తంగేడు పూల సెట్లల్ల. సేదబాయి నవల ఎపిసోడ్ 13

ఎంవిఆర్ భవనం నుండి –పుడమిటివి జనసాహిత్యం

 

 

 

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ -ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి ఎం వి ఆర్ మానవ వికాస రచనలు

 

సెంద్రిగాడు తలఎత్తి పైకి సూసిండొ లేదో ఒరేయ్ సెంద్రిగా ఏందిరా నీ వాలకం,
ఓ తాతో నువ్వేనానే తుపాకి సూడగానే గా హైదర్ సాబ్ గాడనుకున్న

అరేయ్ సెంద్రిగా ఇగ సెప్పు మా “వీరు’గాడు ఎక్కడున్నడో,
బిడ్డా సెప్పక పోయినావనుకో ఇగ నీకున్నది.
నాకు ఏమి తెల్వదు తాత,

ఏమితెల్వదురా

అవ్వతోడు నాకు ఏమి తెల్వదు తాత

ఇట్లా సెప్పవురా నువ్వు
అని నాటు తుపాకి మర్లేసి ఈపు మీద పెట్టిండు.
ఓ నర్సయ్య తాత నీ కాల్మోక్కుతా నాకేం తెల్వదు.
గిట్లెట్ల సెప్పుతావురా అని ఈపు మీద ఒక్కటి సరిసిండు.

వామ్మో తాత వాళ్ళు ఇట్ట పడ్డది తెలుసు, గీ పొయ్యేది తెల్వదే నన్ను కొట్టకే.
అవునా ఇప్పటి దాక కొలుపు పెట్టి సెప్పినావు కదరా ఇంత తెలిసి మాకెందుకు సెప్పలేదురా
వామ్మో ఈ ముసలోడు నన్ను వదిలిపెట్టడు ఏదైనా సెప్పి ఇక్కడి నుండి పోవాలే.(మనసులో అనుకుంటాడు)
అరేయ్ నువ్వేమి సెప్పే టట్టు లేవు
మీ సోపతి గాళ్ళకు సెప్పుతున్న, వాళ్ళు దొరికే దాకా వీన్ని అదే ఈ సెంద్రీ గాన్ని ఇక్కడే సెట్టుకు కట్టేస్తా ‘తాడు ‘తెరా అని సాంబయ్య కు సెప్పిండు.

ఇదంతా ఎట్లనో వున్నదని శివయ్య ఆగుతాత ఆగు, వీరు గాడు కన్పిస్తలేడని అందరం రందితోని వున్నాం తిండి తిప్పలు లేకుండా సెట్లు గుట్టలు తిరుగుతానం నువ్వు సెప్పితేనే వచ్చిళ్ల ఊరోళ్లంతా అయినా
వీరుగాడు ఎవరైనా సెప్పుతే ఇంటడ వాని లోకం వానిది
అసలు నీమాట ఎప్పుడైనా ఇన్నాడా
వాన్ని ఎనకేసుకొచ్చింది నువ్వే కదా
ఏందిరా ఏమంటానవు
నీ తొమ్మిదిమంది కొడుకులు ఓ పదహారుమంది మనవళ్ళు అందులో వీరు గాడే బలవంతుడని నీపోలికలు వున్నాయని మీసం మెలెత్తివి కదా వాడు అట్లా కావడానికి నువ్వే కారణం.
ఎప్పుడైనా వాని అయ్య మాట అవ్వ మాట ఇన్నడా
వాన్ని ఎవరేమన్నా అంటే నువ్వే వాళ్ళ మీదికి పోతివి
ఏమంటానువురా..శివయ్య,
ఏమంటాన్న,తాత నువ్వు సెయ్యబట్టే వాడు అట్లా అయ్యిండు.
ఏందిరా నేను సెయ్యా బట్టా
నేనేమి సేసినానురా,
నువ్వే సేసినావు తాత వాడు అట్లాకావడానికి నువ్వే కారణం నీ బుద్దులే అనుకుంటాండ్లు అందరు
నా బుద్ధుల నేనేమైన తప్పులు సేసేనానురా
నాకే ఎదురు సెప్పుతాళ్ళు ఏందిరా!
అయినా నీకెవరు ఎదురు సెప్పుతారు తాత, ముస్సల్దీ ఎన్ని సెప్పలే మాకు నీ ఎవ్వరాలు, గవ్వే నీ మనవడికి వచ్చినయి.
ఇగ ఊకో తాత.
ఏమి సెప్పిందిరా ముసల్దీ
దాని సంగతే సెప్పుతా
ఏమి సెప్పుతావు ముసల్దీ నీ సుట్టమైన, సుట్టపు సూపుకు అని వెళ్లి వాళ్ళ ఇంటికాడనే తిష్ట వేసినావట కదా
నేనా
నువ్వు కాకపొతే ఎవలు తాత నువ్వే అస్సలు
సేను కాడ ఎవ్వలు లేంది చూసి వాటేసుకున్నవట వసపరుచుకొని లగ్గం ఆడిన వటా, ఇవ్వే కాదు ముస్సల్దీ సాన ఇసయాలు సెప్పింది ఇంకా ఇప్పమంటావా ఏందీ.

అరే శివయ్య వాడు పొల్లను తీసుక పోయిండార
వానికి ఏమి కాదు కదా
ఏయ్ గావానికేమైతదే,
నీ మనవడు ఊరోళ్ల నాలుకల్లో ఉంటడు వాడికి ఏమికావద్దని ఊరంతా ఎతకబట్టే నువ్వు బాధపడకు తాత
అరేయ్ వాడంటే నాకు పాణంరా వానికేమన్నా అయితే ఇంటిల్లి పాదికి ఎనగర్రా ఇరిగినట్టు ఐయితదిరా
వాడు ఎక్కడికి పోయిండో జర సెప్పండి.

ఇగో నరసయ్య తాత మాకెట్ల తెలత్తది తెలిస్తే మేము గీడికెందుకు వస్తాము అన్నాడు శివయ్య
అరేయ్ మీరంతా కూడబల్కొని మాట్లాడుతున్నారు.
లేదు తాత లేదు వాడు సల్లగా వుండాలని కోరుకుంటున్నాము.
వాడు ఏదైనా నెగ్గించు కుంటాడు గదే మాకు దైర్యం
ఈడ కూసోని ఏమి చేద్దామురా
జరా గటు పోయి వెతుకుదాము పదా అన్నాడునర్సయ్య తాత,
సరే తాత అని అందరూ కదిలిళ్ళు

తెల్లారితే సద్దుల బతుకమ్మ పండుగ, తోవ్వ పొంటి పోతాంటే పచ్చని ఆకుల నడుమ పసుపు అద్దినట్లు తంగేడు వనం కనిపిస్తాంది.

ఊరోళ్లు తంగేడు వనం కాడికెళ్లి ఎవరికీ కావాల్సినంత వాళ్ళు తంగేడు పువ్వును .తెంపు కుంటాళ్లు.

రామక్క బతుకమ్మ పాట అందుకుంది.. ఇద్దరక్క సెల్లెల్లు ఉయ్యాలో ఒక్కురికిచ్చిళ్ళు ఉయ్యాలో.. ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్నపోడాయే ఉయ్యాలో,రామక్క పాడుతుంటే అందరూ వంత పాడుతాళ్ళు, ఒక్క సారిగా సమ్మక్క కేకేసింది, తంగేడు పూల సెట్టును దాటు కుంటా సమ్మక్క వైపుకు అందరూ వెళ్లారు.
ఏందే సమ్మవ్వ గట్ల మొత్తుకున్నవేందే
అగో అటు సూడుర్రి
ఏమున్నదే గాడ,అగో సూడవ్వ , అక్కడ చీర ఆ సెట్టుకి ఈ సెట్టుకు ఆరేసిళ్ళు,
అవునే ఎవరిదే ఇది అని నర్సయ్య తాత అడిగిండు.
ఎమ్మో తాత,కొంచెం ఇంకా చీర ఇంకా పచ్చిపచ్చిగా వున్నది. అందరూ ఆ చీర కాడికి పోయిళ్ళు ఆ చీర
తంగేడు పూవులల్లో కలిసిపోయినట్లు పసుపు రంగులో ఆ ఎండకు మెరిసి పోతాంది.

అందరూ అనుకోబట్టిల్లు గీ చిట్టడివిల చీర ఎవరిది ఈశ్వరిది ఐతే కాదుకదా
అయినా ఈశ్వరికి చీరలు ఉండయి కదా లంగా వొనీలే ఉంటాయి కదా అట్లా అందరూ గుసగుస లాడుకుంటున్నారు.
ఇంతల నర్సయ్య తాత ఆగండిరా.
గీచిట్టడవిల,చీర ఎవరు ఆరెసుకుంటారు. అసలు ఈ చీర ఎవరిది అయ్యి ఉంటదని ఆలోచిస్తున్న క్రమంలో నర్సయ్య తాతకు అనుమానం వచ్చింది.
అంతే… అందరం వెతుకుదాము అన్నాడు ..అందరూ తంగేడు వనమంతా వెతకబట్టీళ్ళు

(మరో ఎపిసోడలో కలుద్దాము )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *