త్రివర్ణ పతాకమంత ఎదగాలి

పుడమిటివి జన సాహిత్యం

ఎంవిఆర్ భవనం నుండి

నాగబెల్లి జితేందర్ సామ్రాట్

ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి ఎంవీఆర్ మానవవికాస రచనలు

ఏళ్లకు ఏళ్లకు
పీడించి పాలించి
వేధించి చంపి ఈ నేల పై
రక్తాన్ని పారించి
ఉప్పెనైనా జన పోరాటానికి

బెదిరివాడు వెళ్లి పోయాడు
భాషను నాలుకల మీద అద్ది
ఆధిపత్యాన్ని అప్పగించి
విభజన సూత్రాన్ని చెప్పి
మతం కులం జోప్పించి
తరతరాల మీబతుకులకు
తామే నిర్దేశకులమని
జ్ఞానాన్ని దోచుకొని
వాడి మస్తీస్కంలో దాచుకొని
చీకటి ముసుగులో
జడుసుకొని అర్ధరాత్రి
వాడు పారిపోయాడు.
నా దేశ స్వేచ్ఛ వాయువుల కోసం

ఉరికంభం ఎక్కి తుటాలను ముద్దాడిన
వీరయోధుల అమరత్వం గుండెలకద్దుకొని
ఆకాశం నిండుగా రెఫరెఫలాడుతున్న
నా దేశ మువ్వెన్నల జెండ
శక్తి ముందు తల దించుకొని
ఖండతరాలు దాటాడు.
వాడు వదిలేసిన మలినాలను అద్దుకొని
కంపును ఊపిరితిత్తుల నిండా నింపుకుని
పాలకులై నాయకులయి
తెల్లదొరల తొత్తులై
జ్ఞానాన్ని అణిచివేస్తూ
ఎనబై ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో
వాడి ఆనవాళ్లతో
స్వేచ్ఛను బందించి
నాదేశ మూలతత్వాన్ని
సమాధి చేస్తున్నారు
నాగరికతకు ఆదిలోనే
అడుగులు వేసిన నేల నా దేశం

అగ్రరాజ్యాలు పుట్టక ముందే

ప్రపంచానికి వెలుగులు పంచిన దేశం
మట్టిని కుండగా మార్చి రసాయన శాస్త్రానికి
ఆనవాళ్ళను అందించి
అంతరిక్షాన్ని జ్ఞాన నేత్రంతోచూసి
సున్నాకు విలువను చెప్పి
శూన్యం గుట్టును విప్పిన
విజ్ఞాన యోధులను కన్నది
నాదేశం
నేలను దున్నీ పంటను తీసి
బట్టను నేసి
నులక మంచాన్ని అందించి
డప్పునుచేసి
పాదాలకు రక్షణగా చెప్పులు చేసి
సకలవృత్తుల ఉత్పత్తులను అందించిన
నా భరత మాత
కన్నీళ్లు కారుస్తుంది
ఎన్నియుగాలు దాటిన తరగని ఈ దేశ సంపదను
అందించిన
ఎందుకో కులం మతం ఆదీపత్యం

అహంకారం చూపే హంతకులను చూసి
నేను కన్న బిడ్డలు ఇంకా ఇంకా బానిసలకు బానిసలై
బతుకుతున్నారు
తలపై పొగరు లేని మనుషులుగా ఎప్పుడు జీవిస్తారోనని
నా దేశశ్రమజీవుల చేతుల్లో
తయారయ్యే ప్రతి వస్తువు
ప్రపంచాన్ని చుట్టేసి
దేశసంపద పెరిగి
ప్రతి మనిషి త్రివర్ణ పతకామంత ఎత్తున ఎదగాలని
నా భరత మాత కన్నీళ్లు కారుస్తుంది.
ఎనబై ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *