
నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీప్పుడమిటివి న్యూస్ &ఎంవిఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్

ఏసీపీ మధుసూదన్ ఫైల్ ఫోటో
సాదారణ ప్రజలకు చిరునవ్వు తో కనిపిస్తాడు నేరవిచారణలో మెర్క్యూరై సాగిపోతాడు..ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు పోలీస్ అధికారిగా సేవలందించిన వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ, ఎ. మధుసూదన్ సర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత సేవా పథకం అందించడం. విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేసే పోలీసు అధికారులకు సముచిత గౌరవం దక్కినట్లవుతుంది.
దేశంలో ఎక్కడలేని నక్సల్స్ గ్రూపులకు కంచుకోటగా వున్నా ములుగు ఏజెన్సీలో( ప్రస్తుతం ములుగు జిల్లాలో)ని మంగపేట పోలీస్ స్టేషన్ ఎస్సైగా 1991బ్యాచ్ కు చెందిన మధుసూధన్ మొదటి పోస్టింగ్ లో చేరారు. చేరిన కొద్దీ రోజులల్లోనే ఆ ప్రాంతం మీద పట్టు సాధించారు.నవ యువకుడిగా విధుల్లో చేరిన ఎస్సైని చూసిన స్థానిక ప్రజలు జంకారు, యువరక్తం కాబట్టి వెంటనే స్పందించడం దైర్యంగా ముందుకెళ్లడం నక్సల్స్ కదలికలపై నిఘా పెంచి నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషించారు.
తాను పనిచేస్తున్న ప్రాంతం అడవి ప్రాంతం కావడం అడవినే నమ్ముకొని నివశించే ఆదివాసి గిరిజనుల జీవన విధానం,నిరక్షరాస్యత, అమాయకత్వంలో వున్న ప్రజల్ని చూసి చలించి పోయారు.
ఒక పోలీసు అధికారి సామాజిక కోణంలో సమస్యలపై దృష్టిపెడితే యువతను నక్సల్స్ నుండి దూరం చేయవచ్చని,నేరస్తులుగా మారకుండ,చూడవచ్చని, ఆచరణాత్మాకంగాపనిచేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు..

మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కమలాపురం రేయాన్స్ ఫ్యాక్టరీ వుంది. అది ఒకరకంగ దేశంలోనే పేరున్న పేపర్ కంపెనీలలో ఒకటీగా చెప్పవచ్చు అక్కడ కార్మికుల పోరాటాలు అదే సమయంలో నక్సలైట్ గ్రూప్ ల సంచారం గోదావరినది ప్రవహించు ప్రాంతం కావడం చుట్టూ దట్టమైన అడవి కావడం పోలీసులకు పెద్ద సవాలుగా వుండేది.నిరంతరం నిప్పుల కొలిమిగా వుండేది ఒక రకంగా ఆ ప్రాంతంలో పనిచేయడమంటే వ్యక్తిగత జీవితం కోల్పోవడం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించడం ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో తెలియని పరిస్థితి వుండేది అయినప్పటికీ తనలోని ధైర్య సాహసాలు
సమర్ధ వంతంగా విధులు నిర్వర్తించడానికి దోహద పడ్డాయి.
అడవిలో ఏ గూడెంలో చూసిన ఏ పల్లెలోకి వెళ్లిన, పేదరికం నిరక్షరాస్యత ఆర్ధిక వెనకబాటుతనం ఇవన్నీ ఆధునిక సమాజంలోకి వారిని రానియ్యని పరిస్థితి, రాత్రంతా నక్సల్స్ సంచారం పగలు పోలీసుల ప్రవేశం, అన్నలతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు స్టేషన్ కు పిలిపించడం,, వారి వారి పద్ధతుల్లో అడగటం,పోలీసులను కలిశారని నక్సల్స్ నిందించడం, ఒక రకంగ ఆదివాసి యువకులు అనుభవిస్తున్న వ్యధగా చెప్పవచ్చు
మధుసూదన్ సార్ డ్యూటిలో చేరిన తర్వాత అక్కడి యువకులతో కలిసిపోయి వారి భాదల్ని తెలుసుకోవడం వారికి సహకారం అందించడంతో వారికి ఒక నమ్మకం ఏర్పడింది. ఈ పోలీస్ అధికారి అందరిలా కాదు అనే అభిప్రాయానికి ఆదివాసిలు వచ్చారు. వారికోసం అంతటితో ఆగకుండా
ఆదివాసి యువతకు చదువు నేర్పించడం, పని కలిపించడం, అవసరమని గుర్తించారు. ప్రధాన సమస్య పేదరికమని గుర్తించి, వారికి మెరుగైన చదువు అందాలని అనుకున్నారు గొప్పగా చదువు కోవాలనే యువతకు తోడైయ్యిండు. వందలాది మందికి గొప్ప చదువులు చదివే విధంగా చేయూతనందించిండు.యువతకు స్థానికంగ ఉపాధి కల్పించడంలో దృష్టిపెట్టి వారికి దైర్యమై నిలిచాడు.
ములుగు ఏజెన్సీ లోనే ఎక్కువ కాలం విధులు నిర్వర్తించడం అక్కడి ప్రజల్లో ఒకరిగా కలిసిపోయారు.ఏటూరునాగారం సిఐ గా పనిచేశారు, నక్సలైట్ ల లొంగు బాటులో క్రియాశీలకపాత్ర పోషించారు. స్థానిక ప్రజలు ఇప్పటికి మధుసూదన్ సార్ అంటే మాకు ప్రాణాలు పోసిన దేవుడిగా చెపుతుంటారు,కొందరు మేము భూమి మీద ఉన్నామంటే సార్ అందించిన జీవితమే అంటారు. అలాగే యువతను విద్యావంతులుగా మార్చిన అధికారిగా చెపుతారు.
నక్సల్స్ వైపుకు వెళ్లే యువతను గుర్తించి అటువైపు వెళ్ళకుండా నివారించి వారికి ఉపాధి కల్పించారు
లొంగిపోయిన నక్సల్స్ కు స్వతహాగా ఆర్ధికంగ చేయూతనందించారు. వివిధ విప్లవ గ్రూప్ లల్లో పనిచేసి లొంగిపోయిన వారిని ఇన్ఫర్మార్స్ గా మారాలని ఒత్తిడి చేయకుండా వారిని హుందాగా బతికే విధంగా ఆర్థికంగ సహకారం అందించి వారి కుటుంబాలను నిలబెట్టాడు.,ఎవ్వరికి ఏ ఆపద వచ్చిన తన కుటుంబంలో సభ్యుడిల సహకరించిన రక్త బంధం కానీ ఆత్మీయ బంధంగా అక్కడి ప్రజలు ఇప్పటికి మధుసూదన్ సర్ ను కొనియాడుతారు.
హాసన్ పర్తి రహదారి పక్కనే ఓ విటుడు బావిలో పడి చనిపోయిన సంఘటన అప్పట్లో సంచలనం రేపింది.
అది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనియాంశం అయ్యింద.
పోలీసులు కూడా ఆ సంఘటనతో ఎలా రియాక్ట్ అవుతారోననే భయం ఆ సంఘటనకు కారణమైన కుటుంబాలల్లో భయం నెలకొన్న సమయం.
కాతీయుల కాలంనుండే ఒకరికి పండయ్యి జీవించే వాళ్ళు హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోనే రెండు మూడు గ్రామాలల్లో కొన్ని కుటుంబాలు తమ వృత్తిని కొనసాగిస్తున్నాయి నగరానికి.సమీపంలో ఇప్పటికి ఆ వృత్తి కొనసాగడం స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు. బావిలో పడి అనుమానస్పదంగా చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులు సాధారణ ప్రజలతో పాటు స్థానిక ప్రజలు ఆలాంటి కుటుంబాలపై నిరసన పెరిగి పోతుంది.
హాసన్ పర్తి పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మధుసూధన్ సర్ తాత్కాలీకంగా కాకుండా హాసన్ పర్తి లో అలాంటి కుటుంబాలకు సరైన మార్గం చూపించాలని ఉన్నత అధికారుల సహకారంతో సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకొని ఆ కుటుంబాల నుండి కొందరిని వాలంటరీలను ఏర్పాటు చేసి,వారిలో చైతన్యం పెంపొందించారుహాసన్ పర్తి లో ఆ వృత్తినుండి ఎక్కువ మందిని దూరం చేసి వారిని చదివించారు, అధికారుల సహకారంతో పనిని కల్పించారు, దీంతో ఆ కుటుంబాలల్లో మార్పు మొదలయ్యింది.
ఒకరికి పండై తణువంత పుండై జీవించే యువతుల జీవితాలల్లో కొత్తవెలుగులు ప్రసరించాయి. గొప్పగా చదివారు విదేశాలల్లో స్థిర పడ్డారు ఆ వృత్తిని వదిలివేసుకొని గొప్పగా జీవిస్తూ ఆర్ధికంగా ఎదిగిన కుటుంబాలు సాధారణ ప్రజల మాదిరిగానే గౌరవంగా జీవిస్తున్నారు. ఆ కుటుంబాల నుండి వాలంటరీ గా పనిచేసిన మహిళతో మాట్లాడినప్పుడు,ఆమె స్పందనలో ఒక్క మాటలో మధుసూధన్ సర్ చేసిన సహకారం మా జీవితాలల్లో వెలుగులు నింపి అందరి జీవితాలలాగే మా జీవితాలు మారాయని అప్పటి జ్ఞాపకాలను చెప్పింది మాకు ఉపాధి కల్పించి అందరిలాగే గౌరవంగా జీవించే విధంగా మధుసూదన్ సార్ చేసిన సేవను, వెలకట్టలేమని అన్నారు
ఆరెపల్లి సమీపంలోని దామేర క్రాస్ రోడ్డు వద్ద ఒక రోడ్డు ప్రమాదం జరిగింది ఇసుక లారీ ఆటోను ఢీ కొట్టిన సంఘటన అప్పటికి సమాచార వ్యవస్థ తక్కువనే ఇరవై నిమిషాలాల్లో మధుసూధన్ సార్ పోలీసు వాహనంలో చెరుకున్నాడు.ఆ సంఘటన కన్నీళ్లను తెప్పించేవిధంగా వుంది. ఆటోలో తమ ఇంటికి వెళుతున్న కుటుంబం ప్రాణాలు పోయాయి అందులో ఓ పసి పిల్లతల్లి తన బిడ్డను హృదయానికి హద్దుకొని కొన ఊపిరిలో తన బిడ్డను రక్షించె ప్రయత్నం ప్రతి హృదయాన్ని కలిచివేసింది ఆ ప్రమాదానికి ప్రధానకారణం కల్వర్ట్ దగ్గర సరైన సిగ్నల్స్ లేకపోవడం అలాంటి సంఘటనే అరెపల్లి ప్రస్తుతం వున్న ఎస్ బి ఐ బ్యాంక్ పక్కన వున్న కల్వర్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొందరు చనిపోయారు.అయ్యప్ప గుడినుండి దామేర క్రాస్ వరకు జరిగే ప్రమాదలల్లో చాలమంది ప్రాణాలు కోల్పోయారీ, కల్వర్ట్ లకు రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేపించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకొన్నారు.
వేతనాలే లేని వ్యవస్థలో ప్యాసన్ గా సమాజం మీద ప్రేమతో జర్నలిజం లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది విద్యావంతులు వున్నారు. అలా జర్నలిస్ట్ గా పనిచేస్తున్న రౌతు అజయ్ మధుసూదన్ సర్ ను కలిసిన సందర్భంలో నీకున్న పరిస్థితులు జ్ఞానం ఇక్కడితో ఆగవద్దని నీ చదువు తగిన ఉద్యోగాన్ని ఎంచుకొమ్మని ఒక రకంగా జ్ఞానోదయం చేశారు. విలువైన సూచనన స్వీకరించిన అజయ్ ఫార్మ కంపెనీలో చేరారు. జర్నలిజాన్ని పార్ట్ టైంగా ఎంచుకొని ఇవ్వాల వేలేరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గా కొనసాగుతున్నారు.రేగొండలో కొందరు విద్యావంతులకు ఉపాధి కల్పించారు.
హన్మకొండ, సిఐ గా నగరం లో రౌడీ షీటర్ల పైన ఉక్కుపాదం మోపారు వాళ్ళల్లో మార్పు తీసుకవచ్చే ప్రయత్నం చేశారుటాస్క్ పోర్స్ ఏసిపి గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ సార్ అనేక కేసులను చేదించడంలో చేసిన సేవకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత సేవా పథకం అందచేయడం అభినందనీయం
ఉత్తమ సేవా పతకాలను అందుకున్న క్రైమ్ ఏసిపి సదయ్య,సర్ కు ఏ. ఎస్.ఐ వేణుగోపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ పి. రమేష్ బాబు కు , సేవా పతకాలను అందుకున్న తొమ్మిది మంది అధికారులు ఏ ఎస్. ఐ కనక చంద్రం,ఏ. ఎస్. ఐలు జయదేవ్,పాపయ్య, చేరాలు,అర్జున్,హెడ్ కానిస్టేబుళ్ళు అమీర్ పాషా,నర్సింగరావు,శ్యామ్ సుందర్ రెడ్డి,స్వర్ణ లత ఓరుగల్లు కీర్తి ని రాష్ట్ర స్థాయిలో నిలిపిన ఓరుగల్లు పోలీసులకు అభినంధనలు
నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న సమయంలో మధుసూదన్ సర్ పోలీస్ అధికారిగా గా విధులు నిర్వహిస్తున్నారుహాసన్ పర్తి పరిధిలో
మాగ్రామం వుండేది.ఆరెపల్లి లో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటన సమయంలో వార్త సేకరణ కోసం వెళ్ళాను అలాగే సార్ ను దగ్గరగా చూశాను.అందుకే సార్ పట్ల గొప్పగౌరవం వుంటుంది నిక్కచ్చి అధికారిగా తానుచేసిన సేవలని చూసి అభినందనలు సర్ మీ లాంటి అధికారులుంటే నాలుగో సింహనికి మరింత గౌరవం దక్కుతుంది.