
ఎలకంటి నరేష్
పుడమి టివి బ్యూరో

పైడిపల్లి జంక్షన్లో ‘Arrive Alive’ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం
మూడో డివిజన్ పరిధిలోని పైడిపల్లి జంక్షన్ వద్ద “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిఐ జవ్వాజి సురేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ అంకిత్ కుమార్ గారు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం లేకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి నిర్లక్ష్యాల వల్ల ప్రాణనష్టం సంభవిస్తున్నదని పేర్కొన్నారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం తీవ్రంగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎసిపి వెంకటేష్ గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, ఓవర్ స్పీడ్ నివారణ, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం వంటి నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.
సిఐ జవ్వాజి సురేష్ గారు మాట్లాడుతూ, త్రిబుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు ప్రధాన కారణాలని హెచ్చరించారు.
ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా మాత్రమే ప్రాణాలను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.ఎస్సై ఎం.రాజు గారు మాట్లాడుతూ, వాహనం నడుపుతున్న సమయంలో జాగ్రత్తలు పాటించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఓవర్ స్పీడ్, మొబైల్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి అలవాట్లు ప్రాణాలకు ప్రమాదకరమని చెప్పారు.
ప్రతి ఒక్కరూ నియమాలు పాటించి సురక్షితంగా గమ్యస్థానానికి చేరాలని సూచించారు.మూడో డివిజన్ కార్పొరేటర్ శీభరాణి అనిల్ గారు మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
చిన్న వయసులోనే వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, అవసరాన్ని బట్టి మాత్రమే వాహనాలు ఇవ్వాలని తెలిపారు. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పుడమి టీవీ చైర్మన్ నాగబెల్లి జితేందర్ గారి సహకారంతో తన తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు నాగబెల్లి సత్యదేవ్ ఆర్య స్మారకంగా,వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. డీసీపీ అంకిత్ కుమార్ గారి చేతుల మీదుగా హెల్మెట్లు అందజేయగా, పోలీస్ శాఖ అభినందనలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై శంకర్, ఇతర పోలీసు అధికారులు, రోడ్ సేఫ్టీ కమిటీమూడవ డివిజన్ ప్రజలు పెద్దఎత్తునపాల్గొన్నారు.