
ఎలకంటి నరేష్
బ్యూరో చీప్

ప్రణామ్ డే కేర్ సెంటర్ వయవృద్ధులకు ఆసరాగా నిలుస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనములో ఏర్పాటుచేసిన ప్రణామ్ వయవృద్ధుల డే కేర్ సెంటర్ ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ డే కేర్ సెంటర్ లో వయోవృద్ధులు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు అహల్లాదకరమైన వాతావరణం కల్పించడం జరుగుతుందని, మానసిక ఉల్లాసానికి ఆటలు, రాగి జావా టి అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమం కొరకు కొత్త చట్టం రూపొందించడం జరిగినదని ఎవరైనా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వారి యొక్క తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చట్టప్రకారం వారి జీతంలో 10 % నుండి 15 % వరకు కోత విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు. వయోవృద్ధుల సంక్షేమం పిల్లల యొక్క బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వయవృద్ధుల పట్ల వారి పిల్లలు నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు. డే కేర్ సెంటర్ ల వయోవృద్ధులకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మానసిక ఉల్లాస కార్యక్రమాలు, యోగ , మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, డే కేర్ సెంటర్ ను వయవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, బి డబ్ల్యు ఓ ప్రేమలత, కౌన్సిలర్లు, రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వయోవృద్ధులు, తదితరులు పాల్గొన్నారు.