తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా కి ముఖ్యమంత్రి స్వాగతం

తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన శ్రీ శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  స్వాగతం పలికారు.
గవర్నర్ గారికి స్వాగతం పలికిన వారిలో ముఖ్యమంత్రి గారితో మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణా రావు, డీజీపీ  శివధర్ రెడ్డి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.