వరంగల్ టెక్స్ టైల్ పార్క్‌కుకేంద్రం భరోస

పుడమిటివి న్యూస్

           

డాక్టర్ కడియం కావ్య పార్లమెంట్ సభ్యురాలు

 ఎలకంటి నరేష్ బ్యూరో చీప్

వరంగల్ అభివృద్ధి పట్ల అంకితభావంతో ముందుకు సాగుతున్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మరోసారి తన సంకల్పబలం చాటారు. వరంగల్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ త్వరితగతిన ప్రారంభం అయ్యేలా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని లోక్‌సభలో రూల్ 377 కింద ప్రస్తావించారు.

ప్రధానంగా పార్క్ త్వరితగతిన ప్రారంభం కావడానికి అవసరమైన ఆర్థిక, మౌలిక వసతుల మద్దతు పెంచాలని కేంద్రాన్ని ఎంపీ కోరారు. ప్రధాని మిత్ర పథకం కింద ఈ ప్రాజెక్ట్‌ను ప్రాధాన్యంగా తీసుకోవాలని స్పష్టం చేశారు.

వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య వినతిపై స్పందించిన కేంద్ర టెక్స్టైల్స్ మంత్రి గిరిరాజ్ సింగ్, ఇప్పటికే రూ.30 కోట్ల తొలి విడత నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. తదుపరి విడత నిధులు అర్హతల ప్రకారం విడుదల చేస్తామని వెల్లడించారు.

పరిశ్రమలను ఆకర్షించేందుకు రూ.300 కోట్ల వరకు ఆకర్షణాత్మక ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. పీఎల్ఐ, సమర్థ్ వంటి పథకాల ద్వారా కూడా యూనిట్లు లబ్ధి పొందగలవని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తామని కేంద్రం స్పష్టం చేసింది. అవసరమైన మేరకు అదనపు సహాయం ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపింది.

వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య నిరంతర అనుసరణతో ఈ ప్రాజెక్ట్ వేగం పెరిగింది. ఈ టెక్స్టైల్ పార్క్ ద్వారా వరంగల్‌లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *