సాహిత్యం సామాజికం పుడమిటివి -ఎంవిఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్

గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ అవార్డు అందుకుంటున్న మందకృష్ణ మాదిగ ( ఫైల్ ఫోటో )

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీఫ్
కులంపునాదుల మీద నిర్మించబడ్డ భారతదేశంలో సామాజిక వివక్షత తరతరాల నుండి కొనసాగుతూనే వుంది పెంపుడు జీవులపై ప్రేమను పంచె మానవ సమూహాలు సాటి మనుషుల పట్ల వివక్ష చూపిస్తూ మనిషిగా జీవించే విచక్షణ కోల్పోతున్నారు. అంతరిక్షాన్ని అధిరోహించె జ్ఞాన సంపన్నులున్న మన దేశములో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఇంకా కుల అంటరానితనాన్ని ప్రదర్శిస్తూనే వున్నారు
చాతుర్వర్ణన బలమైన భావజాలం నుండి కొనసాగుతున్న వివక్షతపై అనేకమంది సామాజిక తత్వవేత్తలు పోరాటం చేస్తూనే వున్నారు. జ్యోతిరావు పూలె, బాబాసాహెబ్ అంబెడ్కర్, లాంటి మహానుభావులు అనేక పోరాటాలు ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు అయినప్పటికీ అతిపెద్ద ప్రజాస్వామిక భారతదేశంలో కులం తన మూలాలను అల్లుకపోతూనేబలమైనవ్యవస్థగా తనఆదిపత్యాన్ని,కొనసాగిస్తుంది ఆధునిక సమాజంలో అంటరాని కులాలుగా విభజిస్తూ ఇంకా వివక్షత కొనసాగుతూనే వుంది

1990 తర్వాత తెలుగు రాష్ట్రలల్లో వామపక్ష ఉద్యమాలు కొనసాగుతున్న సమయం ప్రధానంగా ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ నెత్తుటి చరిత్ర రాసుకుంటున్న సమయం, మండల్ కమీషన్ పై రిజర్వేషన్ పోరాటాలు అనేక సామాజికి ఉద్యమాలతో పాటు అనేకమంది యువకులు, విద్యావంతులు విప్లవ మార్గాన్ని ఎంచుకొని తమజీవితాలను,కోల్పోయినకాలంలో వామపక్ష విప్లమార్గాన్ని ఎంచుకొని సమాజమార్పు కొరకు పనిచేయాలనుకొన్న హన్మకొండ హంటర్ రోడ్డు( రోకళ్ల )శాయంపేటకు చెందిన మందకృష్ణకు కులం ఎంత బలంగా ఉందొ అర్ధమయ్యింది. అడవి బాటపట్టి కుల సమాజంలో సాధించేది కనుచూపుమేర కనిపించలేక పోగా తనకులంపై అంటరాని కులాలపై కొనసాగుతున్న వివక్షత కళ్ళ ముందు కనిపించిండంతో ప్రత్యామ్నాయ ఉద్యమ మార్గం పై అధ్యయనం చేసి కుల ఆస్తిత్వ పోరాటానికి ఆత్మగౌరవ పోరాటానికి శ్రీకారం చుట్టాడు
సమాజంలో అనేక కులాలు తమ కులాలను గొప్పగా చెప్పుకోవడం, ఆదిపత్య భావజాలాన్ని ప్రదర్శించడం.మాదిగ,మాలలతో పాటు సామాజికంగా వెనుకబడిన అనేక కులాలు తమ కులం పేరు చెప్పుకోలేని పరిస్థితిని చూసి, కులాన్ని తక్కువ కులమంటూ అవహేళన చేసే మానవ సమూహలపై మందకృష్ణ పోరాటరూపం ఎత్తుకున్నాడు

కులంపై జరుగుతున్న వివక్షత భరించలేక మతమార్పిడితో తలఎత్తుకోవచ్చన్న వారిని చూసి మతం అంశం పక్కన పెడితే ఆత్మగౌరవ పోరాటానికి సిద్దపడ్డాడు, గొప్ప కులాలుగా చెప్పుకునే వాళ్ళు తమ పేరుచివరన తమ కులాన్ని గోప్పగా చూపిస్తుంటే నాకులానికి సామాజిక హోదా ఎందుకు వుండకూడదు అనుకున్నాడు తన పోరాటంలో ముందుగా తనకులానికి వున్నా వివక్షత పోవాలంటే తన కులం పేరు తన పేరుచివరన వుండాలని సామాజిక ఆత్మగౌరవ పోరాటరూపాన్ని ఎత్తుకొని మంద,”కృష్ణమాదిగ’ గా తన నుండే ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు
వరంగల్ నగరం నడిబొడ్డున వున్న పెద్దమ్మగడ్డలో దండోరా డప్పుల మోత నడుమ పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో మందకృష్ణ మాదిగకు మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికిన రోజును నేను కల్లారా చూశాను.కులంలేని సమాజం అతి చేరువలో వున్నదని కలలు కన్న సామాజిక ఉద్యమ కారులకు మందకృష్ణ మాదిగ కుల పోరాటం అవసరం లేడనిపించింది అది ఆదిలోనే అంతరించి పోతుందని అనుకున్నారు.

ఎం ఆర్ పి ఎస్ ఉద్యమం బలోపితమౌతున్న సమయంలోఅనేకమందితమకులంపేరు చెప్పుకోవడాన్ని ఇష్టపడని వాళ్ళు తమపేరు చివరన మాదిగ’, అని పేరు పెట్టుకొని గర్వంగా ఉద్యమంలో బాగస్వామ్యం అయ్యారు.
ముప్పై ఏళ్లకు పైగా సామాజిక ఉద్యమంగా కులగౌరవం కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ రెండు తెలుగు రాష్ట్రలతో పాటు దేశ వ్యాప్తంగా తన ఆత్మ గౌరవ ఉద్యమాన్ని విస్తరింపచేశాడు.
పిడికెడు మందితో మొదలైన ఉద్యమాన్ని చూసి ఇది కోస్సేల్లదు అని అవహేళన చేసినవాళ్ళు, ఉద్యమాన్ని మధ్యలో వదిలివెళ్లిన వారిని చూసి వెనకడుగు వెయ్యకుండా వందలు, వేలు,లక్షలాదిమందికి వెన్నముకయ్యి ఉద్యమాని దేశ వ్యాప్తంగా బలోపేతం చేసి ఒక్కడయ్యి మొదలుపెట్టి కొట్లాది గొంతుకలల్లో ఉద్యమనినాదమయ్యాడు.
ఒక వైవు ఎంఆర్ పిఎస్ పోరాటం చేస్తూనే మరో వైవు వికలాంగుల కోసం, వితంతువు, వృద్ధుల ఫించన్ ల కోసం అనేక పోరాటలు చేసి వాళ్లకు పెద్దదిక్కయ్యి చేయూతనందించి విజయం సాధించారు.

చిల్లులు పడిన పసిహృదయాల గుండె శబ్దమయ్యి ఉచిత గుండె ఆపరేషన్ లకు ప్రభుత్వాన్ని కదిలించి ఆపరేషన్ లు చేపించి లక్షలాది మంది పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు పెద్దకొడుకయ్యాడు పిల్లల పెదాలపై చిరునవ్వయ్యాడు. ప్రతి ఇంటికి రేషన్ బియ్యం పెంచాలనే డిమాండ్ తో ఆరుకిలోల రేషన్ బియ్యం పథకానికి అమలు చేసేవరకు పోరాడి సాధించాడు.
మందకృష్ణ మాదిగ చేసిన సామాజిక పోరాటల కృషికి, ఉద్యమాలకు పురుడుపోసిన ఓరుగల్లు మట్టికి దక్కిన అరుదైన గౌరవంకేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందించడం ఉద్యమకారులకు మరింత స్ఫూర్తినిస్తుంది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు రావడాన్ని తెలంగాణకు తెలుగు రాష్ట్రలకు ఈ దేశంఇచ్చిన గొప్ప గౌరవంగా చూద్దాం.

మరణించిన జంతు చర్మాలతో మానవ నాగరికతకు అడుగులు వేసి కాళ్లకు చెప్పులను అందించిన రసాయన శాస్త్రవేత్తలు,డప్పును సృష్టించి సమాజానికి సమాచార వ్యవస్థగా దండోర శబ్దమయి ఉద్యమాలకు ఊపిరి పోసిన మాదిగ డప్పు, శుభకార్యాలయాలల్లో స్వరాల వాయిద్యమయ్యిన డప్పు, మనిషి చస్తే కన్నీటి శబ్దమైన డప్పును మోగించే వెలి వాడల నుండి సమాజ నిర్మాణంకోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మాదిగ జాతికోసమే కాకుండా సామాజిక ఆస్తిత్వపోరాటం చేస్తున్న మంద కృష్ణమాదిగా ఈ తరం సామాజిక విప్లవకారుడు
ఎస్సి వర్గీకరణ కోసం సాగుతున్న ఉద్యమంలో మాల మాదిగలతో పాటు యాభైకి పైగా ఎస్సి వెలివాడల వివక్షత కలిగిన సాటి కులాల పట్ల మాట జారకుండా తమ పాట,మాటను, ఎత్తుకొని రాజ్యంలో అధికారం చేపట్టెందుకు అడుగులు వేయాలి
భారత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ఆశయాల సాక్షిగా గణతంత్రదినోత్సవ వేళ ఈ దేశం మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ ఇచ్చి సత్కరించడం ఈ దేశ మూలవాసి జంబూదీపాన్ని ఏలిన జాంబవంతుడి వారసత్వానికి ఇచ్చిన అత్యున్నత గౌరవంగా చూద్దాం సామాజిక ఉద్యమాలకు పురుడు పోసిన ఓరుగల్లు మట్టికి దక్కిన పురస్కారం.
ఈ దేశంలో కుల వివక్షత అంతరించి క్షణం రిజర్వేషన్లు, కులం మతం లేని భారతదేశంగా నిలవాలని కోరుకున్న అంబేద్కర్ ఆశయం వైపుకు అందరం సాగాలని కోరుకుందాం. దేశం సామాజిక ఉద్యమకారుడిగా ఇచ్చిన గౌరవాన్ని ఈ దేశ పౌరుడిగా వివక్షత లేని భారత దేశనిర్మాణంలో మందకృష్ణ మాదిగ ముందు నిలబడాలని కోరుకుంటున్న
మంద కృష్ణ మాదిగ అన్నతో అనేక సందర్భాలల్లో రాజకీయ అంశాలపై మాట్లాడాను కృష్ణ అన్న కాలుకు ఫ్యాక్షర్ అయ్యి నెల రోజుల పాటు మంచం మీదనే వున్నసమయంలో హన్మకొండ వడ్డేపల్లి సమీపంలో ఒక ఇంటిలో వున్న కృష్ణన్నతో మాట్లాడటానికి ఇంటర్వ్యూ చేయడానికి సమాచారం అందిస్తే తన ఆరోగ్యం సహకరించకున్న తప్పకుండా రావాలి తమ్ముడుఅంటూ ఫోన్ లో మాట్లాడాడు, వెళ్లిన వెంటనే ఆత్మీయంగా పలకరించి నాతో రెండు గంటల పాటు రాజకీయ అంశాలపై చర్చించాడు,ఆర్ ఈ సి, లో చదివిన నా సోదరుడు నాగబెల్లి రవీందర్ అలియాస్ చూటేతో ఉద్యమ పరిచయాల జ్ఞాపకాలను పంచుకున్నాడు.
పద్మశ్రీ పొందిన కృష్ణన్నకు అభినందనలతో
( ఈ కథనాన్ని అందించిన మహానగరంలో, మరియు వార్త పత్రికలకు ప్రత్యేక ధన్యవాదాలు)