
అవగాహన కల్పిస్తున్న సిఐ జువ్వాజీ సురేష్

ఎలకంటి నరేష్
బ్యూరో చీప్
వరంగల్ జిల్లా ఆరేపల్లి గ్రామంలోని సుభాష్ చంద్ర బోస్ జంక్షన్ వద్ద ఏనుమాముల సిఐ జవ్వాజి సురేష్ గ్రామ యువత, పెద్దలకు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ జవ్వాజి సురేష్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు యువత, ముఖ్యంగా విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిసై అనేక మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని, విద్యార్థి దశలోనే అలవాటుపడితే భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ, తప్పుదోవ పడితే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
డబ్బుల కోసం మత్తు పదార్థాలకు బానిసలైన యువత దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారని, అనేక కేసుల్లో ఇరుక్కుని జీవితాలను పాడు చేసుకుంటున్నారని తెలిపారు. గ్రామాలలో పేకాట, బెట్టింగ్ వంటి అక్రమాలు కనిపిస్తే వెంటనే 100కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
అలాగే పాఠశాలలు, కళాశాలల సమీపంలో (100 మీటర్ల పరిధిలో) పాన్ షాపులు ఉండకూడదని, వాటిలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు గమనించామని చెప్పారు. అలాంటి దుకాణాలను వెంటనే తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎస్సై ఎం. రాజు మాట్లాడుతూ, సైబర్ నేరాలు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయని తెలిపారు. గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని, ఓటిపి చెప్పమని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని సూచించారు. పొరపాటున వివరాలు ఇచ్చినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం ఇవ్వాలని తెలిపారు.
సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్:
ఎలాంటి అనుమానాస్పద కాల్స్ వచ్చినా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే 100కు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు సంప్రదించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ యువత, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు