
నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్
ఎం వి ఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్
ఓరుగల్లు మట్టిని ముద్దాడినోళ్లు,మేడారం గద్దెల నుండి జనం గొంతులై అక్షరాలను అల్లిన కలం కార్మికులు
, చిలుకుల గుట్టనుండి వనంవీడి జనం లోకి వస్తున్న సమ్మక్కతల్లిని తమ కెమెరాలో బందించి మూడో \
కన్నులై సాగిన కుంకుమ భరినలోని సిరా చుక్కలు, సామాజిక చైతన్యంతో ప్రశ్నించే అక్షర దివిటీలు
నాలుగు రోజుల పాటుసాగే ఆదివాసుల మహా జాతర మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల, ఆదివాసుల
సంస్కృతిని ప్రపంచానికి కనువిందు చేసిన ప్రజల నేస్తాలు, భక్తుల సమస్యలపై వాస్తవాలను అక్షరాలతో,
దృశ్యాలతో కళ్ళముందుంచిన కలంయోధులు వరంగల్ జర్నలిస్ట్ లు
వందల ఏళ్లచరిత్ర కలిగిన ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర ఈ దేశ మూల వాసుల జాతర ఆదివాసుల జాతరను
ఓనాలుగు దశబ్దాల కిందకు తొంగిచూస్తే ఎర్రదుబ్బ రోడ్లతో దట్టమైన అడివిలో వెలిసిన సమ్మక్క సారలమ్మ జాతరను,కాలినడకన
ఎడ్లబండ్లపై, కొన్ని ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలతో తరలి వచ్చి తల్లులను భక్తులు దర్శించుకునేది,వాళ్ళ ప్రయాణంలో అడవి జంతువులు క్రూరమృగాలు ఎదురయ్యేది గుంపులు గుంపులుగా వెళ్లే భక్తులు ఆజంతువుల నుండి కాపాడుకుంటూ మేడారంలో నాలుగు రోజులు గుడారాలు వేసుకొని జాతర్లో మొక్కులు సమర్పించుకునేది. వనదేవతల విశిష్టతను ప్రపంచ వ్యాప్తికి మీడియాప్రతినిధులు కీలకపాత్ర పోషించారనేది జగమెరిగిన సత్యం.
అసలు కనీస సౌకర్యాలు లేని సమయంలో ఫోటోలుతీసి మేడారం నుండి ములుగు వరకు వ్యక్తులే వాహకులుగా వచ్చి వరంగల్ నుండి ములుగుకు వచ్చిన రిపోర్టర్ లకు ఇస్తే, అక్కడినుండి హన్మకొండ బస్టాప్ కు వచ్చి, ఆ ఫోటోలను రాసిన కథనాన్ని హైదరాబాద్ బస్సులో వేస్తె అక్కడ మీడియా ప్రతినిధులు తీసుకొని తెల్లవారి పేపర్లో వేసేది ఇప్పటి లెక్క ఎలాంటి వసతులు లేని కాలంలో వాస్తవాలను పాఠకులకు అందించిన విలేకరులు, నేడు క్షణంలో సమాచారం తెలిసే ఈ ఆధునిక సమాచార వ్యవస్థలో పెను మార్పులు జరిగిన మారుతున్న కాలానుగుణనంగా అప్ డేట్ అవుతూ తమ వృత్తి ధర్మాన్ని అనుసరిస్తున్నారు.


మేడారంలో విధులు నిర్వర్తించే ప్రతి జర్నలిస్ట్ ఆ దుబ్బలో సకాలంలో తిండి తినక పోయిన నిద్రలేకపోయిన జాతరను కవర్ చేస్తారు వీడియో జర్నలిస్ట్ లు ఫోటో జర్నలిస్ట్ లు సమ్మక్క చిలుకల గుట్ట నుండి దిగి గద్దెలకు వెళ్లే సమయంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకొంటారు ఇసుక వేస్తె రాలనంతా వనమంతా జనంతో అడుగు వేయలేని ఒత్తిడిలో ఊపిరాడని పరిస్థితి వున్నా సమ్మక్క కుంకుమభరినేను, జనసంద్రాన్ని ఫోటో వీడియో లు తీసి ప్రపంచానికి ఆ తల్లులను కళ్ళముందే దర్శన మిప్పిస్తారు.
ఒకప్పుడు మీడియా అంటే వెళ్ళమీద లెక్కపెట్టే వాళ్ళు 1990నుండి 2000వరకు మీడియా రంగంలో పెనుమార్పు వచ్చింది ఆధునికతతో పత్రికలే కాదు ఛానెల్స్ వచ్చాయి. 2002,నుండి మొబైల్ రంగం అందుబాటులోకి రావడం కొన్ని సంవత్సరాల తరవాత అరచేతిలోనే సమాచారం అందుబాటులోకి రావడంతో జర్నలిస్ట్ ల వార్త సేకరణశైలిలో మార్పు వచ్చింది, కావాల్సినంత సమాచారం తాను ఉన్నచోటికే తెప్పించుకోగలిన మేడారం జాతర కవరేజ్ కోసం మాత్రం ప్రత్యేక్ష కవరేజ్ కోసం వనం వైపుకుకదిలి తల్లుల దీవనతోనే కావచ్చు పూనకం వచ్చినట్టు సమాజానికి వనజాతర జన జాతరను తన కోణంలో సమాజం ముందు ప్రచురిస్తారు ప్రసారం చేస్తారు.
చాలిచాలని వేతనాలతో సమాజం కోసమే తపించే కలం కార్మికుల జీవితాలు చెప్పుకోవడానికి గొప్పగా అనిపించిన వెట్టిచాకిరి బతుకులే కనిపిస్తాయి. మేడారం జాతర కవరేజ్ కోసం వచ్చే జర్నలిస్ట్ లకు మీడియా కవరేజ్ పాస్ లు ఇవ్వడం నుండి మొదలుకొని, జాతరలో అధికారయంత్రాంగం, పాలకులు పైకి పొగడ్తలు కుర్పించిన చిన్నతనం చేయడం అవమానించడం వాళ్లకి ఆలవాటుగా మారిపోయింది.
గుడిలేదు గుడిద్వారం లేదులే మన మేడారంలో అని మనమెంత చెప్పుకున్న మీడియా పాయింట్ కు కేటాయించిన ద్వారం ఎందుకో తెరవలేక పోయారు.
10టివి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి కుమారస్వామి,గంటన్నర పాటు మీడియా సెంటర్ కెళ్లే గేటు తెరవమని తన స్టాఫ్ కెమెరామెన్ ను లోపలికి పంపించమని కోరిన స్పందన కరువైయ్యింది తమ ఛానెల్ లో లైవ్ కవరేజ్ ఉందని చెప్పిన అక్కడ వున్న అధికారులకు వాళ్ళ కఠిన హృదయం ఎందుకో స్పందించలేకపోయింది. ఒక్కరికే కాదు పోలీసులు వ్యవహరించిన తీరు ఎంతో మంది జర్నలిస్ట్ లు వేదనకు గురయ్యారు.
ఈ జాతరలో హంగులతో కూడిన మంచేలు ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ వెలవెల బోయిందనేది నగ్నసత్యం.
మీడియా ప్రతినిధుల సెంటర్ ఓపెన్ చేయక పోవడం ఎగ్జిట్ ద్వారం నుండి వెళ్లాలనుకున్న మీడియా ప్రతినిధులకు చుక్కలే కనపడ్డయి. పోలీసులు మీడియా మధ్య ఎన్ని సార్లు వాగ్వివాదం జరిగిందో అంచనా వేయలేము. తమ యజమానులు ఇచ్చిన కవరేజ్ పూర్తిచేయడం కోసం
మీడియాకు కేటాయించిన భవనం పక్క పిట్టగోడ నుండి దూకి కవరేజ్ చేసిన జర్నలిస్ట్ లు వున్నారు దీన్ని ఆసరా చేసుకొని కొందరు భక్తులు గోడదూకి వెళ్లారు.
ములుగు ఎస్పీ తాను స్వయంగా మీడియా ప్రతినిధులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్న ఎక్కువ మంది పోలీసులకు జాతర మీద అవగాహన లేక పోవడం వల్ల ఈ ఇబ్బందులకు కారణమని చెప్పవచ్చు జాతరలో ఎంత సేవచేసిన కుటుంబాలను వదిలివచ్చిన తల్లుల దర్శనం కోసం వచ్చిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులను చిన్న చూపు చూడటం బాధాకరం, వచ్చే జాతరలోనైన కొంత మార్పులకు శ్రీకారం చుడితే బాగుంటుంది.
గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రానెట్ గచ్చువల్ల ఒకే సారి వేలాదిమంది భక్తులు గద్దెల సమీపంలోకి రావడం బెల్లం, పాదాలకు వచ్చే చమటవల్ల జారీపడే ప్రమాదాన్ని ఒకరిద్దరు చేసిన సూచనను పరిగణలోకి తీసుకున్న మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్, గచ్చును గరుకుగా చదును చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా సత్వర చర్యలు చేపట్టి జన జాతర ను ఆదివాసి జాతరను ట్రాఫిక్ సమస్య మినాహిస్తే భక్తులకు సత్వరదర్శనం జరిగింది. వివి ఐపి,వి ఐ పి పాస్ లు తక్కువ ఇచ్చామాని చెప్పిన అధికారులు దానికి సంబందించిన గేట్ తెరవడం విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది కావచ్చు ఆధునీకరించిన మాహ జాతర సక్సెస్ గొప్ప సక్సెస్ అని చెప్పవచ్చు.
అంచానకు మించిన భక్తులు రెండుకోట్లుదాటి తల్లులకు, మొక్కులుసమర్పించుకోవడం, వేణు స్వామిలాంటి దివ్య దృష్టివంతులని ప్రకటించుకునే వాళ్ళు ఎదో జరుగుతుందని భారీ నష్టం జరుగుతుందన్న ప్రచారం సత్య వాక్కు పేరిట చేసిన అక్కసు నోటిదూల, జాతర ఫెల్యూర్ కోసం వేసిన చేసిన ఎత్తుగడలు ఎదవ వేషాలు తల్లుల దృష్టికోణం ముందు పటాపంచలే అన్నది జాతర సక్సెస్ ను చూస్తే తెలుస్తుంది. వనదేవతల సంస్కృతీని ధ్వంసం చేయాలనుకున్న కొన్ని మీడియా సంస్థల ప్రచారసాధనాలు తల్లులసేవలో సేదతీరే ఓరుగల్లు జర్నలిస్ట్ ల వృత్తి దర్మం నిలబడినంత కాలం మా అడవిని, ఆదివాసుల ఆచారాలను ఇక్కడి జీవన శైలిని దెబ్బతీసే శక్తులకు ప్రతి జాతర్లో చెంప పెట్టె ఎదురవుతతుంది.