నువ్వు మా దయగల్ల తల్లివే

ఎంవిఆర్ భవనం నుండి  పుడమిటివి జనసాహిత్యం

నాగబెల్లి జితేందర్ సామ్రాట్

ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమి టివి మానవ వికాస రచనలు

 

కన్నీటి చుక్కను నేల రాలకుండా
అరచేతితో అడ్డుకొని
కష్టాలను తొలగించే భరోసవై నిలబడుతావు
బాధిత కుటుంబాల్లో
ఆనంద బాష్పమై
వికసిస్తావు
బడిపిల్లల బతుకుల్లో
అక్షరమై ఉదయిస్తావు
భద్రకాళి అమ్మవారి
చుట్టురా వజ్రాలతారల అల్లుకునే

అభివృద్ధిలోకన్పిస్తావు
పనిని ప్రేమిస్తావు
ప్రజలను ఆరాధిస్తావు
అవినీతి అధికారులకు వణుకు పుట్టిస్తావు
చట్టానికి చుట్టాలెవరు వుండరని తెల్చేస్తావు.
ఆశయం అకాంక్ష ప్రేమ
కలగలిపి విధులను నిర్వహిస్తావు
కాకతీయుల రాజదాని
హన్మకొండ పురోభివృద్ధికి
పద్మాక్షి తేజస్సు వై
పసిపిల్లలను గుండెలకద్దుకొని దీవిస్తావు

నిక్కచ్చి తత్వానికి
నిజాయితీ అధికారిణిగా
జనంగుండె సవ్వడివివై సాగుతున్న

చాహత్ బాజ్ పాయ్ ఐ ఏ ఎస్

నువ్వు మా దయగల్ల తల్లీవే మా ఇలవేల్పుల

నుదిటి సిందూరానివే 
మా ఓరుగల్లు ఆడబిడ్డవే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *