
పుడమిటివి సాహిత్యం
ప్రముఖ సాహితీవేత్త, కవి,పండితులు ఆచార్య సుప్రసన్న “నవతి”(90) పుట్టిన రోజు సందర్భంగా వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థల అభినందన సమితి పేర ఓరుగల్లు సాహితీ వేత్తలు వడ్డెపల్లి లోని పి.ఆర్.రెడ్డి భవన్లో సన్మానోత్సవం ఘనంగా జరిగింది.అభినందన సభ ఆచార్య బన్న అయిలయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఆయన సుప్రసన్న సాహితీ వైభవం వివరించారు.
అభినందన సమితి బాధ్యులు పొట్లపల్లి శ్రీనివాస రావు,కుందా వఝల కృష్ణమూర్తి సంయోజకత్వంలో నిర్వహించారు. అభినందన సమితి కార్యదర్శి గిరిజా మనోహర బాబు నివేదిక సమర్పించారు. ప్రతిభాసుప్రసన్నము ప్రత్యేక సంచిక ఆవిష్కరిస్తూ ముఖ్య అతిథి,సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నిత్యానందరావు కవిత్వంలో విశ్వనాథ,సాహితీ విమర్శలో సుప్రసన్న హివన్నగ శిఖర ప్రాయులుగా ప్రస్తుతిస్తూసుప్రసన్న సాహితీ కృషిని వివరించారు రహస్య కథనం పద్దతి ఆచార్యుల మేధోపుత్రికగా అభివర్ణించారు .పుస్తక సంపాదకులు దహగాం సాంబమూర్తి పుస్తక విశేషాలుప్రస్తావించారు.
అనంతరం ఆచార్యులు ప్రసన్నను జ్ఞాన భారవి పురస్కారంతో సత్కరించారు. పురస్కారం గ్రహీత స్పందనలో భావనా జగత్తులో ఉన్నంతవరకు కవిత్వం కవి సొత్తని వెలువడ్డ పిదప జగత్తు సొత్తని తెలిపారు.సాహిత్యం అజరామయమయిందని తెలిపారు. అంపశయ్య నవీన్,రామాచంద్రమౌళి,
గంటా రామన్న,అవధాని శ్యామలా ప్రసాద్ , వనం లక్ష్మీకాంతం రావు, రెండు రాష్ట్రాలనుండి వచ్చిన ప్రముఖులు అభినందనలు తెలిపారు. సార్ శిష్యప్రశిష్యులు, సాహిత్య అభిమానులు ఘనంగాసత్కరించారు
అభినందన సంస్థ , పుస్తక సంపాదక వర్గ సభ్యులు, డా.ఎన్ వి.ఎన్ చారి,ప్రముఖులు శ్యామలానంద ప్రసాద్, జి.వి. రత్నం, వి.ఆర్ విద్యార్థి, డాక్టర్ కే యాదగిరి, తమ్మెర లక్ష్మీనరసింహారావు,డా.ఏ.వి నరసింహారావు, డా.ఎల్.ఎస్ ఆర్ ప్రసాద్, నాలకొండ భాస్కరరావు, ఆచార్య చిలకమారి సంజీవ, మోత్కూరి మనోహర్రావు, వరిగొండ కాంతారావు ,నెల్లుట్ల రమాదేవి, ఆరుట్ల భాశ్యాచార్యులు , కుటుంబ సభ్యులు,తదితర కవులు, పండితులు మిత్రులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.