వరంగల్ ఎనుమాముల మార్కెట్ సమీపంలోని ఓ ఇండస్ట్రీస్ పై మంగళవారం సాయంత్రం ఆహార నియంత్రణ శాఖ అధికారులు, పోలీసులు మెరుపు దాడులు చేశారు.
మిర్చి తొడిమలతో కల్తీ కారం తయారు చేస్తున్నట్లు గుర్తించి, 70 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా అధికారులు కృష్ణమూర్తి, మౌనికతో కలిసి సీఐ సురేశ్ ఈ తనిఖీలు చేపట్టారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.