
నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్
ఎం వి ఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్
మూడు వందల ఏళ్లు పాలించిన ఘనమైన చరిత్ర కలిగిన కాకతీయుల ప్రస్థానంలో పైడిపల్లి కి ప్రత్యేకత వుంది. శైవ క్షేత్రాలకు నిలయమైన ఓరుగల్లు మట్టిలో అందరికి వెయ్యిస్తంబాల దేవస్థానం రామప్ప లాంటి శైవ ఆలయాలు చరిత్రలో నిలిచిపోయాయి. కానీ కాకతీయుల చేత నిర్మించబడిన పైడిపల్లి శివాలయం,దేవునిగుట్ట ,మార్కండేయ్య దేవాలయం,రంగనాయకుల దేవాలయం ,దేవతల బావి,నాగదేవత ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించబడిన మట్టికోట, గొలుసుకట్టచెరువుల నిర్మాణంతో పాటు,అన్నిటికీ మించి ఖిలా వరంగల్ కోటకు ఉత్తరాన చివరి మట్టికోట తూర్పుదిశనుండి పడమర వైవుకు నిర్మాణం జరిగి ఉత్తరం దిక్కుకు వుంది. కాకతీయుల కోటకు చేరుకోవాలంటే ఉత్తరాన తొలి మట్టికోట పైడిపల్లి లో నిర్మాణం జరిగింది
ఎల్లమ్మ గుట్టగా ప్రభుత్వ రికార్డులో వున్న ఎల్లమ్మ గుట్ట చుట్టూరా పల్లెలు ఏర్పడ్డాయి ఎల్లమ్మ గుట్టనుండి శివుని గుట్టవరకు నల్లచేరువు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యంత పొడవైన చెరువు కట్టగా ప్రభుత్వ రికార్డుల్లో వుంది
ఎల్లమ్మ గుట్ట అనుకోని పైడిపల్లి, ఆరేపల్లి,పేరుకపల్లి శివపురం , (గతంలో శివుడి గుట్టగా వెలుగొందిప్రస్తుతం దొంగతనం గుట్టగా పిలవబడుచున్న ) ఏనుమాముల, సర్దార్ పేటతాళ్లగూడెం, మధ్య గూడెం వరకు పల్లెలు ఏర్పడ్డాయి
కాకతీయుల గొలుసుకట్ట చెరువుల నిర్మాణం పైడిపల్లి లో స్పష్టంగా కనిపిస్తుంది. చెరువుల నిర్మాణం ఒక కవచంగా నిర్మించినట్లు కనిపిస్తోంది.
నల్లచేరువు, కోటి చెరువు, పీతురు చెరువు, చాకిరేవు చెరువు, తురకల చెరువు, చింతల చెరువులతోపాటు చిన్న చిన్న చెరువులు నిర్మాణం జరిగాయి.
గొలుసుకట్టు చెరువుల నిర్మాణం పైడిపల్లిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది.ఒక చెరువు నిర్మించిన ప్రాంతంలో మరోచేరువు కనీసం అరకిలో మీటర్ దూరంలో కనిపిస్తాయి కానీ పైడి పల్లి లో పీతురు చెరువు చాకిరేవు చెరువుల నిర్మాణం చేరువుకట్ట కిందనే మరో చెరువు నిర్మాణం జరిగింది. ఇలాంటి చెరువుల నిర్మాణం కాకతీయుల గోలుసుకట్ట చెరువుల నిర్మాణం లో అరుదైన అంశమే.
పైడిఅంటే బంగారం అనే అర్థం వుండటం వల్ల కాకతీయుల నిధుల నిక్షేపాలు పైడిపల్లి లో ఉండేవని ప్రచారంలో వుంది. కాకతీయులు నిర్మించిన శిలశాసనాలు, పరిసర ప్రాంతాలలో నిధులకోసం కొందరు దుండగులు తవ్వకాలు జరిపినట్లు ప్రచారంలో వుంది. నిజాం కాలంలో నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ప్రచారంలో వుంది.
రాణి రుద్రమదేవి పాలనలో మహిళరాజుగా కొనసాగడం పై సమాంత రాజులు రుద్రమదేవి కి ఎదుతిరిగిన సమయంలో రుద్రమదేవికి పూర్తి స్తాయిలో అండగా నిలబడి గొనె గన్నరెడ్డి తిరుగుబాటు దారులని ఉత్తరం దిక్కున వున్న మట్టికోట పైడిపల్లి వద్దనే వారిని నిలువరించినట్లు ప్రచారంలో వుంది. గోనెగన్నారెడ్డి నవలలో పైడిపల్లి ప్రస్తావన వున్నట్లు స్థానికులు అంటున్నారుఅంటున్నారు.
యుద్ధవీరులుగా ప్రత్యేకతను చాటుకున్న మల్లువీరులు, వీరశైవులు ఎల్లమ్మ గుట్ట చుట్టూరా నిర్మితమైన పల్లెల్లో నివసించారని శిలాశాసనాలల్లో వుండేదని మట్టిలో కలిసిపోయిన శిలాశాసనాలను చరిత్రను ప్రభుత్వయంత్రాంగం బయటకు తీసి అరుదైన చరిత్రను రికార్డుల్లో నమోదు చేయాల్సిన అవసరం వుంది .
కాకతీయుల ఆనవాళ్లు శిల్పసంపద,శిలశాసనాలు మట్టిలో కూరుక పోయాయి. స్థానిక ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. విద్యావంతులు సహితం పైడి పల్లి చరిత్రకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ప్రధాన కారణం. వామపక్ష ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ గా పైడిపల్లి కి గుర్తింపు వుంది. దీంతో అప్పటి తరం పెద్దగా పైడిపల్లి చరిత్ర పై దృష్టి పెట్టలేక పోయామని స్థానిక విద్యావంతులు అంటున్నారు.
పైడిపల్లి గ్రామము మధ్యలో శివాలయానికి ఆనుకొని వున్న ఎత్తైన గుట్టపైన సాలే గుట్టగా పిలవపడుచున్న గుట్టపైన మార్కండేయ్య దేవస్థానం వుంది. నేత కార్మికులు కాకతీయ రాజకుటుంబం కోసం తయారు చేసిన వస్త్రాలు మార్కండేయ దేవస్థానం లో ప్రత్యేక పూజలు చేసి అందచేసే వారని ప్రచారంలో వుందిప్రస్తుతం వరంగల్ కొత్తవాడలో నివసిస్తున్న నేతకార్మిక కుటుంబాలు మార్కండేయ దేవస్థానం గుట్ట కు ఆనుకొని నివసించే వారని
అంటున్నారు.
గణపతి దేవుని నుండి మొదలు కుంటే కాకతీయుల చివరి రాజు ప్రతాప రుద్రుడి వరకుపైడిపల్లి శివాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించే వారని ప్రచారంలో వుంది
రాణి రుద్రమ దేవి తో పాటు రాజ కుటుంబానికి సంబందించిన మహిళలు దేవతల భావిలో స్నానమాడి ఎల్లమ్మ దేవతను.ఎల్లమ్మ గుట్టకు కొద్దీ కిలోమీటర్ల దూరంలో వున్న ఏక వీర ఆలయాన్ని దర్శించుకునే వారు
కాకతీయుల సామ్రాజ్యం ప్రారంభ సమయంలో ఏర్పడ్డ పైడిపల్లి శివాలయం శిథిలావస్థలో వున్న సమయంలో శివానంద శివాలయం ప్రత్యేకత గుర్తించి గ్రామస్తుల సహకారంతో శివాలయాన్ని ఆధునీకరించారు.
కాకతీయ వైభవ సప్తహాం నిర్వహిస్తున్న సమయంలో పైడిపల్లి ప్రస్తావన రాకపోవడం చరిత్రను కాలరాయడమేనని స్థానికులు అభిప్రాయపడుచున్నారు. కాకతీయుల మట్టికోట నిర్మాణం శివాలయం,శిల్ప సంపద శిలశాసనాలు స్పష్టంగా కనిపిస్తున్న పైడిపల్లి లో కాకతీయ ఉత్సవాలకు కాకతీయుల వారసుడు వస్తున్న సమయంలో పైడిపల్లి కాకతీయుల చరిత్రను గుర్తించాలని,పైడిపల్లి పైన పరిశోధనలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు.

