కళ కళకోసం కాదు ప్రజల కోసం ప్రజల వినోదం కోసం నాటక రంగాన్ని భావితరాలకు అందించడం కోసం కృషిచేస్తున్న కళాభారతి సాంస్కృతిక కళకారులు బుద్ధే సాంబయ్య ( ఎక్సయిజ్ )

షేక్ హాజీనూరాని సిందే రవీందర్ రావు బొమ్మగాని సుదర్శన్ సిందే నరేందర్ బుద్ధే గోపాల్ జనగాం కుమారస్వామి, పొగాకు ప్రవీణ్ కుమార్, పొగాకు రమేష్, శిర్ల రాములు ,పొగాకు ఎల్లాగౌడ్ ,మెరుగు నర్సయ్య, బుద్ధే రాజ్ కుమార్, కందుల చంద్రయ్య, ఎండి యాకుబ్ ,పొగాకు సుధాకర్, సుంకరి సదానందం బరపటి రమేష్ ,జంగా లక్ష్మణ్, కొమ్మినేని సంతోష్, పాల్వాయి శరత్ కళ్యాణ్, పొగాకు వరుణ్, కుమార్ పొగాకు ప్రదీప్, పొగాకు సునీతా మహేందర్ లకు బుద్ధే సాంబయ్యఆగయ్య కళాభారతికి ఆర్థిక చేయూతనందించినసుందరమూర్తిలకు కళాభారతికళాకారులకథనాలను అందించిన తాటికొండ శ్రీహరికి, కళాపోషకులకు ఆరెపల్లి మట్టిబిడ్డల తరపున కళాభారతిస్వర్ణోత్సవ కళాభివందనాలు