
ఎలకంటి నరేష్
బ్యూరో చీప్

మహిళ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణంతో వారికి మెరుగైన సౌకర్యాలు లభిస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
బుధవారం ములుగు మండలం మదనపల్లి గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉపాధి హామీ పథకం 10 లక్షల రూపాయల నిధులతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి, జగ్గంపేట గ్రామం లో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం సి ఆర్ ఆర్ 150.00 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సిసి రోడ్లు, డ్రెయిన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ముందుగా మదనపల్లి గ్రామంలో ఆవు నూరి భాగ్య మొగిలి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి మంత్రి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జగ్గన్నపేట గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావడం పట్ల సంతోషం మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక కోటి 50 లక్షల రూపాయల నిధులతో డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, త్వరలోనే మిగిలిన సీసీ రోడ్ల పనులు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రతి గ్రామంలో మహిళలు సమావేశాలు నిర్వహించుకోవడానికి అత్యాధునిక మహిళ సమైక్య భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, జగ్గన్నపేట గ్రామ సర్పంచ్ ఎ.వెంకన్న, మదనపల్లి గ్రామ సర్పంచ్ నేత కరుణ, పంచాయతీరాజ్ ఈ ఈ అజయ్ కుమార్, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.