
ఏసీపీ నర్సింహారావు

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీప్పుడమి టివి న్యూస్ &ఎం వి ఆర్ మానవ వికాస రచనలు
సాహిత్యంపట్ల మక్కువతో నలుగురం మిత్రులం సాదారణంగా. ఒకచోటకూర్చొని,చర్చించుకుంటున్నాము. ఒక ఫోటో కోసం మొబైల్లో సామాజిక మాద్యమాల గ్రూవ్స్ ను చూస్తున్న క్రమంలో హన్మకొండ ఎసిపి ఫోటోను చూసి ఈ సార్ హన్మకొండకు వచ్చిండా మిత్రమా నిజంగా ఆ సార్ దేవుడు మిత్రమా అన్నాడు.
పక్కనే వున్న మరో మిత్రుడు ఒక్కరికి కాదు మిత్రమా ఆ సార్ అనేక మందికి కొత్త జీవితాలను అందించాడు అన్నారు. అతనిలో పోలీసును మాత్రమే చూడలేదు మానసిక పరిపక్వత కలిగిన అధికారిని చూశాము. ఇదంతా ఇంచుమించు ఓ పాతికెళ్ళ ముచ్చట నర్సింహారావు సార్ అంటే వందలమంది జీవితాలకు కొత్త వెలుగును నింపిన వ్యక్తి ఇలాంటి అధికారుల వల్ల పోలీస్ వ్యవస్థపై గౌరవం పెరుగుతుంది అంటూ తన జీవితంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు
పాతిక ముప్పై ఏళ్లక్రితం వరంగల్ నిప్పుల కొలిమే పీపుల్స్ వార్ పార్టీ ప్రభావం అధికంగా వున్న సమయం. గ్రామమాల్లో యువత ఏమైనా ప్రశ్నించే గొంతుకలైతే చాలు స్థానిక నాయకులకు కంఠ గింపుగా వాళ్లకు కొంత ఇబ్బందిగా వుండేది. వాళ్ళు పోలీస్ అనుమానిత జాబితాలో చేరిపోయేది.
యువత వివిధ రాజకీయ పార్టీలల్లో చేరి సమాజానికి సేవ చేద్దామనుకుంటే నక్సల్స్ టార్గెట్ గా మారిపోయేది రాత్రి అయ్యింది అంటే ప్రతి గ్రామంలో
ఏ సంఘటన జరుగుతుందో తెలియని పరిస్థితి అప్పట్లో వరంగల్ జిల్లాల్లో నెలకొని ఉండేది
హాసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెందిన విద్యావేత్త కవి మిత్రుడు కుమార స్వామి కాకతీయ యూనివర్సిటీ ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి విభాగం అధ్యక్షులు పనిచేస్తున్న సమయం వామపక్ష భావజాలం కలిగి ఉండటం, గ్రామంలో అక్షరాస్యత కార్యక్రమంలో చురుగ్గా పనిచేశాడు ప్రశ్నించే తత్త్వంవున్న కుమారస్వామి పైన ఎవరో పోలీసులకు అన్నలతో సంబంధాలు ఉన్నాయని సమాచారం ఇచ్చారు.
ఓ రోజు తెల్లవారు జామున అతని ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు , ఆసమయంలో కుమార్ ఇంట్లోలేడు తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కుమార్ ఇంటికి చేరుకున్న వెంటనే జరిగిన సంఘటనను చెప్పుతూ అతని తల్లిదండ్రులు బోరున ఏడ్చారు.
విద్యార్థి నాయకుడైన కుమార్ నాకు ఎలాంటి సంబంధాలు లేనప్పుడు ఎందుకు భయపడాలి అనుకోని ఒక్కడే నేరుగా హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నర్సింహా రావును కలిసి జరిగిన సంఘటన చెప్పాడు. అదేరోజు కేసముద్రానికి బదిలీ అయిన ఎస్సై నర్సింహారావు, స్పందించి కుమార్ కు భరోసా ఇచ్చాడు పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఎస్సై వ్యవహరించిన తీరును చూసి కుమార్ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఆ అధికారి వ్యవహరించిన తీరును గుర్తుచేసుకుని ఓఇరవై ఏడేళ్ల తర్వాత ఫోటోను చూసి ఆనందపడ్డాడు.
ఇక హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామాలన్ని యుద్ధ వాతావరణమే. ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో తెలియని పరిస్థితి గ్రామాలాల్లో యువత, నాయకులు, ప్రజలు భయం నీడన బతుకున్న రోజులవి. పోలీసులు సైతం గ్రామాలల్లకు వెళ్లాలంటే ఇబ్బంది పడ్డ రోజులుఅవి.అనుమానితులు, పీపుల్స్ వార్ పార్టీతో సంబంధం వున్నవాళ్ళు,రాజకకీయనాయకులను ప్రశ్నించిన యువకులపై ఏసంబంధాలు లేకున్న ముద్రపడి ఇబ్బంది పడ్డ వాళ్ళున్నారు
నర్సింహారావుసార్ ట్రైనింగ్ ఎస్సైగా మొదటగా హాసన్ పర్తి లో విధులు నిర్వర్తించారు ట్రైనింగ్ పూర్తిచేసుకొని అక్కడే ఎస్సైగాపోస్టింగ్ లో జాయిన్ అయ్యాడు.పీపుల్స్ వార్ పార్టీకి పట్టున్న గ్రామాలు హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా వున్నాయి.నక్సల్స్ తొలితరం నాయకులను అందించిన పైడిపల్లి వుంది. గ్రామాలల్లో అనేక మంది యువకులను పీపుల్స్ వార్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని విద్యావంతులను యువకులను అరెస్ట్ చేస్తున్న సమయం అది
హాసన్ పర్తిలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నర్సింహారావు అనుమానితులను పట్టుక వచ్చిన వ్యక్తులను స్టడీ చేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వాళ్ల జీవితాల్లో మార్పులు తీసుకు వచ్చాడు.
వందలాదిమందికి పైగా యువత జీవితాలు మార్చాడు ఇవాళఉద్యోగులుగా,ఉపాధ్యాయులుగా, ఉన్నత వ్యక్తులుగా స్థిరపడ్డ ప్రతిఒకరు నర్సింహరావు సార్ ఆసమయంలో వ్యవహరించినతీరు వాళ్ల జీవితాలాల్లో గొప్ప వెలుగులు నింపారని గుర్తుచేసుకుంటూ దేవుడనే అంటారు
ఓ యమహా టూవీలర్ పైన తన గన్మేన్ వెంకన్నతో నిర్భయంగా గ్రామాలను సందర్శించి సమస్యలను పరిష్కరించే వారు గన్మేన్ వెంకన్న సైతం సామాజిక స్పృహ కలిగి ఉండటంవల్ల ఎస్సైకి సమాచారం ఇచ్చేది యువత వాస్తవి జీవితాన్ని అందించడంలో వెంకన్న కీలకమైనా పాత్ర పోషించాడు ప్రస్తుతం వెంకన్న ఏఎస్సైగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు.
కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదివిన నర్సింహారావు ఒక వైపు విద్యార్థిగా కొనసాగుతూనే ఇంటర్ విద్యార్థులకు జువాలజీ భోదించేవారు, పాలిటెక్నీక్, ఎపిఆర్ జేసి ఎంట్రెన్స్ కోచింగ్ ఇచ్చే వారని తన పూర్వ విద్యార్థులు చెప్పుతారు.
ఎస్సై నుండి ఏసీపిగా విధులు నిర్వహిస్తూ హన్మకొండ ఏసీపీగా ప్రస్తుతం కొనసాగుచున్నారు
పాతికెళ్ళ కింద పోలీస్ ఉద్యోగం చేయడం ఒక యుద్ధమే, ఆసమయంలో బదిలీలకి ఫైరవీలు చెల్లుబాటు అయ్యేవి కావు సమర్థవంతమైన అధికారికే పోస్టింగ్ వుండేది.అలాంటి సమర్థవంతమైన అధికారి నర్సింహారావు సార్ నక్సల్స్ ముద్రపడిన పైడిపల్లిని విద్యావంతుల పల్లెగా ఉద్యోగులపల్లెగా,మార్చడంలో తనదైన ముద్రవేశారు.
విచారణలో నేరస్తుడిగా నిర్దారణకు వస్తే చాలు నేరస్తులపట్ల సింహాస్వప్నంగా వుంటాడు కేసు ఇన్వెస్టిగేషన్ లో నేర్పరి, తప్పు చేయని నిందితులకు, అనుమానితులపై స్పష్టతతో అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి తగిన న్యాయం చేసి వారికి సమస్యనుండి విముక్తి కలిగించడంలో చొరవచూపేది.ఎందరో జీవితాల్లో వెలుగులు నింపి దేవుడని కొనియాడుతున్న మీలాంటి పోలీస్ అధికారులకు మనస్ఫూర్తిగా సెల్యూట్ సార్.