భద్రత చర్యలపై దృష్టి పెట్టాలి

 

పుడమి టివి న్యూస్

ద్రతా సమీక్షా సమావేశా న్ని నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ , దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్  వివిధ శాఖల ప్రధాన అధిపతులతో కలిసి, సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై ఒక సవివరమైన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు మరియు నాందేడ్ వంటి ఆరు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు.

రైలు కార్యకలాపాలపై జోన్ అంతటా తీసుకోవాల్సిన తగు భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, సమస్యల పరిష్కారానికి ఒక క్రమబద్ధమైన మరియు దశలవారీ విధానాన్ని అనుసరించాలని శ్రీ శ్రీవాస్తవ నొక్కి చెప్పారు. అనివార్య సంఘటలను నివారించడానికి ట్రాక్‌ల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా పాయింట్లు & క్రాసింగ్‌లు, భద్రతకు సంభంధించిన అలారమ్ ల వద్ద భద్రతా డ్రైవ్‌లు మరియు తనిఖీలను చేపట్టడం యొక్క ప్రాముఖ్యతను ఆయన హైలైట్ చేశారు.

ట్రాక్‌ల సమీపంలో పనులు జరుగుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సిబ్బందిని అప్రమత్తం చేయడానికి పని స్వభావం ఆధారంగా అవసరమైన హెచ్చరిక ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన అధికారులకు మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు.

రైల్వే ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి, భద్రతా పరికరాల నిర్వహణ మొదలైన భద్రతా జాగ్రత్తలను కూడా శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమీక్షించారు. ఆయన నాన్-ఇంటర్‌లాక్డ్ లెవెల్ క్రాసింగ్ గేట్లను కూడా పరిశీలించారు. అంతేకాకుండా, జనరల్ మేనేజర్ జోన్ అంతటా రైలు ఫిట్టింగ్‌ల నాణ్యతను సమీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *