దామెర చెన్నప్ప పేరే చెన్నై మహానగరం

 

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీప్
పుడమిటివి న్యూస్ &ఎంవిఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్

7799071177

👉సమాధి చేయబడ్డ వాస్తవిక చరిత్ర

👉ఆంధ్ర తమిళనాడు పై ఓరుగల్లుమట్టి పరిమళం

👉దామెర వాసుల గతవైభవ జ్ఞాపకాలు.

వాస్తవిక చరిత్రను సమాధిచేసి ఎవరికివారేరాసుకున్నచరిత్రనుపాఠ్యాంశాలుగా మార్చి ఓరుగల్లుమట్టి గతవైభవాన్ని నిర్వీర్యం చేశారు వందల ఏండ్లపాటు నిక్షిప్తమైన మట్టిపొరల్నిచీల్చుకుంటూ దాచివేయబడ్డ సమాధులను ధ్వంసం చేస్తూ కాలగర్భంలో కలిసిందనుకున్న చరిత్ర మళ్ళీ తొలిపొద్దువెలుగైతనఅస్తిత్వాన్ని నిలబెట్టుకుంటుంది. ఇప్పటివరకు చరిత్ర పొరల్లో దాచివేయబడ్డ దామెర వాసుల చరిత్ర తన గత వైభవాన్ని సమాజం ముందు నిలబెడుతుంది.

తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ లో గల హనుమకొండ జిల్లాలోని, మండలకేంద్రమైన దామేర (ఉల్లిగడ్డదామెర) వాసులు క్షత్రియులు కాకపోయిన ఆంధ్ర చెన్నై ప్రాంతాలనుపాలించారు.అనేక పరిశోధన పత్రాలు రుజువు చేస్తున్నాయి.
.
మదరాసు ప్రాంతంలో నిర్మించిన పట్టణానికి అప్పటి దామేర వారసత్వ పాలకులు తమతండ్రియైన దామెర చెన్నప్ప పేరునే చెన్న పట్నంగా నామకరణం చేశారుఅది ఇప్పుడు నేటి చెన్నై నగరంగాప్రసిద్ధి పొందింది అని చరిత్ర కారులు తమ పరిశోదనలో వెల్లడించారు.

దామేర వంశ వృక్షంలో చెన్నప్పకు నలుగురు భార్యలు, ఐదుగురు కుమారులు,మొదటి కొడుకు వెంకటవిధుడు, రెండవ కొడుకు అంకబూపాలుడు, మూడవ కుమారుడు అయ్య భూపతి (అయ్యప్ప), నాల్గవకుమారుడు తిమ్మవిభుడు, ఐదవ కుమారుడు చిన్న వెంకటవిభుడు ఈ ఐదుగురిలో గొప్పకవిగా పేరొందిన రెండవ కుమారుడు అంకభూపాలుడు.ఉషాపరిణయం వ్రాశాడు. అందులో దామేర వారు సమరశీలురు, ధర్మబుద్ధి కలవారు, సుందరులు అని రాయబడ్డది.

 

దామెరచెన్నయ్య రెండవకుమారుడుఅంకభూపాలుడు 22 ఆగష్టు 1639వ్రాసినఉషాపరిణయంతాళపత్ర గ్రంధంపై నలబైదు ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా “తిరుపతి’మహా నగరానికి చెందిన ప్రముఖ పరిశోధకులు గాలి గుణశేఖర్ (జి. రోసి నాయుడు)తన పీహెచ్డీని,1982 లో తాళపత్ర గ్రంధంలో రాయబడ్డఉషాపరిణయంతో పాటుఇతర పుస్తకాలల్లో సేకరించిన వాటిని పరిశీలించి, 1984 లో పిహెచ్డినీ పూర్తి చేసి దామెర వైభవాన్ని చరిత్రకారుల ముందు నిలబెట్టారు. అయినప్పటికీ ఎందుకో, దామేర వాసుల చరిత్రను, వెలుగులోకి రాకుండా చరిత్ర పుటల్లోకప్పివేయబడింది.సరైన అధ్యయనం తెలంగాణ విశ్వవిద్యాలయాలు, పాలకులు దృష్టి పెట్టక పోవడం కావచ్చు,దామెర, ఓరుగల్లు గత వైభవం వెలుగులోకి రాలేదు.

కాకతీయ సామ్రాజ్యం కంటే ముందే చెన్నగిరి (చంద్రగిరి గుట్టలు) నిలయంగా చోళుల పాలన సాగుతున్న కాలంలో దామెర వాసులు పాలకులకు నమ్మకస్తులుగా సైనిక అధికారులుగా కొనసాగారు.

శైవ భక్తులైన దామెర వాసులుకొండపైనిర్మించిన శివాలయం వందల ఏళ్లు గడిచినా .ఆధారాలు కళ్లముందు కనిపిస్తుంది చుట్టూ కొండల నడుమ నిర్మించిన చెరువును ఆనుకొని శివాలయంవుంది.

చోళుల పాలన అంతరిస్తున్న సమయంలో కాకతీయ సామ్రాజ్యం బీజం పడుతున్న సమయంలో కాకతీయుల మూల పురుషుడైన కాకర్త్య గుండన చేసినరాజ్య నిర్మాణంలో మొదట చెన్నగిరి (చంద్రగిరి గుట్టలు )నుండి దామెర, ఎల్లంపహాడ్ (పైడిపల్లి శివుని పల్లె ఆరెపల్లి ) వంగపహాడ్ ప్రాంతాలు కాకతీయ సామ్రాజ్యంలో కలిసిపోయాయి. ఇటీవల చరిత్ర పరిశోధకులు చెన్నకేశవ ఆలయంగా ఇప్పటికీ విరాజిల్లుచున్న చంద్రగిరి చుట్టూరా వున్నపల్లెలు వంగపహడ్ ల్యాదల్ల, దామెరా గుట్టల్లో పదివేల సంవత్సరాల క్రితం నవీన శిలాయుగపు ఆది మానవ సమాధులను గుర్తించారు. చెన్నకేశవాలయం గుట్టపైన ఇప్పటికీ ఏడు కొలనులు దర్శనమిస్తాయి.అక్కడ అప్పటి పాలకుల ఆనవాళ్లు కనిపిస్తాయి.

ప్రతాపరుద్రుని పాలనలో కాకతీయ సామ్రాజ్యం పై మహమ్మదీయులు దాడి చేయడం వల్ల కాకతీయసామ్రాజ్యం పతనం అవుతున్న సమయంలో ఇనగాల (ఇనుగాల) వంశానికి చెందిన దామేర వారు దక్షిణం వైపుకు వెళ్లారు. క్షత్రియులు కాకపోయిన సామంతులుగా వ్యవహరిస్తూ శ్రీకాళహస్తి వేలూరు ప్రాంతపాలకులుగా నిలబడ్డారు.

కంచి దేవస్థానంకు కొన్ని కిలోమీటర్ల సమీపంలోనే “దామల్’ అనే గ్రామాన్ని తమ పూర్వీకులకు గుర్తుగా నిర్మించారు. అదేవిధంగా చెన్నసాగరం అనే పెద్దచెరువును వెంకటప్ప నిర్మించారు.చెన్న పట్టణాన్ని అయ్యప్ప (అయ్యభూపతి ) నిర్మించారు.

అయ్యప్ప “పూనమల్లి’ని రాజధానిగా చేసుకొని పాలిస్తున్న క్రమంలో కీ. శ 1602లో డచ్చివారు వ్యాపార సంస్థను ఎర్పాటు చేశారు.పోర్చుగీసు వారు 1612- 1613లో కంపెనీ స్థాపించారు.1621 లో ఆంగ్లేయులు వచ్చారు. కీ శ 1639 నాటికి చెన్నపురి ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళింది. తాళపత్ర గ్రంధాల ఆధారంగా దామెర్ల పాలకులు 1603 వ సంవత్సరం నుండి రాజకీయంగా పలుకుబడి పొందారు.

తిరుపతి పట్టణానికి చెందిన చరిత్ర సాహిత్య పరిశోధకులు డాక్టర్ గుణశేఖర్ అనేక గ్రంథాలను పరిశీలించారు. 2అక్టోబర్ 1754 హైదరాబాద్ తాళపత్రములు. పదిహేడవ శతాబ్దపు మదరాసు తాళ పత్రాలు, 1850 నాటి బ్రౌన్ కాలపు పత్రాలు, 1945 నాటి తిరుపతి పత్రాలు, 1950 నాటి హైదరాబాదు కాగితపు పత్రాలను పరిశీలించి చరిత్రలో దామేర వారిపై పరిశోధన చేశారు.అముద్రితమైన ఉషాపరిణయము కావ్యం పై తెలుగు,తమిళ సాహిత్యం పై పట్టున్న సినీ పాటల రచయిత గొప్ప సాహితివేత్త ఆరుద్ర ప్రోత్సాహం వల్లనే గుణశేఖర్ “చెన్నపట్నం’ నిర్మాణంపై చేసిన చారిత్రక పరిశోధనను నాలుగు దశాబ్దాల క్రితమే పూర్తి చేసినప్పటికి ఇంకావెలుగులోకి రాకపోవడం. మన చరిత్రను మనం గొప్పగా చెప్పుకోకపోవడం వాస్తవిక చరిత్రను సమాజానికి అందించకపోవడం దురదృష్టకరం.

      గాలి గుణశేఖర్ పరిశోదకులు, ప్రముఖ రచయిత తిరుపతి

శ్రీకాళహస్తిలో అధ్యాపకులుగా పనిచేస్తున్న సమయంలో పరిశోధకులు గుణశేఖర్ దామెర్ల వంశానికి సంబందించిన ఒకే కుటుంబాన్ని చూశారు. శ్రికాళహస్తిలో జమిందారులైన దామెర్ల తిరుపతిరావు కుటుంబం. తిరుపతి రావు విద్యావంతుడు దిహిందు పత్రికకు అనేక వ్యాసాలు రాసేవారు.1995లో అతను మరణించారు. అతని కుటుంబసభ్యులు కూడా మరణించారు. దీంతో దక్షిణాదినీ ఏలిన దామెర్ల
వంశంపై మరింత పరిశీలించే అవకాశంలేకుండా పోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీస్ అధికారిగా పనిచేసిన ప్రస్తుతం ఖమ్మం ఎసిపి గా విధులు నిర్వహిస్తున్న “శివరామయ్య’ దామెర్ల వారిపై పరిశోధన చేస్తున్నారు.

కాకతీయ సామ్రాజ్యంలో గ్రామాలకు పేర్లకు ప్రత్యేకత వుంది. ఉనికిచర్ల, ముచ్చర్ల , గవిచర్ల, మొగిలిచర్ల, ఇవి కాకతీయ పాలన పరమైన ఎల్లలుగ చెప్పవచ్చు.అలాగే దామేర అనే పేరుకు తాడు, తామర అనే అర్ధాలు వున్నాయి అయితే దామేర చుట్టూ అల్లుకున్న కొండలు గుట్టలు గ్రామాలు’ పాడు ‘ వుంటాయి. పదివేల ఏండ్ల నవీన శిలాయుగం ఆనవాళ్లువున్నాయి రంగనాయకుల దేవస్థానం వెలిసిన ఆంద్రసారశ్వత పరిషత్ దేవులపల్లి రామానుజ శాస్త్రి పుట్టిన ఊరు వంగపహాడ్, ఎల్లమ్మ దేవుడి గుట్టగా పేరొందిన ఎల్లమ్మ పహాడ్ (పైడిపల్లి,ఆరేపల్లి) ఆగ్రహంపాడ్,గుడెప్పాడ్, తక్కళ్ళ పాడు )ఇవన్నీ కూడా కాకతీయుల కోసం సైనికులయ్యి సాగిన పల్లెలు దామేర వాసులతో పాటు దక్షిణాదికి సాగిన పల్లెలపై పరిశోధన జరగాల్సి వుంది.

ఆంగ్లేయులకు ఇష్టమైన పేరు మదరాసు, తమిళ ప్రజలు మాత్రం చెన్నై నగరంగా తెలుగు ప్రజల గత వైభవాన్ని అక్కున చేర్చుకుని దక్షిణ భారత ప్రజల ఐక్యతను ఇప్పటికి కొనసాగిస్తున్నారుచెన్నై, మైలపురంలలో ప్రతి సంవత్సరంఆనవాయితీగా ఓరుగల్లు వారసత్వాన్ని పునికిపుచ్చుకొని
మట్టిపండుగను ఘనంగా నిర్వహించి తెలుగు, తమిళ ప్రజల గొప్పతనాన్ని చూపిస్తున్నారుదామేర వారసులైన పానగల్లు రాజ ఆలోచనల నుండే ద్రావిడ పార్టీలు పుట్టాయనేది చరిత్ర చెపుతుంది.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్దిగాంచిన పద్మనాయుడులుదామేర వారసులే. అయితే దామెర్ల పాలకులు అన్ని సామాజిక వర్గాల వారు వున్నారని అనేక ప్రాంతాలకు విస్తరించి తమ వైభవాన్ని చాటారని చరిత్ర చెపుతుంది.

దామెర్ల వారు శైవ భక్తులు అత్యంత పురాతనమైన శివాలయం హన్మకొండజిల్లా మండల కేంద్రమైనదామెర గ్రామంలో వుంది.దామెరపాలకులు తమ ఇష్ట దైవాలకు ప్రత్యేకపూజలు నిర్వహించే వారు. అలాగే ఉషాపరిణయము ఆధారంగా శ్రీకృష్ణుని ఆరాధించే విష్ణు భక్తులు కూడా అని స్పష్టంగా తెలుస్తుంది.

పూర్వ రోజులనుండే దామేర ప్రజలు విద్యావంతులు 1940 లోనే పింగిలి చెన్నారెడ్డి అమెరికాకు వెళ్లారు లండన్, కెనడా, ఆస్ట్రేలియా లో పదివేల మంది దామేర వాసులు నివశిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక పేరున్న ప్రముఖ న్యాయవాది ముద్దసాని సహోదర్ రెడ్డి, ఉత్తర తెలంగాణ జిల్లాలకు పూర్వం పరిచయం వున్న ప్రముఖ వారసత్వ వైద్యులు డాక్టర్ నాగబెల్లి రామచంద్రం,డాక్టర్ పొలం నర్సింహరెడ్డి. ప్రముఖ పిల్లల వైద్యులు పొలసాని నర్సింహారెడ్డి, డాక్టర్ శ్రీరామ్ రెడ్డి హైదరాబాద్ లో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ లింగమూర్తి,ప్రముఖ న్యాయవాదులు,అనిల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శ్రిదర్ రెడ్డి లతో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఉన్నత విద్యను అభ్యసించిన వారు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ప్రయివేట్ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగులు,ప్రతి ఇంట్లో పోస్ట్ గ్రాడ్యువేషన్ పూర్తి చేసిన విద్యావంతులు వున్నారు.దామేర గ్రామంలోవున్న హైస్కూల్ లో చుట్టూఇరవైదు గ్రామాల విద్యార్థులు
విద్యను అభ్యసించేవారు.విద్యావంతులకు’దామేర” పుట్టినిల్లయ్యింది.

.ఒక్కసారి దామెర మట్టిని తడుముదాం రండి వందల ఏండ్ల మానవచరిత్ర ఆనవాళ్లు కనిపిస్తాయి. మరుగున పడిన తెలంగాణ చరిత్ర కనిపిస్తుంది అద్భుతమైన రచనలు చేసిన దామెర కవుల అక్షరాలు చరిత్రకారులకు కొత్త పాఠాలై మన ముందు కనిపిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *