
నర్సంపేట ప్రాజెక్టు పరిధిలోని నర్సంపేట – 4 అంగన్వాడి కేంద్రంలో ECCE డే ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా స్థానిక అంగన్వాడి టీచర్ నల్లభారతి బడికి సంసిద్ధత – పిల్లల్లో నైపుణ్యాలు అనే అంశం పైన మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తరువాత అంగన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్ కు చేర్చిన పిల్లలకు ఆటపాటల ద్వారా విద్యనందిస్తున్నాము అని ఈ కేంద్రాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రంలో ఐదు సంవత్సరాలు పూర్తయిన వారిని ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేస్తున్నాము అని ఎలాంటి ఖర్చు లేకుండా పిల్లలకు పౌష్టికాహారం అందించడంతోపాటు పూర్వ గణిత, పూర్వ లిఖిత, పఠనం చేపిస్తూ పాఠశాలకు సంసిద్ధులను చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక అంగన్వాడి టీచర్ నల్ల భారతి, Md గౌసియా, ఆయా సునీత, ప్రీస్కూల్ పిల్లల తల్లులు చామంతుల మానస, నగునూరి మౌనిక, బూస ప్రవళిక, బల్ల అనూష, రామగిరి శిరీష, మద్దెల శృతి, బాదావత్ దివ్య, బొల్లు శ్రావణి, అయిత శ్రీకళ, బోళ్ల సుష్మిత, బల్ల కవిత, తల్లులు పిల్లలు పాల్గొన్నారు.