మళ్లీ నోరుజారిన రాజేంద్రప్రసాద్

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజా కార్యక్రమంలో అలనాటి తెలుగు నటుడు కాంతారావు గొప్పతనాన్ని ప్రస్తావించే క్రమంలో తమిళ సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంతారావును చూసి ఎంజీఆర్ భయపడిపోయారని ఆయన వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక సీనియర్ నటుడు పబ్లిక్ వేదికపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *