పుడమిటివి న్యూస్

ఎలకంటి నరేష్ పుడమిటివి బ్యూరో చీఫ్

ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ICDS ఆధ్వర్యంలో నర్సంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో నర్సంపేట ప్రాజెక్టు CDPO మధురిమ గారి అధ్యక్షతన సమావేవేశం ఏర్పాటు చేయడం జరిగింది.
మహిళా భద్రత వారోత్సవాలలో భాగంగా ఈరోజు బంగారు బాల్యానికి 1000 మెట్లు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధికారి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు,ప్రభుత్వానికి వారదులుగా ఉంటూ ఐసిడిఎస్ మరియు వైద్యశాఖలు రెండు కళ్లు గా పనిచేస్తున్నాయని, ఇకముందు కూడా ఇలాగే కొనసాగించాలని తెలిపారు.తల్లి బిడ్డల సంక్షేమానికి, ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉంటూ సేవలు అందించాలని కోరారు. రెండు శాఖలు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు.
ఈ కార్యక్రమానికి Dr.శ్రావణ్ గారు హాజరై మాట్లాడుతూ ప్రతి బిడ్డ పెరుగుదల లో ఎలాంటి అపోహలు ఉన్నా నన్ను సంప్రదించాలని,వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందేటట్లు అంగన్వాడి టీచర్లు ఆశా కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
నర్సంపేట ప్రాజెక్ట్ CDPO మధురిమ గారు మాట్లాడుతూ మహిళా భద్రత వారోత్సవాలలో భాగంగా ఈరోజు బంగారు బాల్యానికి 1000 మెట్లు అనే అంశంపై ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, అంగన్వాడి కేంద్రంలో గర్భిణిగా నమోదైనప్పటినుండి తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్య ఎదుగుదల కోసం అవగాహన కల్పిస్తున్నామని దీనిని ప్రతి ఒక్క తల్లి ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి ఇంట్లో బాల్యారంభ దశ నుండే పిల్లల ప్రతి అవసరాలను తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కుటుంబ వ్యవస్థలో బిడ్డకు ఆహారం అందించడం కూడా ఒక పనిగా ఆలోచిస్తున్నారని, తల్లి గాని బిడ్డ గాని భోజనం సమయంలో ఇతర విషయాలను గురించి ఆలోచించవద్దని, ఫోను టీవీ చూస్తూ అన్నం తినడం వల్ల దానిని ఆస్వాదించలేమని, అలాంటి ఫుడ్ శరీరానికి కూడా సరిగా అందదని తెలిపారు.అమ్మమ్మ,నానమ్మ ఒడి అనేది పిల్లలు దూరం అవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అంగన్వాడి యూనియన్ రాష్ట్రఅధ్యక్షురాలు నల్లభారతి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా జరిగిన కార్యక్రమాలలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు అని తెలుపుతూ అంగన్వాడీ కేంద్రాలు అమ్మఒడితో సమానమని, అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్చే సర్వీస్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ICDS, హెల్త్ డిపార్ట్మెంటు సమన్వయంతో పని చేస్తూ మంచి పౌష్టికాహారంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తున్నాము అని తెలిపారు.
ACDPO జ్యోతి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం కు ఆహ్వానించగానే వచ్చిన MPDO గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.Dr. శ్రావణ్ గారు ప్రతి కార్యక్రమం ను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు అని, ఇకముందు కూడా తల్లీ బిడ్డల సంక్షేమం కోసం కలిసి పనిచేద్దాం అని ICDS కార్యక్రమాలకు సహకరించగలరు అని కోరారు.
ఈ కార్యక్రమం లో MPDO శ్రీనివాస్ గారు, ICDS CDPO మధురిమ గారు, ACDPO జ్యోతి గారు, Dr. శ్రావణ్ గారు,ICDS సూపర్ వైజర్స్ అరుణ, పారిజాతం,ఝాన్సీరాణి,ANM లు కవిత, రాజమణి లు, నల్లా భారతి, గుడ్.రాధ, B.శిరీష, D. రమాదేవి,అంగన్వాడీ టీచర్స్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.