విధి వంచితులకు ఆశ్రయం కల్పించండి

 

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీప్ పుడమి టివి న్యూస్

 

కొందరికి బంగారు పళ్లెంలో భోజనం. ఇంకొదరికి కష్టానికి పిడికెడు అన్నం మెతుకులు. అందలాలు అన్ని సౌకర్యాలు, మట్టితల్లీని నమ్ముకొని సాగే జీవితాలు… ఈ భూమిమీద ఏ జీవి అయిన తన సహజ తత్త్వంతో జీవిస్తుంది ఒక్క మనిషిలోనే అన్ని జీవుల లక్షణాలు కనిపిస్తాయి.

ఆరెపల్లి నుండి హన్మకొండకు వెళ్లేదారిలో రోడ్డుపక్కన చుట్టూ పరుచుకున్న చెత్తకుప్పపై తనకడుపులోకి కాసిన్ని మెతుకులను జార విడుచుకుంటున్నాడు

ఎవరో వదిలిన అన్నం. అతనిలో కలిగిన ఆకలి కాసింత తీరస్తుందేమో వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా మారాయో తెలియదు. ఎక్కడ మీది అంటే చుట్టూ ప్రపంచాన్ని మరచి పోయిన ఒక చిరునవ్వు

ఏ ఊరు మీదంటే ఆగి ఆగి కాసేపకటికి జంగాలపల్లి అని సమాధానం నీ పేరు అంటే లతిప్ అని చెప్పాడు. ఎందుకు ఇలా తింటున్నావు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితె ముఖంలో చిరునవ్వు

అతని నవ్వులో చూపులో ఒక్కటి మాత్రం అర్ధమయ్యింది పేగులు వడిపట్టి ఆకలితో అరుస్తుంటే దొరక దొరకక కాసిన్ని మెతుకులు దొరికి తింటుంటే నీ ప్రశ్నలు ఏందీ అని అనిపించింది. నాకు అతని మనసు చెప్పినట్టు అనిపించి అక్కడి నుండి వెళ్లిపోయాను

ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలమంది రోడ్ల పై కనిపిస్తారు ఒక్కక్కరు ఒక్కో విధంగా కనిపిస్తారు కొందరు అందరిలో కలిసినట్టు వుంటారు

జీవితంలో ఓడిపోయో మోసపోయే అన్ని కోల్పోయో ఊళ్లను దాటి నా అన్నవాళ్ళను వదిలి జీవిస్తున్న వీళ్ళను నా దేశ బిడ్డలే అని గుర్తించి వీళ్ళకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బాగుండు

ఓ పాలకుల్లారా, వీళ్ళు మీ ఓటర్లు కాకపోవచ్చు మీకంటే గొప్పగా బతికిన వాళ్ళు కావచ్చు అధికార యంత్రాంగామా జర దృష్టి పెట్టి వీళ్ళను అక్కున చేర్చుకోండి పసిపిల్లల వలే కాసింత కొత్త జీవితాన్ని అందించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *