*పాట తీరు మారాలి ఉత్పత్తి శక్తిగా నిలవాలి

పుడమి టివి సామాజికం సాహిత్యం-ఎంవిఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీఫ్

ఒక్క పాట ప్రపంచ చరిత్రను మార్చేస్తుంది. ప్రతి మనిషిని కదిలిస్తుంది. ఈ భూగోళం మీద జరిగిన ప్రతి ఆవిష్కరణను సామాన్య ప్రజల ముందు నిలబెట్టేది పాట మాత్రమే, పాటను రాసిన అక్షర యోధులు జనహృదయాలను కదిలించిన గొంతుకలు సామాజిక చైతన్యాన్ని కలిగించే శాస్త్రవేత్తలే అన్నది నిత్యసత్యం.

మానవ పరిణామ క్రమంలో మూగ జీవులనుండి వెలువడిన శబ్ద తరంగాలే పాట పుట్టుకకు కారణం . శ్రమలో అలసట లేకుండా తనను తాను మైమరిపించే పదాల అల్లికలే పాట. శ్రమశక్తులు కష్టజీవుల హృదయస్పందనలే సప్త స్వరాల సంగీతమయ్యి అందరినీ మేల్కొలిపే శక్తిగా పాట మారింది.

దేశ స్వాతంత్ర్య పోరాటాల నుండి తెలంగాణ సాయుధ పోరాటాలు,తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలల్లో ప్రజల్ని కదిలించడలో పాటల గొంతుకలు,కళాకారుల పాత్ర వెలకట్టలేనిది.

వామపక్ష ఉద్యమాల్లో యువతను, విద్యార్థులను ఉత్తేజ పరచడంలో ప్రజలను తమ భావజాలం వైపు మరల్చడంలో పాట పాత్ర గొప్పది.పాటను పాడే గొంతుకలు ప్రజల గొంతుకులగా చరిత్రలో నిలిచి పోయారు. ఉద్యమంలో పనిచేసి చనిపోయిన వారి పాటలు పాడి వినిపించి మరణించిన వారిని సమాజంలొ బతికించారు. పాటలో గాయకులు జీవించారు.

అరుణోదయ నాగన్న నాకు ప్రత్యేక్షంగా పరోక్షంగా పరిచయము లేకున్న పాటకోసం తన జీవిత ప్రయాణం కొనసాగించడం గొప్ప విషయం. అరుణోదయ రామారావుతో వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భాలు ఒకటి రెండు సార్లు వున్నాయి. అతను మరణించడానికి కొన్ని నెలల ముందు.అలాగే నా బాల్యంలో వరంగల్ ఆర్ ఈ సి లో రామారావు పాటను విన్నాను. ఆ రోజుల్లో ఎం టే క్ ,చదివిన నా సోదరుడు అనేక సందర్భాలలో చెప్పిన మాటలు గుర్తుకున్నాయి. గద్దర్ కంటే గొప్ప పాటల గొంతుక రామారావుదని అలాంటి పాటల గొంతుకలు అరుదని అరుణోదయ రామారావు గురించి అతని పాటను ముద్దాడే ప్రతి వ్యక్తి హృదయ స్పందన. ఆ గొంతుక పరంపరే అరుణోదయ నాగన్నగా చెప్పవచ్చు.

ప్రజా గాయకుడిగా జన హృదయాల్లో నిలిచిసాగుతున్న పాటల గొంతుక కావడం వల్లనే నాగన్న కు సుద్దాల హనుమంత్ అవార్డు ఇవ్వడం జరుగుతుందనేది వాస్తవం.

పాటకు ప్రాణం ఇట్లా వుంటుంది అది ప్రజల హృదయలానుకదిలిస్తుందా తన హవ భావాలతో పాటను గుండే నిండా హద్దుకొని సినీ జానపద ఉద్యమ పాటలతో ప్రజల్ని చైతన్యము చేస్తున్న సుద్దాల అశోక్ తేజ సాహిత్య పరంపర సుద్దాల హనుమంతు నుండి అందుకొని తెలుగు సాహిత్య పాటల ప్రపంచంలో తనదైన ముద్రవేశారు.

1995 లో హైదారాబాద్ జరిగిన రచయితల సంఘం సమావేశంలో అర్థరాత్రి అందరం నిద్రలోకి జారుకున్న సమయంలో రైతు జీవితాన్నీ గూర్చి అశోక్ తేజ ఆలపించిన “ఆకు పచ్చ చందమామ’ పాట అందరిని నిద్రమత్తు నుండి ఒక్క సారిగా మెల్కొల్పింది. అదే రోజు పాడిన పాట ‘పచ్చాని ఆకుల నడుమ పంట కంకి వయ్యో’ మా కడుపుల మెతుకువయ్య పాట అక్కడ వున్న వాళ్ళని కదిలించాయి పాతికేళ్ల తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యి రైతులను ప్రజలను కదిలిస్తుంది. ఆరోజు మంజీర రచయితల సంఘం గూర్చి,సుద్దాల అశోక్ తేజ గూర్చి ప్రజల్ని తన పాటల ద్వారా చైతన్యము చేసిన సుద్దాల హనుమంత్ గూర్చి తెలుసుకున్నాను.

సుద్దాల హనుమంతు అవార్డు ఇవ్వడం అంటే తెలంగాణ భాషను, తెలుగు భాషను పాటను బతికించడం కొన్ని తరాలకు అందించడమే. పాటల గొంతుకలల్లో ప్రజల హృదయాల్లో హనుమంత్ జీవించడమే

తమ జీవితాలను ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన వారికోసం రాసిన పాటలు ప్రజల్లో నిలిచిపోవడం ఎంత నిజమో ఇప్పుడు పాట ఉత్పత్తి శక్తుల వైపుకు ప్రజల్ని మరలిచే పాటలు పుట్టుక రావాలి. ఉచితలాకు అలవాటు పడి జీవన శైలిని మార్చేసుకొని సోమరిపోతుల్ల మారిన ప్రజల్లో పనిచేసే తత్వాన్ని అలవరిచే పాటలు రావాలి. సుద్దాల హనుమంతుచేసిన గొప్ప పని అదే ప్రజల బతుకు దెరువే పాటగ మలచుకొని. మనిషిని పని వైపుకు మరల్చిన గొప్ప సృజనాత్మక సాహిత్యం సుద్దాల హనుమంత్ దీ. అలాంటి సాహిత్యం పాటలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం వుంది.

మరణం గొప్పది అనిచెప్పి అమరత్వం గురించి రాసే పాటలకంటే పాటల తీరు మారాలి మరణించడం కంటే జీవించడం ఎంత గొప్పో చెప్పగలగాలి విప్లవం అంటే చంపడమో చావడమో కాదు బతకడం బతికించడం మనిషిగా జీవించడం అనే చైతన్యాన్ని ముఖ్యంగా యువతను కదిలించే పాటలు పుట్టుక రావాలి.

గద్దర్,శంకర్ సారంగపాణి గోరటి వెంకన్న,జయరాజ్ గిద్దె రాంనర్సయ్య, గర్జన యష్పాల్ , వరంగల్  బి కె ,వడ్లకొండ అనిల్ ,దార దేవేందర్, గద్దర్ సాంబయ్య, మిట్టపల్లి సురేందర్ , నల్గొండ గద్దర్ నరసన్న, నిన్ను విడిచి వుండలేమమ్మ ఓ పాటమ్మ అంటూ పాటను ప్రజల్లో వదిలి అందరికీ దూరమైన భిక్షపతి, ఇయ్యాల అరుణోదయ నాగన్న కోసం కవులను రచయితలను పాటల గొంతుకలను మాలగా మార్చిన కవి గాయకుడు యోచనతో పాటు తెలంగాణ తొలి పొద్దులో పాటలవెలుగులైన అనేకమంది గాయకులు, రచయుతలు కళాకారుల గజ్జెల సవ్వడి నుండి అక్షరాలా నుండి పాటల గొంతుకల నుండి పాట తీరుమారాలి ప్రజల్ని ఉత్పత్తి శక్తులుగా మార్చాలి, ప్రపంచ గ్లోబల్ విలేజ్ లో తెలంగాణ ప్రజల్ని తెలుగు ప్రజల్ని దేశ ప్రజల్ని ముందు వరసలో నిలబెట్టే శక్తులుగా మార్చే దిశగా అడుగులుపడాలి.

ప్రజల గుండెల్లో జీవిస్తున్న సుద్దాల హనుమంత్ కు నివాళి అర్పిస్తూ అవార్డును అందుకుంటున్న పాటల ఊట అరుణోదయ నాగన్నకు అభినందనలు. సమాజ మార్పుకోసం చైతన్యపు వెలుగులై అక్షర విత్తనాలను వెదజల్లుతున్న కవులు రచయితలు గాయకులు కళాకారులకు 🙏🙏🙏🙏🙏 వందనాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *