సేదబాయినవలఎపిసోడు-06

ఎంవిఆర్ భవనం నుండి

పుడమిటివి జనసాహిత్యం

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్, పుడమిటివి ఎంవిఆర్ మానవవికాస రచనలు

అడవి అంతా అలజడిగా ఉంది. అందరిలో తెలియని బాధ, ఆందోళన. ఏ దుర్వార్త ఎవరినోటి నుండి వినవల్సి వస్తాదేమోనని. వాళ్లు బతికిరావాలని గ్రామదేవతలైన పోశమ్మ, మైసమ్మకు మొక్కబట్టీళ్ళు అందరి చేతుల్లో కర్రలు ఉన్నాయి. అటువైపు దొరమనుషుల అలికిడి వినబడింది. సాంబయ్య వాళ్లనుగమనించి, కోపంతో “వీరనాగులుకు, ఈశ్వరికి ఏమైనా జరిగితే మిమ్మల్ని మైసమ్మకు బలి ఇస్తాను. వాళ్లు బతికి బయటకు వస్తే గొర్రె పోతు, కల్లుసావ బోసి మొక్కు అప్పజెప్పుతాము” అని గట్టిగా అరిసిండు.

దెబ్బకు దొరమనుషులకి అదురు జోచ్చింది. ఊరంతా ఎదురుతిరుగుతారని అటునుండి అటే పారిపోయారు. అటుఇటు జూసుకుంటా సాంబయ్య, శివయ్య, దొర ఇంట్లో పనిచేసే చంద్రయ్య ఒక్క చెట్టుకిందికి జేరిల్లు. ముగ్గురిలో దుఃఖం ఆగడంలేదు. “అరేయ్ శివయ్యా,నువ్వు అసలు ఏదో ధాత్తానవురా.సేదబాయి కాడనే ఈశ్వరిని ముట్టుకుంటే అచానక్‌గా జరిగింది అనుకోవచ్చు. ఏ పరిచయం లేకపోతే ఇంటికిపోయిన ఈశ్వరీ మళ్లా ఇంట్లనుండి ఎట్లా బోయింది? నాకైతే ఏది తెల్తలేదు. ఏదో ఇసయం శివయ్యధాత్తానవు” అన్నడు.

“ఏందీ సాంబయ్య, నువ్వు గింత అమాయకుడివి అయితే ఎట్లా? గీ విషయం ఊరంతా తెలిసి నీకు తెల్వదంటే దేనితోని నవ్వాలో తెల్వట్లేదు. గీ ఇచిత్రాల శివయ్యకు అన్ని తెలుసు. ఇగ నేను సెప్పుతపటు” అని ముచ్చట మొదలుపెట్టిండు.“పదేళ్లు ఐతాంది రాఘవయ్య దొర ఇంట్లనేను పని చేయబట్టి. ఆ పిల్ల కళ్లముందే పెరిగింది. అసలు వీళ్ల పేమ ఇప్పటిది కాదు, ఓ ఐదేళ్ల కింద ముచ్చట.”

“ఏందీ? ఏందీ? ఐదేళ్ల కిందన? అప్పుడు పొల్ల ఎంతవుంటాదిరా చంద్రయ్య?” “ఏమి మాట్లాడుతానవు? ఇగ ఇద్దరు ఊళ్ళో లేరనంగానే నిందలు ఏత్తవురా.తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు చంద్రిగా గువ్వ మించలి సరుత్తబిడ్డా, లేనిపోనియి సెప్పితే.” “ఏందిరో సాంబిగా, ఆల్కదక్కువగా నీ ఇట్టం ఉన్నట్లు మాట్లాడుతున్నావు.” “శివయ్యను అడుగు,వాడికి అన్నీ తెలుసు” అన్నడు.“అరేయ్ శివయ్యా, నా దగ్గర దాసినవా? నిజం సెప్పు” అన్నడు.
“ఇగ నీ దగ్గర దాసుడేంది? చంద్రయ్య సెప్పేది నిజమే” అన్నడు.

“ఉండబట్టలేక ఇగ జర సెప్పు చంద్రయ్యా. పొద్దంత నా తోనితిరిగిన నా దగ్గరనే ఇసయం దాసిళ్లు. ఏమి సోపతిరా ఇది?” 

దొరల ఇళ్లల్ల ఏమి జరిగినా మా అసోంటళ్లకు జర తెలత్తది. ఈశ్వరీ గా పొద్దు ఇంట్ల కూసుండి ఏడుదినాలు దాటింది. అందరూ ఎండిన కుడుకలు,పండో, ఫలమో ఆమే ఒడిల పెడుతున్నరు దగ్గరి సుట్టపొల్లు ఐతే ఫలహారాలు తీసుకొచ్చిళ్లు. దొరకెందుకో బిడ్డకు అట్లా సేసుడు ఇట్టంలేదు. అయినా దొరసాని పట్టుబట్టింది. ఏందిరా పిల్ల గట్ల ఉన్నంక నలుగురికి అన్నం పెట్టావా ఇదేం సాలు బిడ్డకంటే ఎక్కువన అందరిని పిలువు అన్నది రాఘవయ్య తల్లీ, ఐన సుట్టాలకుతప్ప దొర ఎవరికీ సెప్పలే. గాయాళ్ల ఇంట్ల పందిరి ఎయ్యాలే, కొబ్బరి తోరణాలు కట్టాలే.అని సెప్పిండు నేనే వీరనాగులుకు సెప్పిన అగో, గాపని సేయడానికి దొర ఇంట్లకొచ్చిండు వీరనాగులు. మూడు రోజులు పనిచేసిండు. మామిడాకులు దర్వాజకు కడుతాంటే…” అని సెప్పబోయి ఆగిండు.
“అరె సెప్ప“రాదురా, ఏమి జరిగిందో.మళ్ళా ముచ్చట మొదలుబెట్టిండు చంద్రయ్య గప్పుడు ఈశ్వరిని జూసిండు. గామే కూడా బయటోళ్లను సూసుడు మొదటిసారి కావచ్చు” అన్నడు.ఏమి జరిగిందో ఇంట్లో కానీ ముసిముసి నవ్వులు నవ్వుకుంటా వీరనాగులు అక్కడి నుండి బయటకొచ్చిండు.

“నువ్వు సెప్పిన ఇసయముల ఏమన్న ఉన్నదా చంద్రిగా?” అన్నడు సాంబయ్య.

“ఏ సాంబయ్యా, ఉన్నది ఉన్నట్టు సెప్పుతాన. ఇననంటే నాకెందుకురా నీకు సెప్పుడు” అని చెట్టుకిందినుండి బయటకు పోతాండు.
“అగుర చంద్రయ్యా. గదేదో కొలుపు బెట్టి సెప్పకుండా జర ఇగరంగా సెప్పు” అన్నడు.“సరే, ఇనుమన్నడు.”

“నేను ఓ యాళ దొర రమ్మన్నడని పోతాన. దొర ఇంటి ఎనకాల సింత సెట్లు ఉన్నయికదా గాడికి పోరగాళ్లంతా వత్తరు. ఇంట్లో వున్న సుట్టపొల్ల పిల్లను తీసుకొని పిట్టగోడ దూకి సింత సెట్ల కాడికి వచ్చింది ఈశ్వరీ. సింతకాయలను రాళ్లతో కొట్టినా ఒక్క కాయ రాలడం లేదు. దోరదోర సింత కాయల గుత్తిని సూసిన ఈశ్వరికి వాటిని తినాలని వుంది. ఏమి సేయాల్నో తెల్వక అటుఇటు సూత్తాంది. సింత కాయాలను అందుకోవడానికి ఎగురుతాంది.

ఇంతల ఎడ్లబండిమీద సేను కాడినుండి వస్తున్న వీరనాగులుకు ఈశ్వరి కనిపించింది. గాయాళ్ల జూసినప్పుడు ఈశ్వరీ ముఖం గా దోరదోర సింతకాయలెక్కనే వున్నది. అప్పుడు ఆమే నవ్వు అచ్చం సందమామ వెలుగులెక్క వున్నదని అనుకున్నడు. 

ఎడ్లబండి మీదినుండి దిగిన వీరనాగులు ఈశ్వరి దగ్గరికి పోయాడు. ఎగురుతున్న ఈశ్వరిని అమాంతం ఎత్తుకొని భుజంమీద నిలబెట్టిండు. కొమ్మను పట్టుకొని సింతకాయ తెంపింది ఈశ్వరి, ఏడ సింతకాయలు సేతుల నుండి జారీపోతదో దొర్లి పడబోయిందిఅంతే, వీరనాగులు భుజంమీదినుండి . ఆమే దొర్లి జారబోతాంటే కింద పడకుండా గట్టిగ పట్టుకున్నాడు.

ఆమే వీరనాగులు చాతిమీద వాలిపోయింది. ఇద్దరి హృదయాల మధ్య దోర సింతకాయలు నలిగిపోయినయి. ఇద్దరు ఒకరి కౌగిట్లో ఒకరు బందీగా మారిపోయిల్లు. బయట ప్రపంచానికిరాని ఈశ్వరికి ఇద్దరు అల్లుక పోవడంతో తన అందాలను వీరనాగులుకు సమర్పించినట్లు. ఏదో కొత్తలోకంలో విహరించి నట్టు అనిపించింది.ఇద్దరిలో మాటముచ్చటలేదు. శ్వాస మాత్రం వస్తుంది.

ఇడిసిపెట్టలేక వీరనాగులు ఎవరైనా సుత్తారేమోననే ఆమే భయాన్ని చూసి నెమ్మదిగా కిందికి దించాడు. ఇంట్లో బిడ్డ లేదని పిట్టగోడ వైపుకు ‘ఈశ్వరీ’ అంటూ పిలుచుకుంటూ వస్తున్న రాఘవయ్యను గమనించి, ఈశ్వరి గబుక్కున ఇంటిముందు గేటువైపుకు వెళ్లింది…

చంద్రయ్య సెప్పుడు ఆపుతలేడు.గా పొదల వైపు ఓ ఇద్దరి అడుగులు కనపడుతాయానని ఊరోళ్లు అటువైపు పోయారు. ఇంకా సాన సాన వున్నది ముచ్చటని సెప్పబోతాంటే ఏ ఆగరా ఆగు నీ సోది ముచ్చట అందరూ గటు దిక్కు పోతాళ్ళు మనం పోదాం పదాఅని శివయ్య అనగానే ముగ్గురి అడుగులు పొదలవైపుకు పడ్డాయి….

(మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *