అత్యాశ సెల్ ఫోన్ వాడకమే సైబర్ నేరగాళ్లకు అస్త్రాలు

పుడమిటివి న్యూస్

వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ స్వేత

 

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి -ఎంవిఆర్ మానవ వికాసరచనలు పబ్లికేషన్స్

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ స్వేత పిలుపు నిచ్చారు. సురక్షా కా తిరంగా కార్యాక్రమంలో భాగంగా హన్మకొండ బాలసముద్రంలోని కాళోజి కళాక్షేత్రంలో సైబర్ నేరాలపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు అవగాహన కలిపించారు.ఈ సందర్బంగా సిపి ఎన్ శ్వేత మాట్లాడుతూ దేశంలో రోజురోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు. సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతూ ప్రజల సొమ్మును కాజేస్తున్నారని అన్నారు.

అత్యాశ,భయంతో పాటు అత్యవసరం లాంటి కారణాల వల్లప్రజలు సైబర్ మోసాల భారిన పడుతున్నారని అన్నారు. సెల్ ఫోన్ వినియోగం పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాలు పెరిగాయని చెప్పారు. సెల్ ఫోన్ జీవన విధానంలో భాగం అవుతున్న కొద్దీ మనిషి ప్రశాంతతను కొలపుతున్నడని సెల్ ఫోన్ వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే అనేక అనర్దాలు ఏర్పాడుతాయని అన్నారు. సెల్ఫోన్ వినియోగించుకునే సమయంలో అప్రమత్తంగా వుండాలని ప్రజలను కోరారు.ఉపాద్యాయులు ప్రయివేట్, పబ్లిక్ లైఫ్ పట్ల విద్యార్థులకు తప్పనిసరిగా అవగాహన కల్పించాల్సిన భాద్యత ఉపాధ్యాయుల పై ఉందని అన్నారు.

ముఖ్యంగా ఎంతోమంది తమ వ్యక్తి గత జీవితాలను సామాజిక మాద్యమాల ద్వార పంచుకోవడం వల్ల అనేక అనర్దాలు జరుతున్నాయని అన్నారు.ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసే ప్రతి వినియోగ దారుడు అప్రమత్తంగా లేకపొతే సైబర్ నేరగాళ్లు డబ్బులను కాజేసే అవకాశాలు ఎక్కువని అన్నారు.గుర్తు తెలియని వ్యక్తులనుండి వచ్చే మెస్సెజ్ లు ఫోటోలు క్లిక్ చేయడం వల్ల ఎలాంటి సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి పోతుందో తెలియదని దీని వల్ల అనేక రకాల అనార్ధాలు జరుగుతాయని అన్నారు. ప్రతి సెల్ ఫోన్ వినియోగదారుడు తమ సెలఫోన్ ప్రైవేట్ సెట్టింగ్ లల్లో మార్పు చేసుకోవాలని సూచించారు.

ప్రతి ఉపాధ్యాయులు విధిగా విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తే విద్యార్థుల కుటుంబ సభ్యులు తమ చుట్టూ వున్నా సమాజం అప్రమత్తమై భవిష్యత్ సైబర్ నేరగాళ్ళ భారిన పడే వారి సంఖ్య ఘననీయంగా తగ్గుతుందని అన్నారు.

సెంట్రల్ పోలీసులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సైబర్ క్రైం పై పోలీసు అధికారులు అవగాహన కలిపించారు. పోలీస్ కళా బృందతమకళాప్రదర్శనల ద్వారా సైబర్ నేరాలు ఎలా జరుగుతాయో కళ్ళకి కట్టినట్లు వివరించారు అనంతరం ఉపాధ్యాయుల చేత పోలీస్ అధికారులు సైబర్ నేరాలపై పట్ల అప్రమత్తంగా వుంటామంటూ ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ రూపోందించిన పోస్టర్లను పోలీస్ కమిషనర్ అవిష్కరించారు.

ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ డిసిపి దారా కవిత, విద్యాశాఖ సి.యం.ఓ సుమ, హన్మకొండ, సైబర్ క్రైమ్, ఎస్.బి ఎసిపిలు నర్సింహరావు, వెంకటరమణ, జాన్ నర్సింహులు, ఇన్స్‌స్పెక్టర్లు రజింత్, శివకుమార్, రవికుమార్,అశోక్, ప్రవీణ్ కుమార్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *