వరంగల్ పోలీస్ రేంజ్ కార్యాలయ నూతన భవనంను ప్రారంభించిన సీపీ

పుడమి టివి న్యూస్

పుడమి టివి న్యూస్

 

నూతనంగా ఏర్పాటు చేసిన వరంగల్ పోలీస్ రేంజ్ పరిపాలన కార్యాలయ భవనాన్ని శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు.

హనుమకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ రోడ్లో ఏర్పాటు చేసిన నూతన వరంగల్ పోలీస్ రెంజ్ కార్యాలయంలో వరంగల్ రెంజ్ పోలీస్ అధికారులకు సంబందించిన శాఖ పరమైన పరిపాలన కార్యకలాపాలు ఈ భవనం నుండి కొనసాగనున్నాయి.

ఈ నూతన కార్యాలయంను ప్రారంభించిన సీపీ కార్యాలయంలో సదుపాయాలను పరిశీలించారు.

అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ అధికారుల శాఖపరమైన సమస్యలపై రెంజ్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని, పరిపాలన పనితీరులో పారదర్శకంగా, బాధ్యతాయుతమైన పని తీరు ఉండాలని aవరంగల్ సీపీ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డీసీపీలు దార కవిత, అంకిత్ కుమార్, అదనపు డీసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్ రావు, రేంజ్ కార్యాలయం సూపరింటెండెంట్ యుగేందర్, ఏసీపీలు సత్యనారాయణ, నర్సింహా రావు, సురేంద్రతో పాటు ఆర్. ఐలు, ఇన్స్ పెక్టర్లు ఇతర రెంజ్ కార్యాలయ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.