పుడమిటివి క్రైం న్యూస్

సైబర్ క్రైమ్ ఏసీపీ ఎ. వెంకటరమణ

ఎలకంటి నరేష్ తెలంగాణ బ్యూరో చీఫ్
అనధికారిక బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని సైబర్ క్రైం ఏసిపి ఎ వెంకటరమణ ప్రజలకు పిలుపునిచ్చారు సైబర్ మోసాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ జె. రాజేందర్, కమాండెంట్ డి. శివప్రసాద్ పాల్గొన్నారు.

అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బిజినెస్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, మ్యూల్ అకౌంట్లు, బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులకు ఇవ్వడం వల్ల కలిగే ఆర్థిక మరియు చట్టపరమైన ప్రమాదాలు వంటి అంశాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.
సైబర్ నేరాల దర్యాప్తు, ఆర్థిక సైబర్ నేరాలు, డిజిటల్ సాక్ష్యాల సేకరణ, కేసుల నమోదు, సైబర్ పోర్టల్ వినియోగం, అలాగే సైబర్ మోసాల విషయంలో “గోల్డెన్ అవర్”లో తక్షణ స్పందన వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల పట్ల కానిస్టేబుళ్లను అప్రమత్తం చేస్తూ,వివరించారు
మఖ్యంగా, కమీషన్ కోసం తమ బ్యాంకు ఖాతాలను ఇతరులు ఉపయోగించుకునేలా అనుమతించడం కూడా తీవ్రమైన చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చని విద్యార్థులను హెచ్చరించారు. అనుమానాస్పద లింకులు, యాప్‌లు, పెట్టుబడి ఆఫర్లు, ఆన్లైన్ ఉద్యోగ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించరాదని, అనుమానాస్పద కాల్స్ లేదా సందేశాలకు స్పందించే ముందు వాటి నిజానిజాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించారు. అలాగే తెలియని లేదా అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, అనధికారిక యాప్‌లను డౌన్లోడ్ చేయవద్దని హెచ్చరించారు.
ఎవరైనా సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు సూచించారు.
మామునూరులోని నాలుగో బెటాలియన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ ఎ. వెంకటరమణ, ఎస్సై చరణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్,పిసిలు ధనేష్, రాజు పాల్గొని కానిస్టేబుళ్లకు