ఐదుగురు గంజాయి స్మగ్లర్లకు 20 ఏళ్ల జైలు శిక్ష

 

నాగబెల్లి అరుణ్ కుమార్
పుడమిటివి క్రైం బ్యూరో

 

ఆత్మకూర్ గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడిన ఐదుగురు నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి అదనపు జిల్లా కోర్ట్ న్యాయమూర్తి బి. అపర్ణాదేవి బుధవారం తీర్పు చెప్పారు.

ప్రాసిక్యూషన్ కథనం మేరకు శాయంపేట, ఆత్మకూర్ మండలాలకు చెందిన పావురాల వెంకటేష్, అబ్బోజు వెంకటేష్,పరుపల్లి కార్తీక్, అనంతుల సాంబయ్య కొక్కరకొండ చంద్రయ్యలు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన నిందితులందరు, ఓ ముఠాగా ఏర్పడి, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రాంతంలో పెద్ద మొత్తంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, ఎక్కువ మొత్తంలో మహారాష్ట్రలో విక్రయించేందుకు, రహస్యంగా కార్లో స్మగ్లింగ్ పాల్పడుతున్న ఐదు నిందితులను ఆత్మకూరు పోలీసులు చౌలపల్లి గ్రామ శివారు ప్రాంతంలో అరెస్ట్ చేసి వీరి నుండి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అప్పటి ఆత్మకూరు ఇన్స్పెక్టర్ రాజలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నేరం రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. రాజమల్లారెడ్డి వాదించగా, ప్రస్తుతం ఇన్స్ స్పెక్టర్ ఆర్.సంతోష్,కోర్టు లైజన్ మహిళా ఆఫీసర్ కె. పరమేశ్వరి, కానిస్టేబుల్ ఆర్. ఉమేష్ పలువురు సాక్షులను కోర్టులో హాజరుపర్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *