యుగనేత్రి కడియం కావ్య

పుడమిటివి -జననేత

యుగనేత్రి కడియం కావ్య

నాగబెల్లి జితేందర్ సామ్రాట్

ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి-ఎంవిఆర్ మానవ వికాసరచ

ఈ దేశానికివెన్నెముఖలై నిలబడి అందరికి అన్నం పెట్టె రైతులు అర్దాకలితో ఆత్మహత్యల మీద ఆగొంతు పార్లమెంట్ నిండు సభలో అనర్గలంగా మాట్లాడుతుంటే దేశ ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు ప్రతిపక్ష నేతలు ప్రజలందరూ ఆమే వాగ్దాటిని చూసి మెచ్చుకోలేక ఉండలేకపోయారు.రైతుల చావుకు కారణమవుతున్న పారాక్వాట్ గడ్డి మందుతాగి చనిపోతున్న తీరుపైలెవనెత్తిన విధానం పారాక్వాట్ గడ్డి మందు పార్లమెంట్ నిషేదించడం కావ్య విజయంగా చెప్పవచ్చు.రైతులప్రతి సమస్యను సభాపతి ఇచ్చిన సమయంలో విశ్లేసిస్తూ వాటి పరిష్కారానికి ప్రజల నేతగా వరంగల్ ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టిన డాక్టర్ కడియం కావ్య ఈ దేశ ప్రజలగొంతుకై నిలబడింది.తన తండ్రి నడవడిక తాను ఎంచుకున్న విధానం కావ్యను మంచి నాయకత్వంలో నిలబడే విదంగా దేశంలో గుర్తింవు తీసుకవచ్చింది.

ఈ దేశంలో వివక్షతకు గురయ్యే ఎస్సి వర్గంలోని కులాల నుండే వివక్షతకు గురయ్యే అత్యంత వెనకబడిన బైండ్ల కులంలో పుట్టి ఉన్నత విద్యను చదివిన శ్రీహరి ప్రభుత్వ అధ్యాపకుడిగా విధుల్లో చేరాడు. ఉద్యోగమే కాదు అణగారిన వర్గాలకు చట్టసభల్లోనే న్యాయం జరిగేలా చూడాలని ఎన్ టి ఆర్ పిలుపు మేరకు తన ఉద్యోగానికి రాజీనామ చేసి రాజకీయాల్లోకి వచ్చాడు.ఆదిలోనే ఎన్నికల్లో నిలబడి ఓటమి పాలుకావడంతో రాజకీయాలల్లో నిలబడేందుకు పాఠంగా తీసుకున్నాడు

అసమానతల సమాజంలో ఆకలి, అవమానలు ఎదుర్కొన్న శ్రీహరి  విద్యార్థి దశలోనే వామపక్ష భావజాలం కలిగి ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి విభాగంలో పనిచేశాడు. అంతకంటే మించి చదువులో గొప్పగా ఎదగాలన్న అతని ఆలోచన ఎన్నో అడ్డంకులను అధిగమించింది. తన కూతుళ్ళను ఆడపిల్లలుగా కాకుండా జ్ఞానానికి ప్రతినిధులుగా పెంచారు.తన పెద్ద కూతురు కావ్యకు సమాజం పై వున్న అవగాహన మనోనిబ్బరం పరిస్థితులు అర్ధం చేసుకునే మనసును చూసి ముచ్చటేసింది. రాజకీయరంగంలోకి వస్తే సమాజానికి కొంత మేలుజరుగుతుందనే ఆలోచనతో తన రాజకీయ వారసురాలిగా ప్రకటించుకున్నారు.

జ్ఞానం ద్వారనే మనిషి ఉన్నత స్థితికి చేరుకుంటారు చదువు ద్వారానే ఆ జ్ఞానాన్ని పొంది అందరిలో ఉన్నతంగా నిలబడగలమని పదేపదే చెప్పే తన తండ్రి మాటలు బాల్యం నుండి ఒంటపట్టించుకున్న కావ్య పుస్తకాలను చదవడమే కాకుండా చుట్టూ సమాజాన్ని గమనించడం మొదలుపెట్టింది చదువుల్లో ముందు వరుసలో నిలబడింది.

తనకు ఇష్టమైన వైద్యవిద్యలో సీటు పొందిన కావ్య హైదరబాద్ లోని డెక్కన్ మెడికల్ కళాశాలలో చదువుతున్న క్రమంలో తన తండ్రి మంత్రిగా కొనసాగుతున్న సమయం అయిన అవేవి పట్టింపులు లేకుండా సాధారణ వ్యక్తిగా కాలేజీకి వెళ్ళిరావడం జరిగేది ఊళ్ళల్లో సర్పంచో ఏ పదవీనో కొనసాగే వ్యక్తుల కుటుంబ సభ్యులు బంధువులు ఎక్కడ లేని విధంగా వుంటారు కావ్య మాత్రం కాలేజీకి ఆర్టీసీ బస్ లో కాలేజీకి వెళ్ళిరావడం ప్రభుత్వ వాహనాలను ఎక్కడ వ్యక్తిగతంగా ఉపయోగించుకోక పోవడం ప్రజల ఆస్తిగా ఉపయోగించే ప్రభుత్వ రంగానికి చెందిన చీపురుపుల్లను సైతం ఉపయోగించుకోకూడదన్న తనలోని చైతన్యమే ఆమెను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది.

రాష్ట్రంలో  ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఎదిగిన  కడియం శ్రీహరి తన పిల్లలను జ్ఞానవం తులుగా నిలపాలన్న సంకల్పం ఆడపిల్లలు అనేభావన లేకుండా పెంచిన తీరు వారిలో మిగిలిన పిల్లల కంటేజ్ఞానంతో పాటు నైతికతను పెంచింది అందులో కావ్య తన తల్లీజీవిన శైలి సైతం ప్రభావం చూపింది. ఓ మంత్రి భార్యనన్న భావన ఆమెలో ఎప్పుడు కనిపించలేదు కూరగాయలు తీసుకరావాలన్న, వ్యక్తిగత పనులకైన ప్రభుత్వ వాహనాలని ఉపయోగించుకోవడానికి ఇష్టపడేది కాదు ఆటోలో ప్రయాణించడం ఇంట్లో సైతం గృహిణిగా గొప్పతల్లిగా కుటుంబాన్ని నడపడడం తన పిల్లలపై ప్రభావం చూపింది.

ఎంబిబిఎస్ పూర్తి చేసిన కావ్య పీజీ ఎంట్రెన్స్లో ర్యాంక్ సాధించిన తర్వాత డబ్బులు చెల్లించి మంచి కోర్సు చేయవచ్చు, తనకు వచ్చిన ర్యాంక్ లో ఉచిత సీటు ఏక్కడ వస్తే అక్కడ చేయాలనీ చెప్పిన తండ్రిమాట డబ్బులతో విద్యను కొనుక్కోవద్దు అనే తన చైతన్యంతో ఉస్మానియా వైద్య కళాశాలలో పాథలాజీ పీజీ వైద్యవిద్యలో చేరి పూర్తి చేసింది.

 

 

 

సమాజానికి ఏదైనా చేయాలన్నసంకల్పం వున్న కావ్య కొంత సమస్యలపైన దృష్టిపెట్టింది. వైద్యవృత్తిలో కొనసాగుతూనే మనషులను చదవడం మొదలుపెట్టింది. పేదరికం ఉన్నత చదువులు చదవలేని వారున్న వ్యవస్థలో తాను ఎంతోకొంత సమాజసేవలో వుండాలనుకున్నది. ప్రతి రోజు అధ్యయనం చేయడం మొదలుపెట్టింది.

కులం మతాల పట్ల మనుషుల మధ్య అసమానతలు గొడవలు విద్వేషాలు ఇన్ని కలగబోసిన భారత దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా అందరిని సమానంగా చూడాలనే తత్వాన్నికలిగించడం జరుగుతుంది. కావ్య కుల అంతరాలనే కాదు మత అభిప్రాయాలను దాటి సమాజం పట్ల అపారమైన జ్ఞానం వైద్యవిద్యలో సృజనాత్మాక కలిగిన డాక్టర్ నజీర్ ను వివాహం చేసుకుంది. తన కూతుళ్ళ ను ఆడపిల్లలుగా కాకుండా మనుషులుగా చూసే చైతన్యం వున్నా తండ్రి శ్రీహరి వివాహనికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే తన కూతురు అన్ని విషయాలల్లో సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం. ఈ దేశంలో మతం కులం వివక్షతతో సాగే మనుషులల్లో మనం సృష్టించుకున్నవాటికంటే మనుషులుగా జీవించాలనే తత్త్వం ఆ కుటుంబంలో నిరంతరం ఒక బొదనగా వుండటం. కావ్య తన వివాహ నిర్ణయానికి కారణమైయింది.

సామాజిక సేవలో ముందుకు పోవాలనుకున్న కావ్య “కడియం పౌండేషన్’ ద్వార సేవలు అందించడం మొదలు పెట్టింది. అధ్యాపకుడు సామాజిక చైతన్యంతో సాగుతున్న అసనాల శ్రీనివాస్ తోపాటు డాక్టర్ ప్రీతి దయాళ్,కొంతమందితో కలిసి అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టింది ప్రధానంగ యాబైకి పైగా పాఠశాలలో పిల్లల స్థితిగతులను అధ్యయనం సింది. ఇప్పటికి మారని బాలికల పరిస్థితులపై చలించిపోయింది. “విద్య’నే కదా మనిషి జీవితాన్ని మార్చేది ఆ “విద్య’కు దూరమయ్యే కారణాలు ఆకలి పేదరికం ఆడపిల్లలుగా పుట్టడమే కాకుడుదు కదా అనుకుని కొంతమంది విద్యార్థినులకు ఆర్థికంగా చేయూతనందించింది.

 

కరోనకాలంలో కడియం పౌండేషన్ ద్వారా అనేక మందికి మాస్కులు వంట సామాగ్రీ అందించి సమాజానికి మేము ఉన్నామనే ధైర్యాన్ని ఇచ్చింది.కరోనా బారిన పడిన వాళ్లకు భరోసా నిచ్చింది. కరోన కష్టకాలంలో కడియం పౌండెషన్ చేసిన సేవలు ప్రత్యేక గుర్తింపుతెచ్చాయి.

 

సమాజాన్ని చదవడం కోసం అనేక మంది మహనీయుల చరిత్రలను వాళ్ళ త్యాగాలను చదువాలనుకుంది. పూలె అంబేద్కర్ ల జీవితాలే కాకుండా డాక్టర్ బాలాగోపాల్ పుస్తకాలను చదవాలని కావ్య చిన్నాన్నగా పిలిచే ఆసనాల శ్రీనివాస్ సూచనను పరిగణలోకి తీసుకోంది.బాలగోపాల్ సాధారణంగా ఏ వ్యక్తి జీవితాన్ని క్రొడీకరించి రాసిన సందర్బలు తక్కువ, కడియం శ్రీహరిమీద రాసిన అక్షరాలు అందరిని కదిలించాయి. ఈ దేశములో అత్యంతవెనకబడిన సామాజిక వర్గం నుండి చట్టసభల్లోకి వచ్చిన కడియం శ్రీహరి తన సామాజిక వర్గం అభివృద్ధి, చదువుకోసం ఎంత మేరకు ప్రభుత్వవ్యవస్థను ఉపయోగించుకోవాలనో అంతమేరకు ఊయోగించి కనీసం ఏ నేతలు చేయని అభివృద్ధిని కడియం శ్రీహరి చేశారని చెప్పడం చర్చనియాంశంగా మారింది బాలాగోపాల్ లాంటి వ్యక్తుల అక్షరాలల్లో కడియం శ్రీహరికి ఒక స్థానం కలిగించడం కావ్య బాలాగోపాల్ ను ఎక్కువ అధ్యయనం చేసింది

 

చాలా కాలం నుండి కావ్య రాజకీయాల్లోకి వస్తుందని ప్రచారంలో వుంది ఎం ఎల్ ఏ గా ఎంపీగా పోటీ చేస్తుందని అనుకున్నారు. కడియం శ్రీహరి తన కూతురులో వున్న సేవా గుణం చూసి ఎక్కడో ఒక చోటి నుండి చట్టసభల్లోకి తీసుక రావాలనే కాంక్షకూడా వుండవచ్చు. కాలంఒక తీర్పు ఇస్తది అన్నట్లు కావ్యను వరంగల్ ప్రజలు ఎంపీ గా చట్టసభల్లోకి పంపించారు. వరంగల్ పార్లమెంట్ నుండి ఎంపికైన మహిళా నేతగా కావ్య ప్రజల గుండె సప్పుడును నిండు సభలో వినిపించే నేతగా ఆందరి దృష్టిలో పడింది.

పార్లమెంట్లో కావ్య మాట్లాడుతుంది అంటే దేశసమస్యల పైన స్పష్టమైన ఆదారాలతో మాట్లాడేనేతగా అధికార ప్రతిపక్ష నేతలు గుర్తించడం అందరూ సమస్యను వినడం మొదలుపెట్టారు.

ప్రధానంగా ఈ దేశములో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మాట్లాడటం మొదలుపెట్టింది మహిళాలపై జరిగిగే వివక్ష,దాడి కనీస అవసరాలు తీర్చలేని అంశాలను లేవనెత్తింది.మహిలకు నెలసరిసమయంలో అత్యధిగామంది మహిళలు ఊయోగించే సానిటరీ ప్యాడ్స్అందుబాటులో లేక పోవడం వల్ల అనేక రకాల ఆనారోగ్యాలు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని గుర్తించి దేశవ్యాప్తంగా శానిటరి ప్యాడ్స్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరికి అందుబాటులో వుండే విధంగా చట్టరూపంలో తీసుకరావాలని, తక్షణమే వాటికి జి ఎస్టీ ని తొలగించాలని పార్లమెంట్ లో విన్పించడంతోదేశ ప్రధాని కేంద్రమంత్రులు, పార్లమెంట్ సభ్యులలో ఆలోచనను రెకేత్తించింది

 

 

 

దేశానికి వెన్నెముకగా చెప్పుకునే రైతు జీవితం ఎప్పుడు అర్ధాకలితో బతకాల్సిన పరిస్థితులేవుంటున్నాయి. పండించిన పంటకు దిగుబడి రాక గిట్టుబాటు దరలేక అప్పుల పాలైన రైతులు మళ్ళీమళ్ళీ పంటలు పండించి అప్పులమీద అప్పులు చేసి పంటచేలపై పురుగుమందులు వాడి చివరకు ఆపురుగుమందుతాగి తనువుచాలించిన రైతులు లక్షలల్లోనే వున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అందులో వరంగల్ రైతులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు ఆ రైతుల ఆత్మహత్యలు కొనసాగుచున్నాయ

 

 

          

పంటఎదుగుదలకు పచ్చని గడ్డి కలుపుమొక్కలు అడ్డంకిగా మారాయని గడ్డిమందులో ఖరీదైన పారాక్వాడ్ గడ్డి మందును రైతులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు “పారాక్వాడ్ ‘ గడ్డిమందు గంటల వ్యవదిలోనే గడ్డిని మాడ్చెస్తుంది. పచ్చి గడ్డినే కాదు పచ్చని మొక్కలు సైతం మాడిపోవడం రైతులు గంటల వ్యవదిలో చూసి ఆనందపడుచున్నారు. అదే రైతులు అప్పుల పాలై పారాక్వాట్ గడ్డి మందు తాగి తమ ప్రాణాలు కోల్పోయారు భూమికి హానిచేసే మనుషుల ప్రాణాలు తీసేగడ్డిమందును నిషేదించాలని పార్లమెంట్ లో కావ్య తన గళం వినిపించించింది.కావ్య వాదనలో వాస్తవాన్ని గ్రహించిన భారత పార్లమెంట్ ఏకగ్రీవంగా పారక్వాట్ గడ్డిమందును దేశవ్యాప్తంగా నిషేదించాలని నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ లో అధికారంలో వున్న పార్టీలు సైతం కావ్య విశ్లేషణకు జైకొట్టడం పారాక్వాట్ గడ్డి మందు పై పూర్తి నిషేదాన్ని ప్రతి పాధిస్తూ ముసాయిదా ఉత్తర్వు జారీ చేయడం పోరాటలకు పురుడుపోసిన వరంగల్ గొంతు పార్లమెంట్ ను కదిలించడంతో అధికార ప్రతి పక్ష నేతలు రాజకీయాలకు అతీతంగా రైతుకుటుంబాల దేశం యావత్తు ఎంపీ కడియం కావ్య పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ దేశంలో విద్యావ్యవస్థలో సంస్కరణలు చేసిన దివంగత ప్రధాని పీవినర్సింహారావు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థల్లో మార్పు తీసుకరావడానికి శ్రీకారం చుట్టింది

కడియం శ్రీహరి. ఎంపీగా కొనసాగుతున్న క్రమంలో బాలికల సంరక్షణ కోసం పార్లమెంట్ ఏర్పాటు చేసిన కమిటీలో డిప్యూటీ ఛైర్మెన్ గా కొనసాగిన కడియం. శ్రీహరి అనేక నిర్ణయాలు తీసుకున్నారు ఇంకా విద్యకు నోచుకోని రాష్ట్రాలు, పల్లెల్లో పాఠశాలల నిర్మాణం గురుకులాలు ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు బాలికల చదువు పదవ తరగతి వరకే ఆగిపోతుంది ఇంకా ఉన్నత చదువులు చదవాలని చెప్పిన వివరణ కడియం ను కదిలించింది.

కస్తూరిబా గురుకులాలను ఇంటర్ విద్యవరకు పొదగించడంలో శ్రీహరిది కీలక పాత్ర ఒక్క తెలంగాణలోనే ఐదు వందల కస్తూరిబా పాఠశాలలు ఇంటర్ వరకు విద్యను అందిస్తున్నాయి. అనేక పాఠశాలల్లో బాలికల పరిస్తులు చూసిన కావ్య తనతండ్రి ద్వారా సాధించుంది

తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పాలని, సరైన విద్యను అందించాలని కావ్య డిమాండ్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనీ, మామూనూర్ లో త్వరగా విమానాలు ఎగరాలని, వైద్య సదుపాయలు కల్పించాలని కావ్య కేంద్రమంత్రులుదగ్గర పార్లమెంట్ లో వినిపిస్తుంది.

రాజకీయాల్లోకి విద్యావంతులు మేధావులు రావాలని అందరూ మాట్లాడుతారు, వాళ్లకు రాజకీయాలంటే పడవు కావ్య లాంటి జ్ఞానవంతులు రాజకీయాల్లో నిలబడితే ఈ దేశం ఆస్తిత్వమే మారిపోతుంది. కావ్య సమాజాన్ని చదివి మనుషులకోసం పనిచేస్తున్న ఓరుగల్లు మట్టి అందించిన ప్రజానాయకురాలు, కావ్యలో రుద్రమ్మ నాయకత్వం కనిపిస్తుంది, కాళోజి దిక్కార స్వరం కనిపిస్తుంది ఇందిరగాంధీ కున్న దీరత్వం పాలన చాతుర్యం కనిపిస్తుంది.

ఓరుగల్లు నుండి దేశవ్యాప్తంగా ప్రజలసమస్యలను ప్రశ్నిస్తున్న పరిస్కార మార్గంకోసం పోరాడుతున్న కావ్య నిజంగా ఓరుగల్లు మట్టిపరిమళమే,భవిష్యత్లో దేశపగ్గాలు చేపట్టే నాయకురాలై ఎదుగుతున్న “యుగనేత్రి’ కావ్య ను ఆదర్శంగా తీసుకుని, వేలాదిమంది లక్షలాది మంది విద్యావంతులు రాజకీయల్లోకి రావల్సిన ఆవశ్యకత వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *