
నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీప్ పుడమిటివి న్యూస్ &ఎంవిఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్
7799071177

ప్రజల హృదయాలను కదిలించిన మిట్టపల్లి పాట
పాటకు “పండుగ’తెలుగు సాహిత్యంలో తోలిప్రయోగం
పల్లెమట్టితల్లిని ముద్దాడిన పాట ఊట చెలిమై ఉద్బవించి, జీవనదిలా ప్రవహిస్తూ ప్రేమికుల హృదయ స్పందనయ్యి వినిపిస్తుంది.
ప్రకృతిఒడిలోప్రతిమనిషినిఅల్లుకుపోయికాసేపుతన్మయత్నంలోజీవింపచేస్తుంది.అనేకగాయాలనుమాన్పిస్తుంది,కోట్లాదిమందిగుండెనిండాసంతోషాన్నినింపుతుంది.
సాటిమనిషిపట్ల మానవీయతనుచాటుతుంది.ప్రపంచ యుద్దాలని నిలవరించ శాంతి కపోతమై భూగోళాన్నీ చుట్టి వస్తుంది.సామాజిక చైతన్యమై సాగుతుంది.
ఉద్యమాలకు ఊపిరిపోస్తుంది.
తల్లీ నా వెలిశాల నీకున్నదిచరిత్ర చాలా అంటూ మిట్టపల్లిరాసిన పాట తెలంగాణలో ప్రతిపల్లె’అనుభవించిన గాయాలచరిత, గేయమై ప్రజల హృదయాలలో ఇప్పటికి మారుమ్రోగుతూనే వుంది.
తెలంగాణ ఏర్పడ్డాక పల్లెలలో ప్రశాంత వాతావరణం నెలకొంది. తెలంగాణ రాక ముందు తెలంగాణలోని ప్రతి పల్లెలో ఒక యుద్ధ వాతావరణం ఉండేది .దేశ సరిహద్దులో ఉండాల్సిన భద్రతదళాలు పల్లె చుట్టూరా వుండేటివి తుపాకుల మోతలు బాంబుల మోతలతో పల్లెప్రజలు క్షణంక్షణం భయాందోళనలో బతికేది.వరంగల్ జిల్లాలో తెల్లవారితే పత్రికలలో ఎలాంటి దుర్వార్త మోసుకువస్తుందో ఏ పంట చేలు నెత్తుటి మరకల తో కనిపిస్తుందో ఏ తల్లి కడుపుపంట మట్టిలో కలిసి పోయిందో ననే మూగరోదన ప్రతిఊళ్ళోకనిపించేది.ఇప్ప్పుడు వున్న తెలంగాణ ప్రశాంత వాతావరణంలో ఆనాటి విషాదకరమై జీవితాల గూర్చి ఎవరైనా చెప్పిన నమ్మకం కలగదేమో ఎందుకంటే ప్రతిపల్లె ఒక యుద్ధ క్షేత్రమే ప్రతి ఇంట్లో విషాద ఛాయలే కనిపించేది

మిట్టపల్లి సురేందర్ తన పందొమ్మిధీ ఏళ్ల వయసులో రాసిన నాలగవ పాట తల్లీ నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా పాటకు ఇరవై ఏళ్ళు ఇప్పుడు .జయశంకర్ భూపాల్ పల్లి ( ఉమ్మడి వరంగల్) జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల గ్రామానికి ప్రత్యేకత వుంది.దట్టమైన అటవీ ప్రాంతంలో వున్న వెలిశాల గ్రామం పన్నెండు వందల జనాభాతో వుండే ఓ కుగ్రామం ఒక వైపు అటవీ ప్రాంతం కావడం నక్సల్స్ కదిలికలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది యువకులు వెలిశాలతో పాటు అనేక గ్రామాల నుండి అప్పటి నిషేదిత పీపుల్స్ వార్ పార్టీలో పనిచేయడం గ్రామాలను తమ ప్రాంతాలుగా ప్రకటించుకోవడం ప్రజాకోర్టులు నిర్వహించడం జరగడంతో ప్రభుత్వాలు అణిచివేత కార్యక్రామాలు ప్రజలను నక్సల్స్ దారిన పోకుండా అనేక కార్యక్రమాలు చేపట్టేది.
.వెలిశాలలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిషేదిత మావోయిస్టు పార్టీలో అగ్రనేతలు గా ఎదగడం అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లోని ప్రత్యేక దృష్టిని పెట్టాయి.అదే గ్రామానికి చెందిన బోయిన సంపత్ రావు సాంబయ్య కన్నెబోయిన ఎల్లయ్య గాజర్ల సారయ్య నవీన్ లు పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోయారు అనేక మంది జైలు జీవితాన్ని గడిపారు ఎక్కడ ఏమి జరిగిన యువత పొలిసు స్టేషన్ కు వెళ్ళవలసి వచ్చేది.వెలిశాల గ్రామం ప్రతి
రోజు అనేక గాయాల బరువును మోస్తూ ఉండేది.
వెలిశాలలో శాంతి వాతావరణం నెలకొల్పడం కోసం చిట్యాల పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు .ప్రస్తుతం పరకాల ఎసిపిగా పనిచేస్తున్న శివరామయ్య ప్రత్యేక విభాగంలో పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ పొలిసు అధికారులు యువతకు క్రీడలు నిర్వహించడం అక్కడి యువతను పొలిసు స్టేషన్ కు పిలిపించకుండ వారి ఉన్నత చదువులకు సహకారం అందించారు గ్రామస్తుల అందరి సాకారంతో శాంతి స్తూపాన్ని ఏర్పాటు చేసి ఒకవైపు నక్సల్స్ గ్రామంగా ముద్రపడిన వెలిశాల గ్రామంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ శాంతి స్తూపం వెలిశాల గ్రామంలో నెలకోల్పారు.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన శాంతి చర్చలలో వెలిశాల గ్రామానికి చెందిన నిషేదిత మావోయిస్టు పార్టీ అగ్రనేత గణేష్ చర్చల ప్రతినిధిగా వ్యవహరించిన సమయంలో పోలీసులు గ్రామస్తులు ఏర్పాటు చేసిన శాంతి స్తూపం చర్చకు వచ్చింది.మిట్టపల్లి సురేందర్ రాసిన తల్లి నా వెలిశాల పాట ఒక వైవు నక్సల్స్ ఉద్యమాన్నే కాదు శాంతి స్తూపంతో తన ప్రత్యేకతనుచాటుకున్నది.సురేందర్ రాసిన పాట 2003 లో అప్పటి పరిస్థితులు సురేందర్ ఆ ఊరి మీద పాటరాయడానికి దోహద పడ్డాయి .

వెలిశాల గ్రామానికి ఓ ఎనమిది కిలోమీటర్ల దూరాన మొగుళ్ళ పల్లి మండలం వెల్లంపల్లి గ్రామంలో మిట్టపల్లి మధునమ్మ నర్సయ్య దంపతుల నాల్గవ
సంతానం మిట్టపల్లి సురేందర్ తన సోదరుడు రవీందర్ అక్కలు రమాదేవి సునీత లు సురేందర్ అందరికంటే చిన్నవాడు కావడం చేత గారాబంగా చేసేందిసురేందర్ తండ్రి నర్సయ్య గ్రామంలో డీలర్ గా వ్యవహరించడం వల్ల అన్నికుటుంబాలతో ఎక్కువగా పరిచయాలు వుండేది.
తన సోదరుడు రవీందర్ బార్య బాలింతరోగంతో మరణించడంతో తనవదిన రమాదేవిని తల్లిగా భావించిన సురేందర్ ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక పోయాడు. ఆవేదన చెంది అన్న పిల్లల కోసం తొమ్మిదవ తరగతిలోనే బడి మానెయ్యాల్సిన పరిస్థితి కలిగింది.తన అక్క ఇంటినుండి అన్న పిల్లలను తీసుక వస్తున్న క్రమంలో ఆ పిల్లలు ఆమెలో వాళ్ళ అమ్మను చూస్తున్న తీరును చూసి గుండెలు అవిసెల రోదించిన సురేందర్ హృదయం నుండి ఉబికివచ్చిన కన్నీళ్లు నేలపై రాలి అక్షరాలై మొలకెత్తినాయి అక్కడ ఉద్బవించిన మొదటి పాట నవమాసాలు మోసిన ఆ తల్లి ప్రేమకె నేను దూరమా అంటూ పాట పుట్టింది.అలా మొదలైన మిట్టపల్లి పాటల ఊట తెలంగాణ ఉద్యమానికి మొగురముల నిలబడింది నంది అవార్డును గుండెల నిండా అద్దుకుంది ..
గ్రామరేషన్ షాప్ డీలర్ ఐన మిట్టవుల్లి సురేందర్ తండ్రి నర్సయ్యను మావోయిస్టులకు అన్నం పెడుతున్నారని చిట్యాల పోలీసులు పట్టుకెళ్లారు .ఆ ప్రాంత దొర రాజకీయనేత సురేందర్ రెడ్డి ఆరోజు నర్సయ్యను విడిపించడానికి చిట్యాల పొలిసు స్టేషన్ కు వెళ్లి నర్సయ్య డీలర్ అతన్ని అందరూ కలుస్తారు అతన్ని వదిలి వెయ్యండని పోలీసులకు వివరించాడు నర్సయ్యను పోలీసులు వదిలివేశారు సురేందర్ రెడ్డి తన గ్రామానికివెళుతున్న
క్రమంలో నక్సల్స్ సురేందర్ రెడ్డితోపాటు ‘మిట్టపల్లిగురువును; కిరాతకంగా చంపివేశారు అదేవిధంగా మిట్టపల్లి ఆ సమయంలో మిట్టపల్లి తండ్రి నర్సయ్య ఆ సంఘటనకు వందమీటర్ల దూరంలో ఉండటం ఆరోజు నర్సయ్య ప్రాణాలతో బయట పడ్డాడు సురేందర్ రెడ్డి దొరను ఉపాధ్యాయుడిని చంపిన నక్సల్స్ కు వ్యతిరేకంగా చుట్టూ పల్లె ప్రజలు కదిలి రావడం వెలిశాలలో శాంతి స్తూపం ఏర్పడడానికి కారణమని అక్కడి ప్రజల్లో ప్రచారంలో వుంది.
వెలిశాలో కాకతీయుల ఆనవాళ్లు వున్నాయి దట్టమైన అడవిలో ఏర్పడ్డ శివ కేశవుల ఆలయం కు ప్రత్యేక గుర్తింపు వుంది.అక్కడ పుట్టిన విద్యావంతులువివిధరంగాలలోసేవలుఅందిస్తున్నారు ఎస్సైగా బండి రామకృష్ణ కాసగాని మహేష్ డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు.
పల్లె వాతావరణంలో మిట్టపల్లి లో ఉద్బవించిన పాటల ఊట తెలంగాణ ఉద్యమంలో ఉప్పెనయ్యి లక్షలాది మంది ప్రజలని ఉద్యమం వైపుకు నడిపింది రాతిబొమ్మలోన కొలువైన శివుడా లక్షలాది మంది ప్రజలను కంటనీరు పెట్టించింది .సురేందర్ ఉద్యమ పాటలతో పాటు సినిమా పాటలు రాసి పాడి ప్రజా వాగ్గేయకారుడిగా గొప్ప సాహిత్యకారుడిగా తెలుగు ప్రజలకు సుపరిచితం.
ఎన్నో ఉద్యమ గీతాలు పాడిన సురేందర్ ఏ పార్టీ జండాను ఏ సిద్ధాంతాన్ని మోయలేదు అందుకే మిట్టపల్లి సురేందర్ ప్రజా వాగ్గేయ కారుడిగా తెలుగు సాహిత్యంలో ప్రయాణం చేస్తున్నాడు.ఒకపాటకు ఇరవైఏళ్ళ పట్టాభిషేకం పండుగ చేయడం మిట్టపల్లి ఉస్మానియా విశ్విద్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లి వెలిశాల పాటను పాడటం అది తెలుగు సమాజంలో వైరల్ కావడం ఇరవైఏళ్ళ పాటకు వున్నబలం పాట ప్రతి హృదయాన్ని కదిలిస్తుంది వెయ్యేళ్ళు సజీవంగా బతుకతది అనేదినిత్య సత్యం.
ఇరవైఏళ్ళ క్రితం గొల్లున ఏడ్చిన పల్లెల పరిస్థితులు నెత్తురోడినపచ్చని పంట పొలాల నెత్తుటి చరితలు సిద్ధాంతం కోసం తూటాలను ముద్దాడిన యువకుల మరణాలు విధినిర్వాహణలో బలైన పోలీసుల జీవిత గాధలు నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలపరిస్థితులు మళ్ళీరావద్దని రాకూడదని తెలంగాణ జ్ఞానసంపదలో ఆర్థిక అభివృద్ధిలో ఇక్కడి ప్రజలు యువకులు ముందు నిలవాలని తెలంగాణ చరిత్రలో ప్రాణాలుకోల్పోయిన వారికి నివాళు అర్పిస్తూ నెత్తుటి విషాదాన్ని గుండెల నిండా మోస్తూ కదిలిస్తే కన్నీటి చెరువులయ్యె ప్రతి కుటుంబం మనోధైర్యం తో ముందుకు సాగాలని కోరుకుంటూ పల్లె పాటలకు ప్రాణం పోసిన ప్రజా వాగ్గేయ కారుడు మిట్టపల్లి సురేందర్ కుఅభినందనలుతెలియచేస్తున్నాను.