పుడమిటివిన్యూస్

టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఐఏఎస్

ఎలకంటి నరేష్ తెలంగాణ బ్యూరో చీఫ్
ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన పర్యటించనున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా ఏర్పాట్లను టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఐఏఎస్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ములుగు డివిజన్ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ ములుగుతో పాటు, గట్టమ్మ సబ్‌స్టేషన్ ను సీఎండీ పరిశీలించి, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన విద్యుత్ ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎండీ ఆదేశించారు. విద్యుత్ లైన్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ పరికరాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి, ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే సరిచేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే స్పందించేలా సిబ్బంది, వాహనాలు, అవసరమైన విద్యుత్ సామగ్రిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ పరిసరాల్లో జరుగుతున్న విద్యుత్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎండీ, ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరిగే ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గట్టమ్మ సబ్‌స్టేషన్‌లో కూడా విద్యుత్ సరఫరా ను పరిశీలించి, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని ములుగు జిల్లాలో విద్యుత్ సరఫరాకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పటిష్టంగా పూర్తి చేయాలి. కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి, ఎలాంటి విద్యుత్ అంతరాయం తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలి” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఈ ములుగు బి . బిక్షపతి, డి.ఈ ములుగు కన్నా రాజు, డి.ఈ ఎంఆర్ టి సదానందం, ఈ ఈ సివిల్ వెంకట్ రాం, ఏడీఈ ములుగు ఎన్ వేణుగోపాల్ పాటు ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.