హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు-ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్ధిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నేడు శాసనమండలి సమావేశపు హాలులో రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకిషన్ రావు లతో కలిసి ఆయన గ్యాస్, పెట్రోల్ సరఫరాలను సమీక్షించారు.
✅ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ నిల్వలు, పంపిణీలో ఎటువంటి ఇబ్బంది లేదని ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అపోహలు కలిగించే మాధ్యమాల కథనాలతో ఆందోళన చెందవద్దని వినియోగదారులకు సూచించారు. రెగ్యులర్ గా కొనుగోలు చేసే దానికంటే, ఎక్కువగా కొని నిల్వ చేయవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.
✅ బంకుల వద్దకు వచ్చే చివరి వాహనదాదారునికి కూడా పెట్రోల్, గ్యాస్ దొరుకుతుందనే భరోసా కల్పించాలని డిప్యూటీ సీఎం అధికారులు, ఏజెన్సీలను ఆదేశించారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచడానికి రెగ్యులర్ గా ప్రెస్ బ్రీఫింగ్స్ ఇవ్వాలని సూచించారు. బ్లాక్ మార్కెట్ చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులని ఆదేశించారు. పెట్రోల్, గ్యాస్ ఏజెన్సీలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
✅ సమీక్షలో పౌర సరఫరాల శాఖ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, GHMC కమీషనర్ RV కర్ణన్, పోలీసు కమీషనర్లు సజ్జనార్, సుధీర్ బాబు, IOCL, HPCL, BPCL ఏజెన్సీల ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *